Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు ఎలా వుందంటే.. రివ్యూ

డీవీ
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (10:59 IST)
Boot Cut Balaraju
నటీనటులు: సోహైల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు, విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి, సంగీత దర్శకులు: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటింగ్: వినయ్ రామస్వామి వి, నిర్మాత: ఎండీ పాషా, దర్శకుడు : కోనేటి శ్రీను
 
ఈ శుక్రవారం పలు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ‘బిగ్ బాస్’ ఫేమ్  సోహెల్ హీరోగా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. తాజాగా కోనేటి శ్రీను దర్శకత్వంలో మేఘలేఖ హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బూట్ కట్ బాలరాజు’. ఇందులో కూడా తన మార్క్ కోసం యత్నించాడు. శుక్రవారంనాడు విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ :
సోహెల్ (బూట్ కట్ బాలరాజు) తనకంటూ ప్రత్యేకమైన వేషధారణతో ఊరిలో ఆవారాగా తిరుగుతుంటాడు. అలాంటి ఊరిలో పటేలమ్మా (ఇంద్ర‌జ‌) ఆ ఊరికి పెద్ద దిక్కుగా మంచి చేస్తూ ఉంటుంది. దాంతో ఆమె అంటే ఎంతో గౌరవం. ఇక పటేలమ్మా కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బూట్ కట్ బాలరాజుతో ఎంతో స్నేహం. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో బూట్ కట్ బాలరాజును సిరి (సిరి హన్మంతు) ప్రేమిస్తుంది. దాంతో భయపడి బాలరాజుపై వున్న ప్రేమను వ్యక్తం చేసేస్తుంది మహాలక్మి. అప్పటికే బాలరాజు ఊరి సర్పంచ్ గా పోటీ చేస్తాడు. అసలు ఈ పరిణామాలన్నింటికీ అసలు కారణం ఏమిటి? ఆవారాగా వున్నవాడు సర్పంచ్ అయ్యాడా? లేదా? ప్రేమకథ, పటేలమ్మ ఏమి చేసింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఇటీవల హీరో పాత్రను ఆవారాగా కొందరు దర్శకులు చూపిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ యారగెంట్ వుండడం. చూపిస్తున్నారు. అలాంటి కోవలోనే ఈ చిత్ర దర్శకుడు రాసుకున్నాడు. దాంతో పాత్రలో బలం లేకుండా పోయింది. ఒక పర్పస్ అనేది వుంటూ బాధ్యతగా వుండేట్లుగా చూపిస్తే కథ మరింత బాగుండేది. అయితే ఏ పాత్ర అయినా ఇట్టే అవపోసన పట్టే సోహైల్ ఇందులో తన నటనతో ఆకట్టుకున్నాడు. డాన్స్ బాగా చేశాడు. కథాకథనాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.  మొదటి భాగంలోకంటే సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
 
కొన్ని ఎమోషనల్ సీన్స్ లోసోహెల్ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. మేఘలేఖ తన నటనతో పాటు ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. అలాగే మరో హీరోయిన్ సిరి హనుమంత్ సరిపడా పాత్ర చేసింది. ఇతర పాత్రల్లో నటించిన సునీల్, ఇంద్రజ, జబర్దస్త్‌ రోహిణి వంటి నటీనటులు తమ శైలి మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రల్లో అలరించారు. ఇంతమంది జబర్ దస్గ్ నటీనటులు, సీనియర్స్ ను పెట్టుకున్న దర్శకుడు కథను మరింత జాగ్రత్తగా రాసుకుని వుంటే ఈ చిత్రం పెద్ద సినిమా అయ్యేది.
 
మంచి సినిమా తీయాలనే తొందరలో లవ్ సీన్స రెగ్యులర్ గా చూపించేశాడు.  ఊరు కథ కనుక దర్శకుడు కోనేటి శ్రీను ఊరు చూట్టే రిపీట్ డ్ సన్నివేశాలు పెట్టి సినిమాని నడిపాడు. కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. ఎంటర్ టైన్ ను మరింత బాగా రాసుకుని ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ఇందుకు కొంచెం కసరత్తు చేయాల్సింది. బడ్జెట్ పరంగా బాగున్నా కొన్ని సాంకేతికత కారణాలతో ఆలస్యమైనా సినిమాను విడుదలచేయడంపట్ల నిర్మాతను అభినందించాలి.
 
 సాంకేతికంగా చూస్తే,  . సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాత ఎండీ పాషా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రచయితగా, స్క్రీన్ ప్లే పరంగా మరింత శ్రద్ధ పెడితే ఈ సినిమా మరోలా వుండేది. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో బీజియంలు, ట్యూన్ లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ పరంగా మరికాస్త చేయాల్సింది. ఇప్పటి ట్రెండ్ కు చాలా స్పీడ్ గా సన్నివేశాలు చూపించడం, ఏదో కొత్త దనం చూశామనే ఫీలింగ్ కలిగించేలా దర్శకుడు చేయాల్సింది. కొన్నిచోట్ల సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరిచినా ఎంటర్ టైన్ మెంట్ పరంగా సినిమా తీయాలని అందరితో వినోదాన్ని పండించాడు. ఈ చిత్రం ఏమేరకు ఆదరణ నోచుకుంటుందో ప్రేక్షకులు తీరును బట్టి వుంటుంది. మంచి ప్రయత్నమే మరి కాస్త మెరుగులు దిద్దుకోవాలి.
రేటింగ్ : 2.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments