Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రాజా ది గ్రేట్'' రివ్యూ రిపోర్ట్: అంధుడిగా అదరగొట్టిన మాస్ మహారాజా..

హీరోయిన్ మీద విలన్ పగ తీర్చుకోవాలనుకోవడం, హీరో విలన్‌ను అంతం చేసి హీరోయిన్‌ను కాపాడడం ఇటువంటి రొటీన్ కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. హీరో అంధుడు కావడం. దర్శకు

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (14:20 IST)
నటీనటులు: రవితేజ, మెహ్రీన్, రాజేంద్రప్రసాద్, రాధిక, ప్రకాష్ రాజ్ తదితరులు
కథ-కథనం-దర్శకత్వం: అనీల్ రావిపూడి
సంగీతం: సాయి కార్తీక్
కూర్పు: తమ్మి రాజు
నిర్మాత: దిల్ రాజు
ఛాయాగ్రహణం: మోహనకృష్ణ
 
సోలోగా ఎనర్జటిక్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టి.. ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు మాస్ మహారాజ రవితేజ. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రవితేజ సినిమాలంటే ఎగబడి చూస్తారు. తాజాగా రవితేజ నటించి, అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ''రాజా ది గ్రేట్'' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే:
ప్రకాష్ (ప్రకాష్ రాజ్) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతడికి కూతురు లక్కీ(మెహ్రీన్) అంటే ప్రాణం. ప్రకాష్ ఓ కేసు విషయంలో రౌడీ దేవరాజ్(వివన్) తమ్ముడిని కాల్చి చంపేస్తాడు. దేవరాజ్‌కు తమ్ముడు అంటే చాలా ఇష్టం. దీంతో తమ్ముడిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ప్రకాష్‌ను, అతడి కూతురిని చంపాలనుకుంటాడు. ప్రకాష్ చనిపోగా, లక్కీ మాత్రం దేవరాజ్ నుండి తప్పించుకొని పారిపోతుంది.

పోలీసులు ఆమెకు రక్షణ కల్పించాలనుకుంటారు. అదే సమయంలో చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలనుకునే రాజా(రవితేజ) అనే అంధుడు తన తల్లి సహాయంతో లక్కీను కాపాడే పోలీస్ మిషన్‌లో చేరతాడు. మరి పుట్టుకతో గుడ్డివాడైన రాజా.. లక్కీను కాపాడగలిగాడా…? దేవరాజ్ తన పగను తీర్చుకున్నాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ: 
హీరోయిన్ మీద విలన్ పగ తీర్చుకోవాలనుకోవడం, హీరో విలన్‌ను అంతం చేసి హీరోయిన్‌ను కాపాడడం ఇటువంటి రొటీన్ కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. హీరో అంధుడు కావడం. దర్శకుడు రొటీన్ కథను ఎన్నుకున్నప్పటికీ దాని చుట్టూ రాసుకున్న సంభాషణలు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి.
 
ముఖ్యంగా హీరో పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరుని మెచ్చుకోవాల్సిందే. రవితేజ డైలాగ్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సినిమా మొదటి భాగం రొటీన్‌గా సాగిపోతుంది. రవితేజ, శ్రీనివాస్ రెడ్డి ఆడియన్స్‌ను బాగా నవ్విస్తారు. ఇక ఇంటర్వల్‌కు ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేస్తాయి. సెకండ్ హాఫ్‌లో రాధిక పాత్రను హైలైట్ చేస్తూ చెప్పించిన మాటలు ఆకట్టుకుంటాయి.
 
రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో తెరపై మ్యాజిక్ చేశాడు. సినిమా మొత్తం హీరోను గుడ్డివాడిగా చూపించిన దర్శకుడి సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. మెహ్రీన్ తన అందం, నటనతో అలరించింది. రవితేజ, శ్రీనివాస్ రెడ్డి కలిసి చేసిన కామెడీ పండింది. వివన్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, సంపత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కెమెరా పనితనం ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ కూడా రిచ్‌గా చూపించారు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ వర్క్ మీద మరింత దృష్టి పెట్టి వుంటే బాగుండేది. కథ రన్నింగ్ టైమ్ తగ్గించి వుంటే సినిమా ఇంకా బాగుండేది. 
 
ప్లస్ పాయింట్స్:
రవితేజ నటన
ఫస్ట్ హాఫ్
కామెడీ
 
మైనస్ పాయింట్స్:
కథ, కథనం.
సాగతీత
అనవసరపు సన్నివేశాలు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments