Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా సాగిపోయే నారా రోహిత్ - నందితల "సావిత్రి" కథ

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (17:24 IST)
విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో నారా రోహిత్. గతంలో 'బాణం'తో ఎంట్రీ గంభీరంగా ఇచ్చి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ కుర్ర హీరో నటించిన చిత్రం 'సావిత్రి'. శుక్రవారం విడుదలైంది. ఈ కథను పరిశీలిస్తే... పెళ్లిలోనే పుట్టిన సావిత్రి (నందిత)కు పెళ్లి అంటే చాలా యిష్టం. చిన్నప్పటి నుంచీ పెళ్లి, పెళ్లి అని కలవరిస్తూ 20 యేళ్లకు చేరుకుంటుంది. ఆమె పెళ్లి కోసం ఎంతకైనా తెగించే ఆమె తన అక్క గాయిత్రి (ధన్యా బాలకృష్ణన్)కి పెళ్లైతే తనకు లైన్ క్లియర్ అవుతుందని భావించి, ఆమెకు పెళ్ళి చేయిస్తుంది. 
 
ఇంత చేసినా ఆమె పెళ్లి కాదు.. అప్పటికి కూడా ఆమె జీవితంలో రాజకుమారుడు ఎంట్రీ ఇవ్వడు. తను ఎంత గాఢంగా పెళ్లి అనుకున్నా దూరం అవుతోందే అనుకుంటున్న సమయంలో ఆమె తన కుటుంబ సభ్యులతో విహార యాత్రకు షిర్డీ వెళుతుంది. మార్గమధ్యంలో రిషి (నారా రోహిత్) ఎంటరై.. సావిత్రిని ఆటపట్టిస్తాడు. అక్కడ నుంచి వీరిద్దరి మధ్య రొటీన్ రొమాన్స్.. ఫన్. అయితే ఈ లోగా అనుకోని ట్విస్ట్. అసలు సావిత్రికు పెళ్లవుతుందా.. రిషి.. ఎలా తను ఇష్టపడ్డ ఆమెను దక్కించుకున్నాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
 
పాత చిత్రాల పంథాలోనే ఈ చిత్ర కథ కూడా సాగిపోయింది. కానీ ఇదే హీరో గతంలో సోలో అంటూ దాదాపు ఇలాంటి ట్రీట్మెంట్‌తో సినిమా చేశాడని మర్చిపోయినట్లున్నారు. లేదా జనం మర్చిపోతారులే అనుకున్నాడో ఏమో తెలియదు కానీ చిత్రం మాత్రం పెద్ద ఆసక్తి లేకుండా సరదాగా తీశారు. విలన్, హీరోయిన్ క్యారక్టరైజేషన్ వంటివి కొత్త కథ అనిపించినా ట్రీట్మెంట్ ముఖ్యంగా స్క్రీన్ ప్లే మాత్రం పాతగా ఉంది. పాటలు జస్ట్ ఓకే.. వింటున్నంత సేపూ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ గుర్తుండదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

Show comments