Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాజిక్ లేని మ్యాజిక్ తో సరదాగా సాగే ఓం భీమ్ బుష్ రివ్యూ

డీవీ
శుక్రవారం, 22 మార్చి 2024 (10:46 IST)
Sri Vishnu, Priyadarshi, Rahul
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్'. ఈరోజే థియేటర్లలో విడుదలయింది. ఇంతకుముందు స్కూల్ లెవల్లో ఆ ముగ్గురు బ్రోచెవారెవరూ అనే సినిమాలోనూ తింగరి పనులు చేసి అలరించారు. కానీ ఈసారి కాలేజీ లెవల్లో ఏం చేశారనే పాయింట్ తో దర్శకుడు తీశాడు. మరిఎలా వుందో చూద్దాం.
 
కథ:
క్రిష్ణకాంత్ దుగ్గిరాల (శ్రీవిష్ణు), మాధవ్ రేలంగి (రాహుల్ రామక్రిష్ణ), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి) ఈ ముగ్గురూ ఒకే కాలేజీ. చదివాక తమకు ఉద్యోగాలు దొరకవని డిసైడ్ అయి యూనివర్శిటీలలో జాయిన్ అయితే అన్నీ ఫ్రీగా వుంటాయని చేరతారు. వీరివల్ల యూనివర్శిటీలో అందరికీ మనశ్శాంతి లేకపోవడంతో డీన్  రంజత్ (క్రిష్ణకాంత్ అయ్యంగార్) డాక్టరేట్ పట్టాలిచ్చి బయటకు పంపిచేస్తారు. అలా తాము డాక్టర్లా భావించి వినయ్ ఊరికి ముగ్గురూ వెళతారు.
అక్కడ ఊరిలో ఓ మంత్రగాడు ఊరివారిని బాగుచేసే క్రమంలో బాగా డబ్బు సంపాదిస్తున్నాడని తెలుసుకుని పోటీగా  వీరు ఎటు జెడ్ సొల్యూషన్ పేరుతో అన్ని సమస్యలకు సొల్యూషన్ పేరుతో ఊరిలో తిస్టవేస్తారు. సిల్లీగా వీరు చేసే పనుల వల్ల సమస్యలు సాల్వ్ కావడంతో ఊరివారికి దేవుళ్ళుగా మారిపోతారు. వీరివల్ల తమ వ్యాపారం దెబ్బతిందని గ్రహించిన మంత్రగాడు ఊరిలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెడతాడు. దాంతో మాటామాటా పెరిగి మంత్రాలకంటే సైన్స్ గొప్పదని భావిస్తే ఊరిలో సంపంగిమహల్ లో దెయ్యాన్ని వెళ్ళగొట్టి అక్కడ నిధిని తీసుకురావాలని ఛాలెంజ్ చేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది? వీరి తింగరి వేషాలు ఏవిధంగా కథను మలుపు తిప్పాయి అన్నది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
సినిమా విడుదలకుముందు నో లాజిక్ ఓన్టీ మ్యాజిక్ అని ముందుగానే చెప్పడంతో ఆ కోణంలో సినిమా చూస్తే చాలా పన్నీగా వుంటుంది. అందుకే కథకంటే ఆడియన్ ను ఎలా నవ్వించాలో అనే దానిపై శ్రద్ధ పెట్టారు. ఈ ముగ్గురిపైనే కథంతా సాగుతుంది. కాలేజీ నుంచి ఊరిలో జరిగే సమస్యల సాల్వ్ వరకు వారి చేసే తింగరి పనులు ఎంటర్ టైన్ చేస్తాయి. అయితే ఈ కోవలో ముగ్గురూ చెప్పే డైలాగ్ లు తొందరగా అర్థంకావు. చాలా స్పీడ్ గా మాట్లాడం వల్ల కాస్త ఆలస్యంగా నవ్వు తెప్పిస్తాయి.
 
ఇక దెయ్యం ఎపిసోడ్ ఈముగ్గురితో విన్యాసాలు మరింత ఎంటర్ టైన్ చేస్తాయి. పిల్లలకు పెద్దలకు కడుపుబ్బ నవ్వుకునేట్లుగా వుంటాయి. ఇంత ఎంటర్ టైన్ చేసి, సెంటిమెంట్ గా ముగింపులో కాస్త బరువెక్కించేస్తాడు దెయ్యం పాత్రతో దర్శకుడు. బాధ్యతలు లేకుండా బేవార్స్ గా మెలిగే ఈ ముగ్గురు దెయ్యం విషయంలో లాజిక్ లేకపోయినా దెయ్యం బాధ తీర్చడానికి ప్రయత్నించడమే చిత్రంలో ప్రధాన అంశం.
 
వీరికి హీరోయిన్లు లేకపోయినా ట్రైలర్ లో చూపిన అయేషాఖాన్, ప్రీతి ముకందన్ పాత్రలు ఓ సాంగ్ లో అలరిస్తారు. ప్రియవడ్డమాని, సాయి కామాక్షి కూడా గెస్ట్ రోల్స్ గా కనిపిస్తారు. ముగ్గరు హీరోలుగా తమ పాత్రలో లీనమై పోయి బాగా నటించారు. అయితే ఎవరూ హీరోలు కాదు. కేవలం ప్రధాన పాత్రలే. ఇక దెయ్యం పాత్ర బాగానే నటించింది. ఇలాంటి సినిమాకు రాజ్ తోట కెమెరా పనితం బాగా వుంది. సన్నీ సంగీతం పెద్దగా లేకపోయినా సన్నివేశపరంగా ఓకే అనిపిస్తాయి. నిర్మాణ పరంగా మధ్యలో ప్రవేశించిన యువి క్రియేషన్స్ వల్ల మరింత వాల్యూగా కనిపిస్తాయి. మొత్తంగా పరిశీలిస్తే ఎటువంటి అంచనాలు లేకుండా సిల్లీగా చూడాలని వెళితే కాసేపు నవ్వుకుని వస్తారు.
 రేటింగ్ 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments