Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ కథానాయకుడు' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే...

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (09:19 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్యాన్స్ షోలను ఉదయం 5 గంటల నుంచే ప్రదర్శిస్తున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ చిత్ర రివ్యూలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారనీ, అచ్చం ఎన్టీఆర్‌లాగే ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ క్రెడిట్ అంతా దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌కే దక్కుతుందని వారు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇకపోతే, సినిమాలోని దివిసీమ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించినట్టు ప్రకటించే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగులు, కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెబుతున్నారు. అయితే, చిత్రం తొలి అర్థభాగం కొంచెం సాగదీతగా అనిపించిందనీ, ఎన్టీఆర్ గెటప్‌లు ఎక్కువైపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ చిత్రం బాగానే ఉందని, బాలయ్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments