Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెడికేషన్ తో రెండు సార్లు గుండు చేయించుకుని, బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నారు

డీవీ
బుధవారం, 24 జనవరి 2024 (17:37 IST)
Ambajipet Marriage Band team
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 
 
ఈ కార్యక్రమంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, నేను నిర్మాతగా నిలబడటానికి కారణం అల్లు అరవింద్, బన్నీ వాస్ గారు. మా సంస్థలో సినిమా చేస్తే తప్పకుండా హిట్ మూవీనే చేయాలి అనుకున్నాం. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" కథ వినగానే బన్నీ వాస్ గారు నేను చాలా ఎగ్జైట్ అయ్యాం. సుహాస్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి మూవీ చేశాడు. ఆయనకు అప్పటికే కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయాలనే తపన సుహాస్ లో కనిపించింది. రెండు సార్లు ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు. సుహాస్ తో పాటు హీరోయిన్ శివానీ, శరణ్య ప్రదీప్..ఇలా కాస్ట్ అంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. సినిమాటోగ్రాఫర్ వాజిద్ అమలాపురం ప్రాంతాన్ని అందంగా తెరకెక్కించారు. మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. మా సంస్థలో బేబి వంటి బ్లాక్ బస్టర్ ను మీరు అందించారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ఇస్తారని ఆశిస్తున్నాం. వెంకటేష్ మహా ప్రెజెంటర్ గా ఈ మూవీ మేము ప్రొడ్యూస్ చేశాం. చిన్న సినిమాలకు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే పెద్ద బ్యానర్స్ సపోర్ట్ ఉండాలి. అలా మాకు గీతా సంస్థ సపోర్ట్ ఉంది. బేబి సినిమాకు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" తో పోలికలు పెట్టుకోవద్దు. ఇవి రెండు వేర్వేరు జానర్ మూవీస్. ఏ మూవీ సక్సెస్ ఆ మూవీకే ఉంటుంది. మా ప్రతి సినిమాకు అల్లు అర్జున్ సపోర్ట్ ఉంటుంది. మా సంస్థలో చాలా మూవీస్ రాబోతున్నాయి. అరవింద్ గారి పేరు నిలబెట్టేలా ప్రతి సినిమాకు కష్టపడతాం. అన్నారు.
 
హీరో సుహాస్ మాట్లాడుతూ, ట్రైలర్ కు మీ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ. కథ విన్నప్పటి నుంచి నాతో పాటు మా టీమ్ అంతా ఈ ప్రాజెక్ట్ కు డెడికేట్ అయ్యాం. రెండు సార్లు గుండు చేయించుకున్నా. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథ మీద నమ్మకంతోనే అంతగా కనెక్ట్ అయి వర్క్ చేశాం. సినిమా చూస్తున్నప్పుడు మీరు చాలా సందర్భాల్లో మీ లైఫ్ లో జరిగిన సందర్భాలను రిలేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 2న మా సినిమాకు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు
 
నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ - మీ లవ్ అండ్ సపోర్ట్ మా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ టీమ్ మొత్తానికీ కావాలి. మీకు టీజర్, ట్రైలర్ ఎంత నచ్చింది అనేది మీ రెస్పాన్స్ తోనే తెలుస్తోంది. ఇలాగే సినిమా కూడా డెఫనెట్ గా నచ్చుతుంది. సినిమా చూసి అంబాజీపేట వైబ్స్ ఫీల్ అవుతారు. అన్నారు.
 
డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ట్రైలర్ మీకు బాగా నచ్చిందని మీ హ్యాపీనెస్, రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఊరిలో జరిగే కథ కాబట్టి కులాల ప్రస్తావన ఉంటుంది. అయితే ఎవరినీ కించపరిచే అంశాలు మూవీలో ఉండవు. ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి వస్తున్న "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను మీ చేతుల్లో పెడుతున్నాం. మీరే సూపర్ హిట్ చేయాలి. సినిమా మేకింగ్ లో నాకు సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా మీద మీరు చూపిస్తున్న రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది. థియేటర్స్ లో డబుల్ ధమాకాలా మా మూవీ ఉంటుందని ప్రామిస్ చేసి చెప్పగలను. ఇంకా 9 రోజుల్లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" థియేటర్స్ లోకి వస్తోంది. టీమ్ అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మా సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, ట్రైలర్ హిట్ చేశారు. అలాగే సినిమాను కూడా సూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత మీదే. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లతో కలిసి థియేటర్స్ కు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments