Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ‌త‌లోని కొత్త లోకాన్ని చూపించిన‌ వ‌ర్జిన్ స్టోరీ - రివ్యూ

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (16:14 IST)
Virgin Story poster
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా న‌టించిన సినిమా `వర్జిన్ స్టోరి`.కొత్తగా రెక్క‌లొచ్చేనా అనేది కాప్ష‌న్‌. ఎన్‌.ఆర్‌.ఐ.  ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు.రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా ఈరోజే విడుద‌లైంది. ట్రైల‌ర్‌ను, పోస్ట‌ర్‌లు చూస్తుంటే ఇదేదో శ్రుతిమించిన చిత్ర‌మ‌నేలా అనిపిస్తుంది. మ‌రి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

 
క‌థ‌గా చెప్పాలంటే,
కాలేజీ చ‌దివే ఆరుగురు స్నేహితులు. అంద‌రిదీ 20,21 సంవ‌త్స‌రాలే. ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు చ‌దువుతోపాటు మ‌రో ప‌క్క త‌మకు రెక్క‌లొచ్చేట్లుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. న‌చ్చింది చేయ‌డ‌మే వారి ప‌ని. ప‌బ్‌ల‌కు వెళ్ళ‌డం, స్నేహితుల‌తో ఎంజాయ్ చేయ‌డం వంటివి చేస్తుంటారు. అలా ఓ యువ‌తి బాగా న‌మ్మి ఓ బోయ్ ప్రెండ్ ను ప్రేమిస్తుంది. కానీ అత‌ను ప‌బ్‌లో మ‌రోక‌రితో ఎంజాయ్ చేయ‌డం చూసి బ్రేక‌ప్ చెప్పేస్తుంది. ఆమె స్నేహితురాలు ఇచ్చిన స‌ల‌హాతో మ‌రో బ‌క‌రా అయిన బోయ్‌ఫ్రెండ్‌ను ద‌గ్గ‌ర తీసుకుని ఆ క‌సి అత‌నిపై తీర్చుకోవాల‌నుకుంటుంది. ఆ కొత్త బోయ్ ప్రెండ్ విక్రమ్ సహిదేవ్. ఇక ఇద్ద‌రూ ఓ రాత్రి గంట‌పాటు స‌ర‌దాగా ఎంజాయ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అలా ఎక్క‌డైనా రూమ్‌లు ఖాలీగా వుంటాయోన‌ని ఊరంతా తిరుగుతుతారు. ఆఖ‌రికి పోలీసుల‌కు చిక్కుతారు. ఆ త‌ర్వాత ఏమ‌యింది? అనేది క‌థ‌.

 
విశ్లేష‌ణః
ఈ సినిమాలాంటి క‌థ‌లు గ‌తంలో ప‌లు చిత్రాలు వ‌చ్చినా ఏమీ అంత‌గా క‌నెక్ట్ కాలేక‌పోయాయి. కానీ ఈ సినిమాను ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా కేర్‌తో తీసిన‌ట్లుగా అనిపిస్తుంది. యూత్ మామూలుగా మాట్లాడుకునే సంభాష‌ణ‌లు వున్నా ఎక్క‌డా బూతులాగా అనిపించ‌దు. ద్వందార్థాలు ప‌లికినా స‌న్నివేశ‌ప‌రంగా కొట్టుకుపోతాయి. ఇప్ప‌టి త‌రానికి త‌మ‌ త‌ల్లిదండ్రుల త‌రం గురించి పెద్ద‌గా తెలీదు. అదంతా పాత చింత‌కాయ ప‌చ్చ‌డిగా కొట్టి పారేస్తారు. ఒకే భార్య‌, ఒకే భ‌ర్త అనే కాన్పెస్ట్ ఇప్ప‌టివారికి రుచించ‌దు. అందుకే రోజుకొక బోయ్‌ఫ్రెండ్‌ను యువ‌తులు కావాల‌నుకుంటే, రోజుకొక అమ్మాయిని యువ‌కుడు కావాల‌నుకుంటాడు. జ‌స్ట్ ఫ‌ర్ ఛేంజ్ అనే త‌ర‌హాలోవారి ఆలోచ‌న‌లు వుంటాయి. ఇలాంటివారిని కొంచెం అయినా మార్చాల‌ని క్లయిమాక్స్‌లో కొన్ని డైలాగ్‌లు ఎస్‌.ఐ.చేత చెప్పించారు.

 
లాజిక్క్‌గా చూస్తే, 18 ఏళ్ళ‌కే ఓటు హ‌క్కు, పెండ్లి చేసుకోవ‌డానికి వ‌య‌స్సును రాజ్యాంగం నిర్ణ‌యించింది. కానీ ఆ వ‌య‌స్సులో వుండేవారి కోరిక‌లు అచ్చ‌టా ముచ్చ‌ట ఎందుకు త‌ప్ప‌ని భావిస్తార‌ని పాయింట్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇందులో చెప్ప‌ద‌లిచారు. టీనేజ్ వ‌య‌స్సులో ప‌క్షికి కొత్త‌గా రెక్క‌లొస్తే ఎలా ఎగిరిపోతుందో అలా వారి ప్ర‌వ‌ర్త‌న వుంటుంది. అది గాడిత‌ప్ప‌కుండా చూసుకోవ‌డ‌మే త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌. దాన్ని ఈ సినిమాలో చ‌క్క‌గా చూపించాడు.

 
ఇందులో నటించిన న‌టీన‌టులంతా కొత్త‌వారే. వారంతా టీనేజ్ వ‌య‌స్సుకు చెందిన‌వారే. వారి న‌ట‌న స‌హ‌జంగా వుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. పాశ్చాత్య క‌ల్చ‌ర్ బాగా ప్ర‌భావితం చూపుతున్న త‌రునంలో అది ఎలా ఉంటుందో చూపించారు. అందుకే యువ‌త‌కు కొత్త లోకం చూసిన‌ట్లుగా అనిపిస్తుంది. ఇందులో చాలామంది చ‌దువుతోపాటు వారికి తెలిసిన వృత్తి ఇంటిరీయ‌ర్ డెక‌రేష‌న్‌, సాఫ్ట్ వేర్‌రంగంలో సంపాదించేది కొంద‌రైతే, కేవ‌లం బాయ్‌ఫ్రెండ్‌ను త‌మ అవ‌ర‌సాల కోసం వాడుకునే యువ‌తిలు మ‌రికొంద‌రు. మ‌గ‌వారి అవస‌రాల‌ను కేష్ చేసుకునేలా మ‌రో యువ‌తి ఎంచుకున్న మార్గం. ఇంకోవైపు ఆడ‌వారు ఆడ‌వారిని ప్రేమించ‌డం వంటి స‌న్నివేశాలు క‌థ‌ప‌రంగా రాసుకున్నారు.

 
అయితే ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా వినోద‌ప‌రంగా చెప్ప‌డం స్క్రీన్‌ప్లే ప్ర‌త్యేక‌త‌. ఇందులో హీరో పాత్ర ప్ర‌భావం చిత్ర ద‌ర్శ‌కుడు అమెరికాలో అనుభవించాడు. నిర్మాత మ‌రో ర‌కంగా ఎదుర్కొన్నాడు. ఇలా వారి వారి అనుభ‌వాలు, యువ‌త‌లోని కొత్త పోక‌డ‌లు అన్నికూర్చి సినిమాగా తీశాడు. ఇది యువ‌త‌తోపాటు పెద్ద‌లు కూడా చూసే చిత్రంగా వుంది. ఒక్క‌సారి ఈ సినిమా చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments