Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశభక్తి పెంపొందేలా.. రామ్ (రామ్ రాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ రివ్యూ

డీవీ
శుక్రవారం, 26 జనవరి 2024 (13:25 IST)
Ram (Ram Rapid Action Mission)
రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా కథకు సరిపడేవిధంగా వున్న  రామ్ (రామ్ రాపిడ్ యాక్షన్ మిషన్) రూపొందింది.  దేశ భక్తికి కమర్షియల్ అంశాలను జోడించి అందరినీ ఆకట్టుకునే చిత్రాాలు తీయడం అంటే మాములు విషయం కాదు. తొలి ప్రయత్నంలోనే హీరో, దర్శక, నిర్మాతలు రామ్ సినిమాతో ఆ సాహసం చేశారు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
 
కథ
మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) సైన్యంలోవుంటాడు. దేశం కోసం వీర మరణం పొందుతాడు. అతని మరణాన్ని మరో మేజర్ జేబీ (భాను చందర్) ఆ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. మేజర్ సూర్య ప్రకాష్ కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)కు దేశభక్తి అంటే గిట్టదు. చిన్నతనంలోనూ నాన్న తనతో ప్రేమగా ఉండలేకపోయాడంటూ కోపంతో ఉంటాడు రామ్. అలాంటి రామ్‌ను సూర్య ప్రకాష్ కోరిక మేరిక డిపార్ట్మెంట్‌లోకి జాయిన్ చేయించడానికి జేబీ చేసిన ప్రయత్నాలు ఏంటి? జేబీ కూతురు జాహ్నవి (ధన్య బాలకృష్ణ)కు ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఏంటి? ఉగ్ర సంస్థల కుట్రను చివరకు రామ్ అడ్డుకున్నాడా? దేశభక్తి అసలే లేని రామ్.. చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిగా ఎలా మారాడు? అన్నదే కథ.
 
సమీక్ష
రామ్ పాత్రలో సూర్య  ఇప్పటి జనరేషన్ దుందుడుకుతనంతో బాగా నటించాడు. అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడిలా కనిపించినప్పుడు.. తన తండ్రి కొడుకుల తేడా ఇందులో దర్శకుడు బాగా చూపించాడు. మొదటి భాగంలో ప్రేమ కోసం తిరిగే ఓ సాధారణ కుర్రాడిలా కనిపిస్తాడు. ద్వితీయార్దంలో మాత్రం దేశం కోసం ప్రాణాలిచ్చే సిన్సియర్ ఆఫీసర్‌గా సీరియస్ పాత్రలోనూ అలరించారు. యాక్షన్ ఎమోషన్ కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ సూర్య ఆకట్టుకున్నాడు. 
 
 రోహిత్ చాలా రోజులకు మంచి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి కనిపించిన రియల్ హీరోలా మారాడు. భానుచందర్ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. సాయి కుమార్ పాత్ర కీలకం. ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శుభలేక సుధాకర్ తమ అనుభవాన్ని చూపించారు. హీరోయిన్ ధన్యా బాలకృష్ణ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. భాషా కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు మెప్పిస్తాయి.
 
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా కొత్తదేమీ కాదు. మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్‌లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులున్నారని చూపించారు. రామ్ డైరెక్టర్ మిహిరాం కూడా అదే పాయింట్ తీసుకున్నాడు. కథనాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే జర్నీని ఎంతో చక్కగా చూపించాడు.
 
హచ్‌ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్తది చూపించి.. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కున్నాడు. దేశం లోపల ఓ మతానికి చెందిన కోవర్టులు ఎలా ఉన్నారు? వారికి రాజకీయ నాయకుల అండ ఎలా ఉంటోంది? మన దేశంలోనే ఉంటూ.. పక్క దేశానికి పని చేసే స్లీపర్ సెల్స్ గురించి చూపించాడు. మిహిరాం మంచి పాయింట్‌ను ఎంచుకున్నాడు. అయితే దాన్ని పూర్తి స్థాయిలో జనాలకు నచ్చేలా తెరకెక్కించ లేదోమో అనిపిస్తుంది. ఉగ్రవాదం, పాకిస్తాన్ వంటి నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు మరింత ఫోకస్, సీరియస్‌నెస్‌తో తీసి ఉంటే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లేదనిపిస్తుంది.
 
మిహిరాం క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. ప్రతీ ఒక్క భారతీయుడికి ఈ సీన్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. త్రివర్ణ పతాకం కనిపించే షాట్, దేశ భక్తిని, మత సామరస్యాన్ని చాటేలా చివర్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేలా చూపించే షాట్.. హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సాయం చేసే సీన్‌కు దండం పెట్టాల్సిందే. భారత్ మాతాకి జై అని తెరపై అంటే.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకి సైతం ఆ వైబ్ వచ్చేలా చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
 
రామ్ సినిమాలో టెక్నికల్ టీం కొండంత అండగా నిలబడింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది. ధారన్ సుక్రి విజువల్స్, ఆయన టాలెంట్ చెప్పాలంటే క్లైమాక్స్ షాట్స్ చాలు. అద్భుతమైన కెమెరా వర్క్ కనిపిస్తుంది. మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాత కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలా ఉంది. చిన్నపాటి లోపాలున్నామంచి సినిమా చూశామనే త్రు ప్తి కలుుతుంది.
రేటింగ్ 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments