Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల ఆరబోత మినహా... కథ ఎక్కడ? 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ రివ్యూ

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:55 IST)
చిత్రం: ఆర్డీఎక్స్ లవ్ 
బ్యాన‌ర్‌ : హ‌్యాపీ మూవీస్‌
న‌టీన‌టులు : తేజ‌స్ కంచ‌ర్ల‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, ఆదిత్య మీన‌న్‌, నాగినీడు తదితరులు
నిర్మాత : సి.కల్యాణ్
సంగీతం : రథన్
మ్యూజిక్: రధన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శంకర్ భాను
 
'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన నటి పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం సక్సెస్‌లో ఈమె కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకుసాగిపోతోంది. ఈ క్ర‌మంలో ఈ అమ్మ‌డు "ఆర్డీఎక్స్ లవ్" చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టన వ‌చ్చింది. 
 
ప్రముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ నిర్మాణంలో 'అర్థ‌నారి' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఓ గుర్తింపు తెచ్చుకున్న శంక‌ర్ భాను ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ముందు నుండి ఈ సినిమాలో పాయ‌ల్‌దే కీల‌క పాత్ర అన్న‌ట్లు చూపించారు. అస‌లు 'ఆర్డీఎక్స్ లవ్' సినిమా టీజ‌ర్‌తో సినిమా రొమాంటిక్ సీన్స్ ఎక్కువ‌గా ఉంటాయా? అస‌లు సినిమాలో ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నాడు? అనే సందేహాలు క‌లిగాయి. యూత్‌ను ఆక‌ట్టుకునేలానే సినిమా ఉంద‌ని కూడా అన్నారు. అయితే టీజ‌ర్‌తో అస‌లు సినిమా కంటెంట్‌ను డైరెక్ట‌ర్ రివీల్ చేశాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది ఇపుడు తెలుసుకుందాం. 
 
క‌థ‌: 
చంద్ర‌న్న‌పేట అనే గ్రామం నుంచి ఈ కథ ప్రారంభమవుతుంది. 40 గ్రామాల ప్ర‌జ‌లు ఓ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఆ స‌మ‌స్య కోసం పోరాడే వారిలో న‌ర్స‌య్య దొర‌(వి.కె.నరేష్‌) ఒకరు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి వారంతా ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో అలివేలు(పాయ‌ల్ రాజ్‌పుత్‌) ఓ హాస్ట‌ల్‌లో ఉండి.. కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌భుత్వ ప‌థకాల‌ను అమ‌లును స‌రిగా జ‌రిగేలా ప్ర‌చార కార్య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంది. 
 
ముఖ్యంగా ఎయిడ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి కండోమ్ వాడాల‌ని చెబుతూ ప్ర‌చారం చేసే క్ర‌మంలో సిద్ధు(తేజ‌స్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అలివేలును ఇష్ట‌ప‌డిన సిద్ధు ఆమె ప్రేమ కోసం పాట్లు ప‌డుతుంటాడు. క‌థ ఇలా కొన‌సాగే క్ర‌మంలో విజ‌య‌వాడ‌ను విడిచి వెళ్లిపోవాలంటూ అలివేలుకి పోలీసులు వార్నింగ్ ఇస్తారు. కానీ త‌ను అనుకున్న ప‌నిని సాధించ‌డానికి అలివేలు విజ‌య‌వాడ‌లోనే ఉండిపోతుంది. 
 
ఈ సమయంలో ఓ పెద్ద టీవీ ఛానెల్ అధినేత గిరిప్ర‌కాష్‌(ఆదిత్య మీన‌న్‌) రంగంలోకి దిగుతాడు. అత‌ను అలివేలును చంపాల‌నుకుంటాడు. ఇందుకోసం దాడి జరిపిస్తాడు. ఈ దాడి నుంచి తప్పించుకున్న అలివేలు... సిద్ధుతో క‌లిసి త‌న గ్రామానికి పారిపోతుంది. అస‌లు అలివేలు అలా ఎందుకు పారిపోతుంది? అలివేలు ప్లాన్ ఏంటి? అలివేలు త‌న గ్రామం స‌హా చుట్టు ప‌క్క‌ల ఉన్న గ్రామాల స‌మ‌స్య‌ల‌ను ఎలా తీర్చింది? అందుకు ఆమె చేసే త్యాగ‌మేంటి? అనేది మిగిలిన సినిమా కథ.
 
విశ్లేష‌ణ‌: 
'ఆర్ఎక్స్ 100' చిత్రంతో హీరోయిన్‌గా బ్రేక్ సాధించిన పాయ‌ల్ రాజ్‌పుత్‌.. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో రూపొందిన "ఆర్డీఎక్స్ లవ్" చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి సినిమాలో ఘాటుగా, హాటుగా కనిపించిన పాయల్... ఈ ఆర్డీఎక్స్ చిత్రంలో పాయల్ పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత అందులో రొమాంటిక్ స‌న్నివేశాలు చూసి అంద‌రూ అవాక్క‌య్యారు. అంత‌లా రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గా ఉంది. టీజ‌రే ఇలా ఉంటే ట్రైల‌ర్ ఎలా ఉంటుందో.. సినిమా ఇంకెలా ఉంటుందోన‌ని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
అయితే టీజ‌ర్‌కు భిన్నంగా ట్రైల‌ర్ ఉంది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను ప్ర‌సాద్ ఏదో మెసేజ్‌ను చెప్పాల‌నుకునేలా సినిమా ఉంటుంద‌ని.. అర్థ‌మైంది. పాత్ర ప‌రంగా చూస్తే.. అలివేలు పాత్ర‌లో పాయ‌ల్ రాజ్‌పుత్ చ‌క్క‌గా న‌టించింది. కండోమ్ లేకుండా శృంగారం చేయ‌డం, గుట్కాలు వాడ‌కం, మ‌ద్య‌పానాన్ని మానిపించ‌డం, ఇలా చాలా విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు టచ్ చేశాడు. అయితే ఈ అంశాలన్నింటిలో రొమాంటిక్ పార్ట్‌... డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోవ‌డంతో సామాన్య ప్రేక్ష‌కుడికి సినిమా కాస్త ఇబ్బంది క‌రంగా ఉంటుంది. ఇక యూత్‌ను ఆక‌ట్టుకునే రొమాంటిక్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. 
 
ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ అందాలు యూత్‌ను ఆక‌ట్టుకుంటాయి. తేజ‌స్ కంచ‌ర్ల పాత్ర, పాయ‌ల్ పాత్ర‌కు స‌పోర్టింగ్ అనే చెప్పాలి. అయితే పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్య‌త కూడా ఉంది. ఇక ఆదిత్య‌మీన‌న్‌, న‌రేష్‌, నాగినీడు, ఆమ‌ని, తుల‌సి.. పాత్ర‌ల‌న్నీ క‌థానుగుణంగాసాగుతాయి. అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు అనుగుణంగా సాగుతాయి. ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను ఓ పాత క‌థ‌ను హీరోయిన్ సెంట్రిక్‌గా చెప్పాల‌నుకుని ప్ర‌య‌త్నం చేశాడని చెప్పొచ్చు. అయితే ఫ‌స్టాఫ్‌లో ఎక్కువ భాగం, సెకండాఫ్‌లో కొద్దిభాగం రొమాంటిక్ అంటూ తీసిన స‌న్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు చాలా ఇబ్బందిగా మారాయి. 
 
రథన్ సంగీతం బాగాలేదని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తాన్ని గాలించినా... ఎక్కడా కూడా ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు కనిపించవు. అర్థ‌నారి అనే ఓ చిత్రాన్ని రూపొందించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు, నంది అవార్డు ద‌క్కించుకున్న శంక‌ర్ భాను ఇలాంటి క‌థ‌ను ఎందుకు చేశాడా? అనిపిస్తుంది. ఎవ‌రిపైనో కోపంతో సినిమా చేశాడా? లేక యూత్ రొమాంటిక్ సీన్స్‌ను చూస్తే చాలనుకుని సినిమా చేశాడా? అనిపిస్తుంది. అయితే క‌థ‌లో మాత్రం కొత్త‌ద‌నం మచ్చుకైనా కనిపించదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HMPV: బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్?

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం