Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

దేవీ
శుక్రవారం, 20 జూన్ 2025 (07:19 IST)
Kubera latest poster
మరి కొద్ది గంటల్లో తెలుగులో విడుదలకాబోతున్న కుబేర సినిమా గురించి మహేష్ బాబు తన సోషల్ మీడియాలో మంచి విజయాన్ని సాధించాలని కోరుతూ పోస్ట్ చేశాడు. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కూడా మంచి కథతో రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ అంటూ పేర్కొన్నారు. ఇతర ప్రముఖులు కూడా రిలీజ్ కుముందే శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ యు.ఎస్.ఎ. ప్రీమియర్స్ కుబేర అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మనకంటే కొద్దిగంటలముందే అక్కడ విడుదలవడం తెలిసిందే.
 
కుబేర కథ, కథనం, నా క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి. కుబేర ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది అని నిన్ననే నాగార్జున తెలిపారు. ధనుష్ అయితే, ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదనీ, సక్సెస్ పై నమ్మకం వుందని ప్రీరిలీజ్ లో తెలిపారు. రష్మిక కూడా ఇలాంటి కథ, నటీనటులు, దర్శకుడితో సినిమా చేయడం అద్రుష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.
 
ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు దర్శకుడు చేయించారనీ నిర్మాత సునీల్ నారంగ్ ఇటీవలే పేర్కొన్నారు. మరి ఆ ఖర్చు ఈ సినిమా సక్సెస్ తో తీరుతుందా లేదా? చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments