ఉప్పెన ట్విట్టర్ రివ్యూ టాక్: క్లైమాక్స్ సీన్ గురించే రచ్చ రచ్చ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (11:22 IST)
టాలీవుడ్‌ మెగా ఫ్యామిలీ నుంచి 'ఉప్పెన' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. సాధారణంగా పెద్ద కుటుంబం నుంచి లాంఛ్ అవుతుంటే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కూడా భారీ బజ్‌ను ఏర్పరచుకుంది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం పలు ప్రాంతాల్లో విడుదలైంది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే..?
 
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే ‘ఉప్పెన'. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది.  
 
ఉప్పెనకు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే అతడు మంచి మార్కులు కొట్టేశాడని సినిమా చూసిన వారంతా చెబుతున్నారు. అతడి టేకింగ్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు ఏం చెప్పాలో అది సూటింగా చెప్పాడని అంటున్నారు. ఇక, ఈ మూవీని మరో లెవెల్‌కు తీసుకెళ్లిన దేవీ శ్రీ ప్రసాద్.. తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడట.
 
‘ఉప్పెన' గురించి ఎంత ట్రెండ్ అవుతుందో.. క్లైమాక్స్ సీన్ గురించి కూడా అంతే రీతిలో హాట్ టాపిక్ అవుతోంది. చివర్లో డేంజర్ పాయింట్ అంటూ ఆసక్తిని పెంచేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. ఇక, సినిమాను చూసిన వారంతా.. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా ఉన్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు డిస్సాపాయింట్ అవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
ప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు వచ్చిన ‘ఉప్పెన’.. కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
 
తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చిన ‘ఉప్పెన’పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి యాక్టింగ్ బాగుందని అంటున్నారు. హీరోయిన్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, లుక్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయట. ఇక ‘రాయనం’ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి తన నటనా విశ్వరూపాన్ని చూపించాడట. చాలామంది ప్రేక్షకులు ఆయన్ని చూడటం కోసం సినిమాకు వెళతారని అనడంలో అతిశయోక్తి లేదు. 
Uppena
 
అటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మరోసారి తనదైన శైలి బాణీలతో అలరించారని చెబుతున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సమాచారం. క్లైమాక్స్‌లో అయితే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఓవరాల్‌గా సినిమా బాగుందంటూ అభిమానులు ట్విట్టర్‌లో తమ రెస్పాన్స్‌ను తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments