సింగిల్ కారెక్టర్‌తో సాగే ఆదిత్య ఓం బంధీ ట్రైలర్

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (15:22 IST)
Adithy om- bandi
సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ప్రయోగమే ఆదిత్య ఓం చేయబోతున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆదిత్య ఓం ఈ సారి ‘బంధీ’ అంటూ అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు.
 
తాజాగా బంధీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాడు. ఓ సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపించాడు. ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటారు. స్వేచ్చగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బంధీగా రూపొందించారు. ఇక ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించారు. చివరకు నగ్నంగా కనిపించే షాట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం.
 
ఈ చిత్రానికి వీరల్, లవన్, సుదేష్ సావంత్ సంగీతాన్ని అందించారు. మధుసూధన్ కోట సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేశారు. మూడేళ్లు కష్టపడి ఏడాదిలో ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేశారు. పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments