Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాసిన్ని నవ్వుల కోసం "తేజ్ ఐ లవ్ యూ" - రివ్యూ (Video)

ప్రేమ‌క‌థా చిత్రాలకి పెట్టింది పేరు క‌రుణాక‌ర‌న్‌. అందుకే ఆయ‌న్ని ల‌వ్ మెజీషియ‌న్ అంటుంటారు. 'తొలిప్రేమ' నుంచి ఆయ‌నకి ఆ మార్క్ ఉంది. అయితే కొంత‌కాలంగా ఆయ‌న చిత్రాల్లో మేజిక్ క‌నిపించ‌డం లేదు. ఈసారి మ‌

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (15:41 IST)
చిత్రం : తేజ్ ఐ లవ్ యూ
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాష్, వైవా హర్ష, పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : కె.ఎస్ రామారావు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కరుణాకరన్
విడుదల తేదీ : జూలై 6, 2018
 
ప్రేమ‌క‌థా చిత్రాలకి పెట్టింది పేరు క‌రుణాక‌ర‌న్‌. అందుకే ఆయ‌న్ని ల‌వ్ మెజీషియ‌న్ అంటుంటారు. 'తొలిప్రేమ' నుంచి ఆయ‌నకి ఆ మార్క్ ఉంది. అయితే కొంత‌కాలంగా ఆయ‌న చిత్రాల్లో మేజిక్ క‌నిపించ‌డం లేదు. ఈసారి మ‌ళ్లీ ప్రేమ‌క‌థ‌ని ఎంచుకొన్నాడు. అందులో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడు కావ‌డంతో అభిమానులంతా మామ‌య్య‌కి 'తొలిప్రేమ'ఇచ్చిన‌ట్టుగా... అల్లుడికి కూడా గుర్తుండిపోయే చిత్ర‌మే ఇస్తాడనే ఆశలు క‌రుణాక‌ర‌న్‌పై పెట్టుకొన్నారు. మ‌రి అందుకు త‌గ్గ‌ సినిమానే తీశాడా? ఇంత‌కీ తేజ్ క‌థేంటి? ఎలా ఉంది? వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌ని ఈ సినిమా అయినా గ‌ట్టెక్కిస్తుందా? లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్ర కథను విశ్లేషించాల్సిందే.
 
కథ : 
తేజ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) చిన్న‌ప్పుడే ఒక మ‌హిళ ప్రాణాన్ని కాపాడే క్ర‌మంలో ఓ నేరం చేస్తాడు. ఏడేళ్లు జైలు శిక్ష అనుభ‌విస్తాడు. త‌న ప్రాణాన్ని కాపాడేందుకే అలా చేశాడ‌ని తెలుసుకొన్న ఆ మ‌హిళ తేజ్‌కి స‌హాయం చేయాల‌నుకుంటుంది. అందుకోసం త‌న పేరిట ఉన్న కొంత ఆస్తిని తేజ్‌ పేరిట రాయమని తన భ‌ర్త‌కి చెబుతుంది. కానీ భ‌ర్త త‌న మాట విన‌క‌పోవ‌డంతో ఆఖ‌రి కోరిక‌గా కూతురు నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌)కి చెబుతుంది. దాంతో త‌న త‌ల్లి కోరిక‌ని నెర‌వేర్చేందుకు నందిని లండ‌న్ నుంచి వ‌స్తుంది. 
 
ఆ తర్వాత తేజ్‌పై మనసు పారేసుకుని అతనికి దగ్గరవుతుంది. అయితే, తన మనసులోని విషయం తేజ్‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే నందిని ఓ ప్ర‌మాదానికి గుర‌వుతుంది. ఆ ప్ర‌మాదం త‌ర్వాత ఏం జ‌రిగింది? న‌ందినిలో ఎలాంటి మార్పు వ‌చ్చింది? వాళ్లిద్ద‌రి ప్రేమ ఏమైంది? త‌న త‌ల్లిని కాపాడింది కూడా అతడేననే విష‌యం నందినికి తెలిసిందా లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.
 
విశ్లేషణ...
దర్శకుడు క‌రుణాక‌ర‌న్ ప్రేమ‌క‌థ అంటే అందులో కొత్త‌ద‌నంతో పాటు స‌హ‌జ‌త్వం ఉంటుంద‌ని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ముఖ్యంగా, ప్రేమ‌కి తోడు, మంచి ఫీల్‌, కుటుంబ అనుబంధాలు, హాస్యాన్ని మేళ‌వించ‌డంలో ఆయనకు ఆయనే సాటి. కానీ, తాజా చిత్రంలో అవేమీ కనిపించవు. ప్రేమ‌క‌థలో ఏ మాత్రం కొత్త‌ద‌నం లేక‌పోగా... దాన్ని ప‌లు మ‌లుపులు తిప్పి స‌హ‌జ‌త్వం లేకుండా చేశారు. కుటుంబం, ఆ నేప‌థ్యంలో భావోద్వేగాల్ని పండించ‌డంలోనూ డైరెక్టర్ విఫ‌ల‌మ‌య్యారని చెప్పొచ్చు. ఆర్టిస్టులంద‌రినీ ఒక గ్రూప్ ఫొటోకి పోజివ్వ‌మ‌న్న‌ట్టుగా ఒక‌చోట‌కి చేర్చారు త‌ప్పిస్తే వాటిని పండించ‌డంపై దృష్టిపెట్ట‌లేద‌నిపిస్తుంది. హాస్యం విష‌యంలోనూ కాలం చెల్లిపోయిన సన్నివేశాల్నే న‌మ్ముకున్నారు. దాంతో సినిమాలో ఏ ఒక్క స‌న్నివేశం కూడా కొత్త‌గా అనిపించ‌దు. తొలి స‌గ‌భాగం తేజ్‌, కుటుంబం, అత‌ని మిత్ర‌బృందం నేప‌థ్యంలో సాగుతుంది. అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు న‌వ్విస్తాయి.
 
ముఖ్యంగా, హీరో హీరోయిన్ల మధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో అయితే ఏ మాత్రం కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. విరామానికి ముందు ఓ మ‌లుపు చోటుచేసుకుంటుంది. అది ఆస‌క్తి రేకెత్తించినా, ద్వితీయార్థంలోకి వెళ్లేస‌రికి ఆ మ‌లుపు లాజిక్ లేని విధంగా అనిపిస్తుంది. సినిమా న‌డుస్తున్న‌కొద్దీ ఈ మాత్రం స‌న్నివేశాల‌కి ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో అంత నాటకీయ మ‌లుపు ఎందుక‌నిపిస్తుంది. మ‌లుపుల పేరుతో స‌న్నివేశాల్లో నాట‌కీయ‌తను మ‌రీ ఎక్కువ‌గా జొప్పించారు. కొన్నిచోట్ల అయితే అస‌లు ఇది క‌రుణాక‌ర‌న్ సినిమానేనా అనిపిస్తుంది. ద్వితీయార్థంలోనూ ఏ మాత్రం ఫీల్ పండ‌క‌పోగా, ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటుంది. 
 
ఎవ‌రెలా చేశారంటే..
సాయిధ‌ర‌మ్ తేజ్, అనుప‌మ జోడీ తెర‌పై బాగానే క‌నిపిస్తుంది. కానీ వాళ్లిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ పండించ‌డానికి స‌రిప‌డే స‌న్నివేశాలే ఇందులో లేవు. అనుప‌మ ఎప్ప‌ట్లాగే అందంగా క‌నిపించింది. భావోద్వేగాల ప‌రంగా కూడా ఆమె ప‌రిధి మేర‌కు ప్ర‌య‌త్నించింది. సాయిధ‌ర‌మ్ తేజ్ అక్క‌డ‌క్క‌డా బొద్దుగా క‌నిపించాడు. తేజ్ పాత్ర‌లో ఒదిగిపోయేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేశాడు. వైవా హ‌ర్ష‌, పృథ్వీ త‌దిత‌రుల‌తో క‌లిసి హాస్యం పండించే ప్ర‌య‌త్నం చేశాడు. అనుప‌మ తండ్రిగా అనీష్ కురువిల్లా న‌టించాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ పెద‌నాన్న‌, పెద్ద‌మ్మ పాత్ర‌ల్లో అనుభ‌వజ్ఞులైన జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్ర లోకేష్‌లు క‌నిపిస్తారు. కానీ ఆ పాత్ర‌లు కూడా నామమాత్రంగానే అనిపిస్తాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆండ్రూ కెమెరా ప‌నిత‌నంతో పాటు, గోపీసుంద‌ర్ సంగీతం బాగుంది. హ్యాపీ ఫ్యామిలీ, అంద‌మైన చంద‌మామ పాటలు, చిత్రీక‌ర‌ణ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. డార్లింగ్ స్వామి మాట‌లు అక్క‌డ‌క్క‌డా ఫర్వాలేద‌నిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌లేదు. ద‌ర్శ‌కుడు కరుణాక‌ర‌న్ క‌థాప‌రంగా, క‌థ‌నం ప‌రంగా మ‌రోసారి తేలిపోయారని చెప్పొచ్చు. 
 
కరుణాకరన్ గురించి... 
'తేజ్ ఐ లవ్ యు' రొటీన్ కరుణాకరన్ టెంప్లేట్ మూవీ. 20 ఏళ్ల క్రితం వచ్చిన తొలిప్రేమ సినిమా శైలిలోనే సాగుతుంది ఈ సినిమా కూడా. అప్పటికీ, ఇప్పటికీ కథలు మారాయి. ప్రేక్షకులు మారారు. కానీ తను మాత్రం ఇంకా అప్డేట్ కాకుండా.. రొమంటిక్ కామెడీ పేరుతో అవే సినిమాలు తీస్తున్నారు. ఈ తేజ్ కూడా ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు. అవే పాత సీన్లు, పాత కామెడీ, పాత ట్రీట్మెంట్.. వెరసి ఈ సినిమా ఓ పాత చిత్రాన్నే మళ్లీ తీశారని చెప్పొచ్చు. 
 
చిత్ర బలాబలాలు...
ఈ చిత్ర బలాబలాలను పరిశీలిస్తే, సాయిధ‌ర‌మ్ తేజ్, అనుప‌మ న‌ట‌న, అక్క‌డ‌క్క‌డా హాస్యం, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అలాగే, బ‌ల‌హీన‌త‌లు పరిశీలిస్తే, క‌థ‌, క‌థ‌నం ఫీల్, వినోదం కొర‌వ‌డ‌టం మైనస్‌ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments