Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతన్యం కలిగించే యశోద, మూవీ రివ్యూ రిపోర్ట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (14:01 IST)
yashoda poster
నటీనటులు: సమంత-వరలక్ష్మి శరత్ కుమార్-ఉన్ని ముకుందన్-రావు రమేష్-సంపత్-మురళీ శర్మ-శత్రు-కల్పిక గణేష్-దివ్య శ్రీపాద తదితరులు
సాంకేతికత- ఛాయాగ్రహణం: సుకుమార్, సంగీతం: మణిశర్మ,  మాటలు: పులగం చిన్ననారాయణ-చల్లా భాగ్యలక్ష్మి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరి-హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్. 
 
సినిమా అంటే వినోదంతో పాటు ప్రజలను ఎడ్యుకేట్  చేయాలి. కానీ రెండోది మర్చిపోయి కేవలం వినోదంతో పాటు హింస, ద్యందార్థాలు ఉన్న కథలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో బేస్డ్ కథలే ఎక్కువగా రాజ్యమేలుతున్న తరుణంలో అప్పుడప్పుడు హీరోయిన్ బేస్డ్ కథలే వేళ్ళమీద లెక్కించే విధంగా వస్తున్నాయి. అందులో ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. యు టర్న్, ఓ బేబీ లాంటి చిత్రాలతో మెప్పించిన తను ఇప్పుడు 'యశోద'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకులు హరి-హరీష్ రూపొందించిన ఈ చిత్రాన్ని ఆదిత్య 369 సినిమా తీసిన శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిచారు. మరి చిత్ర విశేషాలేంటో తెలుసుకుందాం. 
 
కథ:
 
యశోద (సమంత) మధ్య తరగతి అమ్మాయి. తల్లితండ్రి లేని యశోద, తన  చెల్లి బాగు కోసం ఏదైనా చేయాలనీ ఆలోచిస్తుంది. ఆ సమయంలో డబ్బుల కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి ఒలీవ అనే బ్యూటీ  సంస్థతో కాంట్రాక్టు కుదుర్చుకుంటుంది. సంస్థకు చెందిన మనుషులు డెలివరీ వరకు ఒక రహస్య ప్రాంతంలోని భవనంకు తీసుకొస్తారు. అక్కడ తనలాగే మరికొంతమంది ఉండటం, అక్కడ  వింత సంఘటనలు జరగటంతో ఇక్కడ ఏదో తేడా జరుగుతోందని ఆమెకు అర్థం అవుతుంది. డెలివరీకి సిద్ధమైన మహిళలు ఒక్కొక్కరుగా అంతర్ధానం అవుతుండటంతో దీని వెనుక ఏదో కుట్ర ఉందని యశోద పసిగడుతుంది. మరోవైపు అందగత్తెలయిన విదేశీ మహిళలు సిటీలో ప్రమాదంలో చనిపోతుంటారు. దేనికోసం పోలీస్ టీం శోధిస్తుంది. ఇలా రెండు కథలకు లింక్ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
 
సరోగసీ కథాంశంతో గతంలో సింగీతం శ్రీనివాస్ దర్శకత్యంలో ఒబామా అనే సినిమా వచ్చింది. అది తల్లి బిడ్డ ఎమోషన్ మీద తీశారు. ఆది కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలను టార్గెట్ చేసుకుని కొందరు లబ్ది కోసం ఏ  విధంగా ఉన్నారో తెలియచెప్పే సినిమా. కానీ  అంతకు మించి అనేంత కథతో యశోద ఉంది. ఆ మథ్య కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరోగసీ పేరుతో మోసాలు చేస్తున్న సంఘటనలు హైదరాబాద్ ల్లో వార్తల్లో బయటకు వచ్చాయి. కానీ ఇంటెర్నేషన్ లెవల్లో మిస్ యూనివర్స్ గా పేరుపొందిన వారు, సోసైటిలో అందంగా ఉండటానికి వారు ఎంత ఖర్చు చేస్తారు, వారితో పాటు సామాన్య మహిళలు వాడే పేస్ క్రీమ్స్ వాటి వెనుక ఏమి జరుగుతుంది అనే కోణంలో సినిమా ఉంది. ఇది పాన్ ఇండియాకు చెందిన కథగా చెప్పవచ్చు. 
 
ఇక థ్రిలర్ అంశగా చూస్తే, రవిబాబు తీసిన 'అనసూయ' తరహాలోనే ఒక విభిన్నమైన కథాంశం కూడా వచ్చినా చాలా తేడా ఉంది. అందులో గర్భం దాల్చిన మహిళలు, విలన్ చుట్టూ తిరిగే మూల కథాంశమే కనిపించిన పూర్తిగా ప్రేక్షుడిని ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు తమిళ దర్శకులు హరి-హరీష్ ఆ సినిమాను  గుర్తుకు తెచ్చే కథాంశంతో 'యశోద' చేసినా ఇంటర్నేషనల్ లెవెల్ లో జరుగుతున్న  సరోగసీ ద్యారా అందం కాపాడుకోవడం కోసం కొందరు ఎన్ని మోసాలు చేస్తున్నారో  అనే పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలా కూడా జరుగుతుందా అన్న ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది కూడా విదేశీ పత్రికల్లో `ఇండియా బేబీ ఫ్యాక్టరీ` అనే ఆర్టికల్ స్ఫూర్తిగా తీసుకుని దర్శకులు హరి-హరీష్ చేసిన ప్రయత్నం అభినందనీయం.
 
- 'యశోద' ఫస్ట్ టీజర్ చూసినపుడే ఇదొక భిన్నమైన ప్రయత్నం, మెడికల్ మాఫీయా ఉన్న సినిమా అని అర్థమవుతుంది. తమిళంలో కొన్ని భిన్నమైన సినిమాలు తీసిన హరి-హరీష్.. 'యశోద' విషయంలోనూ కొత్తగానే ఆలోచించారు. ధనవంతులు సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చాలా మామూలు వ్యవహారంగా భావించే రోజులివి. అందులోనూ షారూఖ్ ఖాన్, అంతకుముందు లక్ష్మి ప్రసన్న,ఇటీవల నయనతార అద్దె గర్భంతోనే కవలలకు జన్మనివ్వడం.. దాని చుట్టూ పెద్ద చర్చ జరిగిన నేపథ్యంలో హరి-హరీష్ ఎంచుకున్న పాయింట్ సరిఅయిందిగా అనిపిస్తుంది. కానీ కొంత వాస్తవం, కొంత  ఊహాజనితమైన పాయింట్ కలిపి బాగానే తీశారు. 
 
- థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన ఉత్కంఠ బాగానే సక్సెస్ అయింది. మహిళల అవయవాలు మార్చే కథలు తమిళ హీరో ఆర్య చేసిన జెట్టిలో కొత్తగా చూపించారు. ఈ కథలో ఫారిన్ పెద్దల పాత్ర చూపించారు. అందులోనూ మెడికల్ మాఫియా ఉంది. యశోదలో మెడికల్ మాఫియా ఆసుపత్రి కాకుండా బ్యూటీ సంస్థ పేరుతో మోసాలు చెప్పారు.  ప్రథమార్ధం కొంచెం వేగంగానే సాగిపోతుంది. ఇక ద్వితీయార్ధం ఆరంభమైన కాసేపటికే కథ తాలూకు అసలు గుట్టేంటో తెలిసిపోతుంది. దాంతో పెద్ద కథగా అనిపిస్తుంది. ప్రి క్లైమాక్స్ ముందు ట్విస్టు రివీల్ చేసినట్లయితే వ్యవహారం వేరుగా ఉండేది. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక దాదాపు 40 నిమిషాల కథను నడిపించడం, అది కొంచెం సాగతీతగా అనిపించినా బోరింగ్ గా అనిపించకపోవడం ప్లస్.
 
నటీనటులు:
యశోద పాత్రకు అందరూ సూట్ కారు. ఫామిలీ మాన్ సినిమాల్లో సమంతను చూసాక ఆమె కరెక్ట్ అనేది దర్శకులు ఎంచుకున్న ఐడియా బాగుంది. పాత్ర తాలూకు డిఫరెంట్ షేడ్స్ ను ఆమె బాగా చూపించగలిగింది. యాక్షన్ ఘట్టాలు బాగా చేయగలదు అనిపిస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ గా తనకున్న ఇమేజ్ ఆ సన్నివేశాలకు ఉపయోగపడింది. ఎమోషనల్ సీన్లలో కూడా సామ్ బాగా చేసింది. ముందు అమాయకంగా కనిపించి.. ఆ తర్వాత రూపం మార్చుకునే పాత్రలో ఉన్ని ముకుందన్ ఆకట్టుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ రోల్ లో ఆకట్టుకుంది. కేంద్ర మంత్రిగా రావు రమేష్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.
 
సాంకేతిక వర్గం:
మణిశర్మ నేపథ్య సంగీతంలో  బీజీఎం కీలక పాత్ర పోషించింది. సుకుమార్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  పులగం చిన్ననారాయణ, చల్లా భాగ్యలక్ష్మిల సంభాషణలు సన్నివేశపరంగా అమరాయి. వరలక్ష్మి శరత్ కుమార్ క్లయిమాక్స్ లో చెప్పే డైలాగ్స్ సినిమా మొత్తం కథ. అందం కోసం వరల్డ్ ఫేమస్ మహిళలు సరోగసి వల్ల పుట్టిన శిశువు ప్లాస్మాను తీసుకోవడం కారణం అనే కొత్త పాయింట్ చెప్పారు. ఇలాంటి పాయింట్ ను రెండు భాగాలుగా కూడా తీసే ఛాన్స్ ఉంధీ కూడా. కానీ ఒక సినిమాలో పకడ్బందీ థ్రిల్లర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఇది కుటుంబం తో కలిసి చూసే సినిమా. గో అండ్ వాచ్. 
 
రేటింగ్ - 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments