Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్ తేజ్ విన్నరా? లూజరా? రివ్యూ రిపోర్ట్

మెగా కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ 'తిక్క' చిత్రం పెద్ద స్పీడ్‌ బ్రేకయింది. అదే తీరుగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా 'పండగ చేస్కో'తో దెబ్బ తిన్నాడు. వీళ్లిద్దరూ విజయవంతమైన సినిమా త

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (19:12 IST)
మెగా కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ 'తిక్క' చిత్రం పెద్ద స్పీడ్‌ బ్రేకయింది. అదే తీరుగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా 'పండగ చేస్కో'తో దెబ్బ తిన్నాడు. వీళ్లిద్దరూ విజయవంతమైన సినిమా తీయాలని రచయిత వలిగొండ శ్రీనివాస్‌ కథను నమ్మారు. ఈ ముగ్గురినీ నమ్మి నల్లమలుపు శ్రీనివాస్‌, 'ఠాగూర్‌' నిర్మాత మధు కలిసి 40 కోట్ల బడ్జెట్‌ అంత రిచ్‌గా సినిమా తీశామని చెప్పారు. మరి అదెలా వుందో చూద్దాం.
 
కథ: 
సిద్ధార్థ్‌ (సాయిధరమ్‌ తేజ్‌)ను తండ్రి మహేందర్‌ రెడ్డి (జగపతిబాబు) చిన్నతనంలో తల్లిలేని ప్రేమను తెలీకుండా పెంచుతాడు. ఊహించని మలుపుతో మహేందర్‌ రెడ్డి కోటీశ్వరుడైన తన తండ్రి ముఖేస్‌రుషి రేసింగ్‌ వ్యాపారాన్ని చూసుకోవాల్సివస్తుంది. ఆ పనుల్లో సిద్దార్థ్‌ను పట్టించుకోడు. ఇదే అదనుగా సిద్దార్థ్‌ తాత ఇంటి నుంచి వెళ్ళేలా ప్లాన్‌ చేస్తాడు. 20ఏళ్ళకు పెరిగి పెద్దవాడైన సిద్దార్థ్‌ ఓ న్యూస్‌ పేపర్లో క్రియేటివ్‌ హెడ్‌గా పని చేస్తుంటాడు. ఓ పార్టీలో సితార (రకుల్‌ ప్రీత్‌)ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె వెంట పడి ప్రేమించమని అల్లరి చేస్తాడు. సిద్ధార్థ్‌ అల్లరి కారణంగా పెద్ద అథ్లెట్‌ కావాలని ఆమె గోల్‌కు గండిపడుతుంది. 
 
విషయం తెలిసి ఆమె తండ్రి హార్స్‌ రేసర్‌ అయిన ఆది(అనూప్‌ సింగ్‌)తో పెళ్లి చేయడానికి రాత్రికి రాత్రి సిద్ధమైపోతాడు. తన తప్పును తెలుసుకుని ఆమె పెల్లి ఆపాలని వచ్చిన సిద్దార్థ్‌కు.. సితార జలక్‌ ఇస్తుంది. పెళ్లిపీటలపై అందరిముందు తన ప్రేమను చెబుతూ... హైదరాబాద్‌లో నెం.1 హార్స్‌రైడర్‌ అయిన సిద్దార్థ్‌తో గెలిస్తే ఆదిని పెళ్లిచేసుకుంటానని సవాల్‌ చేస్తుంది. ఇంకేముంది.. తప్పనిసరిగా రేసంటే తెలీని సిద్దు ఎలా పోటీ చేసి గెలిచాడు? తర్వాత కథేమిటి అనేది సినిమా.
 
నటీనటులు: 
యువకుడు కాబట్టి సాయిధరమ్‌ తేజ్‌ ఎప్పట్లాగే ఎనర్జిటిగ్గా కనిపించాడు. కేశాలంకరణ లుక్‌ మార్చాడు. నటన రొటీన్‌గానే వుంది. డాన్స్‌ కూడా కష్టంగా చేసినట్లుగా అనిపిస్తుంది.  అంతా తన మావయ్యల్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ స్పష్టంగా కనిపిస్తుంటుంది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటన పరంగా చేసిందేమీ లేదు. ఆమె గ్లామర్‌ డోస్‌ బాగా పెంచింది. జగపతి బాబు నటన ఓకే కానీ.. ఆయన ప్రత్యేకత చూపించే పాత్ర ఇది ఎంతమాత్రం కాదు. విలన్‌ అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ పరిధిమేరకు నటించాడు. తాతగా ముఖేష్‌రుషి నటించాడు. సింగం సుజాతగా పథ్వీ.. పద్మగా వెన్నెల కిషోర్‌ కొన్ని పంచ్‌లు పేల్చారు. ఆలీ పాత్ర పండలేదు.
 
సాంకేతిక వర్గం: 
ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం గొప్పగా ఏమీలేదు. తమన్‌ పాటలు పర్వాలేదు. పిచ్చోణ్ని అయిపోయా.. ఓ సితార పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం నిరాశ పరుస్తుంది. అబ్బూరి రవి మాటలు పర్వాలేదు. దర్శకుడు గోపీచంద్‌ మలినేని కథ విషయంలో ఎలా పడిపోయాడో అర్థంకాదు. గుర్రపు పందేల నేపథ్యం కొత్తగానే అనిపించినా.. వాటిని సరిగా ప్రెజెంట్‌ చేయలేకపోయాడు. స్క్రీన్‌ ప్లేలో ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. రొటీన్‌‌గా.. ఫార్ములా ప్రకారం వెళ్లిపోయాడు.
 
విశ్లేషణ: 
ఈ కథ చిరంజీవి కెరీర్‌ ఆరంభంలో చేసిన కథ. దానికి కొన్ని అధునాతన హంగులు చేర్చి 'విన్నర్‌'గా పెట్టడం ఆశ్చర్యంగా వుంది. నాన్నంటే ఇష్టముండు, గుర్రపు పందాలంటే చికాకు.. అందుకే ప్రాస కోసం రేసుగుర్రం, నాన్నకు ప్రేమతో అనే పాటలు ఇష్టముండదని డైలాగ్‌లు రచయిత బాగానే రాశాడు. కానీ కథ విషయంలో అంత శ్రద్ధ పెట్టలేకపోయాడు.
 
లోపాలు:
1. హీరోయిన్‌ గోల్‌ రన్నింగ్‌లో మెడల్‌ సంపాదించాలని.. అలాంటి ఆమెను ఒక్క షాట్‌లో మెడల్‌ వచ్చేలా హీరో చేసేస్తాడు.
2. అలాగే రేసింగ్‌లో ఎ,బి,సి,డీలు తెలీని హీరో.. ఏదోవిధంగా నేర్చుకోవాలి కాబట్టి.. అప్పటికప్పుడు సీన్‌ రాసేసి గెలిచేట్లు చేసేస్తారు మినహా ఎక్కడా కనెక్ట్‌కాదు.
3. తండ్రీ కొడుకుల్ని తాత ముఖేష్‌రుషి విడదీసే కారణం సరైందిగా లేదు. ఎవరో ముక్కుమొహం తెలీనివాడ్ని మానవుడిగా అంగీకరించడం దానికి తండ్రి ఒప్పుకోవడం సిల్లీగా వుంది.
4. కథ మొత్తంలో ఎక్కడా ఫీల్‌ కన్పించదు.
 
మామూలుగా ఆటలంటే బాక్సింగో.. క్రికెట్టో.. కబడ్డీనో.. ఇంకోటో పెడుతుంటారు. కానీ 'విన్నర్‌'లో గుర్రపు రేసులు పెట్టారు. అదీ తేడా. క్రికెట్టో కబడ్డీనో అయితే మనకు ఈజీగా కనెక్టయ్యే ఆటలు కాబట్టి.. ఆ మేరకు అయినా ఎంటర్టైన్మెంట్‌ ఉండేది. కానీ 'విన్నర్‌'కు నేపథ్యంగా గుర్రపు రేసులు ఎంచుకోవడంతో ఆటకు సంబంధించిన వినోదం కూడా పెద్దగా లేకపోయింది. హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ నుంచి ఎండ్‌ టైటిల్స్‌ పడే ముందువరకు రొటీన్‌గా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోయే 'విన్నర్‌' ఎక్కడా కూడా పెద్దగా ఎగ్జైట్మెంట్‌ కలిగించదు. అక్కడక్కడా కొంచెం కామెడీ మెరుపులు.. రెండుమూడు ఆకర్షణీయమైన పాటలు మినహాయిస్తే 'విన్నర్‌'లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.  
 
దర్శకుడు కొంత పరిధి గీసుకుని దాని మేరకు కథలు అల్లి సినిమా తీయడం ప్రధాన లోపం. సమాజంలో ఎన్నో కథలున్నాయి. వాటిని పరిశీలిస్తే ఇంతకంటే మంచి కథలు పుడతాయి. ఇండస్ట్రీలో ఓ కోటరిగా ఏర్పడిన కొంతమంది నుంచి వచ్చిన కథల్నే తిప్పితిప్పి.. మార్చిమార్చి చూపించడం అలవాటు చేసుకున్నారు. ఈ ట్రెండ్‌ నుంచి బయటకు వచ్చి సరైన కథల్తో ముందుకు వస్తారని ఆశిద్దాం.
 
హీరో 'తిక్క' సినిమా ఎంత తిక్కగా తీశాడో.. ఇప్పుడు అలాంటి తిక్క సినిమా తీశాడనే చెప్పవచ్చు. ఒక రైతును కొట్టి అతడి పొలంలో కొందరు బడా బాబులు గుర్రప్పందేలు ఆడేద్దామని చూస్తుంటే.. ఆ ఊరిలో ఓ వ్యక్తి... ఇప్పుడు ఒకడొస్తాడు.. మీ బెండు తీస్తాడు.. వాడు వీరుడు శూరుడు.. అంటూ హీరో గురించి స్తోత్రం చదవడం.. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇవ్వడం.. అందరినీ ఉతికారేయడం.. ఆపై ఒక పాటేసుకోవడం.. ఇలా ఎప్పుడో ఔట్‌ డేట్‌ అయిపోయిన సరుకే. ఇక హీరో చేసే జర్నలిస్టు పనేమిటో అర్థమేకాదు. ఒక్కసారిగా హీరోయిన్‌ చూడగానే ప్రేమించేయడం.. ఆమెను అల్లరి పెట్టడం.. మధ్యలో రెండు పాటలు.. ఇంతలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌.. అక్కడ ఒక సీరియస్‌ టర్న్‌.. ఇలా ఎక్కడా కూడా కమర్షియల్‌ ఫార్మాట్‌ నుంచి పక్కకు తప్పకుండా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుంది. అమ్మాయిల పేర్లు అబ్బాయిలికి పెట్టి పద్మగా వెన్నెల కిషోర్‌.. సింగం సుజాతగా పృథ్వీ... ఏదో చేద్దామని ఏదో చేసినట్లుంది.
 
అయితే రేసింగ్‌ సీన్లంతా బ్యాంకుల్ని మోసం చేసిన బెంగుళూరులోని విజయ్‌ మాల్యా గుర్రపు శాలల్లోనే చిత్రీకరించి సామాన్యుడికీ వాటిని చూపించడం విశేషం. జగపతి-సాయిధరమ్‌ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఫీల్‌ కన్పించదు. గత కొన్నేళ్లుగా ఒకే తరహా సినిమాలు కోరుకునే వారిని మాత్రం నిరాశ పర్చదు.
 
రేటింగ్‌: 2/5
అన్నీ చూడండి

తాజా వార్తలు

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

కాకినాడ SEZ కేటాయింపులు: విజయసాయి రెడ్డికి ఈడీ కొత్త నోటీసులు

అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీకి నష్టం కలిగిస్తాయా?

గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్- విగ్గులతో 50 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. (video)

Male Dwakra: మహిళలకే కాదు.. ఇక పురుషులకు కూడా డ్వాక్రా.. ఏపీ సర్కార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments