Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పైసా వసూల్" తేడా... జనాలకెక్కని సినిమా...

నందమూరి బాలకృష్ణ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పైసా వసూల్". ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో హీరో పేరు తేడా సింగ్. పేరులో ఎలా తేడా ఉందో చిత

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (09:41 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పైసా వసూల్". ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో హీరో పేరు తేడా సింగ్. పేరులో ఎలా తేడా ఉందో చిత్ర కథ కూడా తేడాగానే ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ జనాలకెక్కేలా కనిపించదు. 
 
కథను పరిశీలిస్తే.. ఈ చిత్రంలో హీరో ఓ రా అధికారి. ఈ విషయం చివరివరకు తెలియదు. అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. ఆ సమయంలో హీరో పేరు తేడా సింగ్. పేరుకు తగ్గట్టుగానే అతని చేష్టలు కూడా ఉంటాయి. పైగా, క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. 
 
ఈ క్రమంలో హీరోయిన్ శ్రియ జర్నలిస్టు. ఈమె కుటుంబంపై మాఫియా డాన్ దాడి చేసి, చెల్లెల్ని చంపేసేందుకు ప్రయత్నిస్తాడు. దీన్ని తేడా సింగ్ అడ్డుకుంటాడు. ఆ తర్వత మాఫియా డాన్ చరిత్రను తెలుసుకునేందుకు పోర్చుగల్‌కు శ్రియ వెళుతుంది. 
 
అక్కడ అతని గుట్టు తెలుసుకునేలోపు.. డాన్ మనుషులు ఈమెను గుర్తించి అటాక్ చేస్తారు. అపుడు క్యాబ్ డ్రైవర్‌గా ఉన్న తేడా సింగ్ రక్షిస్తాడు. దీంతో వీరిద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాత డాన్‌ను హీరో చంపేస్తాడు. ఒక 'రా' ఆఫీసర్‌గా డ్యూటీలో చేయలేని పనిని నాన్ డ్యూటీలో పూర్తి చేస్తాడు. 
 
వాస్తవానికి ఈ చిత్ర కథ హీరో రవితేజకు పక్కాగా సూటయ్యేది. కానీ, పూరీ జగన్నాథ్ కథ వినిపించగానే బాలయ్య ఎలా అంగీకరించాడే అర్థంకాదు. పైగా, బాలయ్య - పూరీ జగన్నాథ్ కాంబినేషనే ఓ పెద్ద తేడాగా ఉందని ప్రతి ఒక్కరూ భావించారు. ఈ చిత్రం చూశాక నిజంగానే ఈ కాంబినేషన్‌తో పాటు.. చిత్రం పెద్ద తేడాగా ఉందని తేలింది. 
 
విశ్లేషణ : పెండ్యాల 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments