Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (11:47 IST)
Sankranthiki Vasthunam
సీనియర్ టాలీవుడ్ నటుడు వెంకటేష్ తాజా చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి పండుగ బహుమతిగా విడుదలైంది. దిల్ రాజు ప్రదర్శనలో సిరిష్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌లో ప్రదర్శించబడింది. ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ ఎలా వుందో తెలుసుకుందాం. ఈ చిత్రం సానుకూల స్పందనను పొందింది.
 
దర్శకుడు అనిల్ రవిపుడి తన ట్రేడ్ మార్క్ హాస్యాన్ని మిళితం చేసి, తన సిగ్నేచర్ శైలిలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. వీక్షకులు ముఖ్యంగా వెంకటేష్ కామిక్ టైమింగ్‌ను మెచ్చుకున్నారు.
 
వెంకీ నటనకు వంద మార్కులు పడ్డాయి. వెంకటేష్‌తో పాటు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం మీద సంక్రాంతికి వస్తున్నాం సమీక్షలు ఈ సెలవు కాలంలో కుటుంబాలు పూర్తిగా ఆనందించే పండుగ ఎంటర్టైనర్ అని వెల్లడించాయి. 
 
వెంకటేష్ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ పాత్ర కూడా ప్రశంసలు అందుకుంది. అదనంగా, భీమ్స్ సెసిరోలియో సంగీతం సినిమాకు ఒక ప్రధాన బలం. పాటలు ఈ చిత్రం మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్. చాలామంది ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీతో నిండిన "బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్" గా అభివర్ణించారు.
 
ఈ చిత్రం విడుదలకు ప్రమోషన్స్ బాగా కలిసొచ్చాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం పండుగ సీజన్‌కు సరదాగా నిండిన కుటుంబ ఎంటర్టైనర్ అని వెంకటేష్ ఇటీవల పేర్కొన్నాడు. ఆ మాట నిజమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments