Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ సందేశ్ ఎవరిపై నింద వేసాడు? రివ్యూ

డీవీ
శుక్రవారం, 21 జూన్ 2024 (15:31 IST)
Ninda poster
నటీనటులు: వరుణ్ సందేశ్, అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: రమీజ్ నవీత్, సంగీత దర్శకుడు: సంతు ఓంకార్, సంగీత దర్శకుడు: సంతు ఓంకార్, దర్శకుడు: రాజేష్ జగన్నాధం, నిర్మాత : రాజేష్ జగన్నాధం. 
 
వరుణ్ సందేశ్ కు హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం తర్వాత పలు సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు. కొొంత గేప్ ఇచ్చి ఇందువదన సినిమా చేశాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ నింద సినిమా చేశాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 
అది కాండ్రకోట అనే ఊరు. అక్కడ ముంజు అనే యువతి హత్యకు గురవుతుంది. ఆ హత్య బాలరాజు (ఛత్రపతి శేఖర్‌) చేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టుకు కేసు రాగానే తీర్పు ఇచ్చే విషయంలో జడ్జ్ సత్యానంద్‌(తనికెళ్ల భరణి) సాక్షాధారాలనుబట్టి మనసు అంగీకరించకపోయినా ఉరిశిక్ష విధిస్తాడు. ఆ తర్వాత ఆ బాదతో జడ్జి మరణిస్తాడు.  తండ్రి మరణంతో కొడుకు వివేక్‌(వరుణ్‌ సందేశ్‌) ఈ కేసులో ఏదో మిస్టరీ వుందని శోధిస్తాడు. ఆ క్రమంలో ఆరుగురిని కిడ్నాప్ చేయడంతో అసలు నిజాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏమి జరిగింది? వివేక్ కష్టం ఫలించిందా లేదా? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
 
ఓ హత్య కేసులో మిస్టరీ శోధించాలంటే చాలా ఆసక్తికరంగా కథనం వుండాలి. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. వస్తున్నాయి కూడా. సి.ఐ.డి. అనే సీరియల్ ఇందుకు ఉదాహరణ గా చెప్పవచ్చు. ఆద్యంతం మలుపులతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఈ నింద స్టోరీ కూడా ఇంచుమించు అలాంటిదే. కానీ దర్శకుడు మలుపు సరిగ్గా ఉపయోగించుకోలేెకపోయాడనే చెప్పాలి.  మర్డర్, మిస్టర్, శోధన అనే అంశాలతో సాగే ఇలాంటి కథల్లో ఊహించని ట్విస్ట్ వుండాలి. అది ముగింపులో దర్శకుడు చూపాడు. మిగతాదంతా రొటీన్ గా కనిపిస్తుంది.
 
తప్పు చెయ్యనివారికి అన్యాయంగా శిక్ష పడితే, వారి జీవితాలు ఎలా నాశనం అవుతాయి ? అనే కోణంలో సాగడుతుంది. దానిని మరింత ఆసక్తితో దర్శకుడు తీస్తే బాగుండేది.  కొన్ని చోట్ల ఎమోషనల్ గా సాగుతుంది. ఇలాంటి కథలో పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిడికితో  అమాయకులను ఎలా బుక్ చేస్తారనే అంశాలే కీలకం. వాటిని చూపించినా అవి ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని విధంగా తీస్తే మరింత హైప్ వచ్చేది.
 
చాలా కాలం తర్వాత వరుణ్ సందేశ్  నటనను కనబర్చారు. డైలాగ్ డెలివరీ మార్చుకున్నాడు.  ఎమోషనల్ సన్నివేశాల్లో కదిలించాడు. అలాగే ప్రధాన పాత్రలో నటించిన అన్నీ, తనికెళ్ల భరణి,  చత్రపతి శేఖర్, భద్రమ్, సూర్య కుమార్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
 
రాజేష్ జగన్నాధం ఎంచుకున్న కథ, కథనం బాగున్నా సీన్ టు సీన్ కూ లింక్ విషయంలో కొంచెం తడబాబు కనిపించింది. సెకండ్ హాఫ్ లో చాలా భాగం అనవసరం సీన్లతో, బలవంతపు విచారణ డ్రామాగా సాగదీత కనిపిస్తుంది. ఇవి కాస్త జాగ్రత్త వహిస్తే సినిమా రేంజ్ పెరిగేది.
 
ప్రీ క్లైమాక్స్ లో ల్యాగ్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ను రాసుకున్నా.. అవి కూడా పూర్తి సినిమాటిక్ గా సాగాయి. సాంకేతిక పరంగా రమీజ్ నవీత్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది.  అనిల్ కుమార్ ఎడిటింగ్ ఓకే అనిపించాయి.  సంగీత దర్శకుడు సంతు ఓంకార్  నేపథ్య సంగీతం వినసొంపుగావుంది.  నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.  నింద అనే టైటిల్ లోనే కథేమిటో తెలిసిపోయేలా ద ర్శకుడు ప్రేక్షకుడిని పిక్స్ చేశాడు. కొన్ని చోట్ల సీన్లు అతకపోవడం, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ప్లే బోర్ గా సాగడంతోపాటు సినిమాటిక్ గా తీయడంతో ప్రేక్షకుడు కొత్తదనం ఫీల్ కాలేదు. అయితే మొత్తం ఇలాంటి సస్పెన్స్, క్రైమ్ డ్రామాలు చూసేవారికి నచ్చుతుంది. 
రేటింగ్ : 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

చెవిరెడ్డి కూడా నాకు చెప్పేవాడా? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోలేరు: బాలినేని కామెంట్స్

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments