Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్‌లో 1150 స్క్రీన్‌లలో "ఆర్ఆర్ఆర్"

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (12:12 IST)
ఈ నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానుంది. కానీ, యూఎస్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే అంటే మార్చి 24వ తేదీనే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. మొత్తం 1150కి పైగా స్క్రీన్‌లలో రిలీజ్ చేస్తున్నారు. ఒక భారతీయ సినిమా ఈ స్థాయి లొకేషన్స్‌లలో రిలీజే చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రుఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, ఈ నెల 24వ తేదీ నుంచే యూఎస్‌లో ప్రీమియర్ షో మొదలవుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌గా చెప్పుకునే యూకేలోని ఐమాక్స్‌ తెరపై ఈ సినిమా ప్రీమియర్ షోను వేస్తున్నారు. ఇది ఒక రికార్డుగా భావిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించగా, ఆయన మనసు దోచిన సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది. కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలువనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments