Srikanth Reddy Asam, Chandrashikha
సినిమాకు హీరోతోపాటు నిర్మాత, దర్శకత్వం, సంగీతం దర్శకత్వం వహిస్తూ చేస్తున్న సినిమా అరుదుగా వస్తుంటాయి. అందులో ఉపేంద్ర, విజయ్ ఆంథోనీలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగులో కూడా కొందరు నవతరం వస్తున్నారు. ఆ కోవలో శ్రీకాంత్ రెడ్డి ఆసం చేసిన చిత్రం లారీ - చాప్టర్ 1. హీరోయిన్ గా చంద్రశిఖ శ్రీవాస్, రాకీ సింగ్ తదితరులు నటించిన ఈ సినిమా నేడు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
కథ:
చిత్తూరు జిల్లా రంగపట్నంలో వీధి రౌడీ హర్షవర్ధన్ ఆలియస్ హంటర్ (శ్రీకాంత్ రెడ్డి ఆసం). తరచూ గొడవలు పడడంతో ఓ సారి జైలు కూడా వెళతాడు. తిరిగి వచ్చార ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇక బుద్ధిగా వుంటూ మెకానిక్ గా పనిచేస్తుంటాడు. ఆ టైంలో మైనింగ్ అధిపతి ప్రతాప్ ఓ దందాను చేయడానికి హంటర్ ను కలుస్తాడు. అదే సమయంలో తన చెల్లి పెళ్ళికి డబ్బులు వెతుకుతుండగా ఈ పని రావడంతో హంటర్ అంగీకరిస్తాడు. ఓ లారీని ఇతర చోట డెలివరీ చేయడమే అతడి పని. ఆ లారీలో ఏమున్నాయి? అసలు లారీ అనే పేరు ఎందుకు పెట్టారు? చివరికి మైనింగ్ అధిపతి కోరిక తీరిందా? అనేది అసలు కథ.
సమీక్ష:
హర్షవర్ధన్ ఒన్ మాన్ షో. యూ ట్యూబ్ స్టార్‌గా తన అనుభవంతో ఈ సినిమాను మన ముందు పర్‌ఫెక్టుగా నిలబెట్టడంలో విజయం సాధించాడనే చెప్పాలి. నటించడంతో పాటు సినిమా నిర్మాణం చేయడంలో అనుభవం చూపించారు. దర్శకత్వం, నటన, సంగీతం, ఎడిటింగ్, స్టంట్‌లన్నీ తనే నిర్వహించి మల్టీటాలెంట్ చూపించాడు. హీరోగానూ శ్రీకాంత్ రెడ్డి నటన, డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ ఇరగదీశాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. తొలి సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుని టాలీవుడ్‌కు బెస్ట్ హీరో దొరికాడని నిరూపించుకున్నాడు. హీరోయిన్ చంద్రశిఖ క్యూట్‌గా కనిపించింది. లవ్ ఆండ్ రొమాన్స్ సీన్లలో యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. ఇక రాకీ సింగ్, చంద్రశిఖ శ్రీవాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇక తాడిపత్రి నాగార్జున సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ట్రాక్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది, లిరికల్ వీడియోస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. 3 గంటల రన్ అవర్ ఉన్నా కూడా టెంపో కొనసాగింపు ప్రతి సెకన్ మజా వచ్చేలా ఉంది. టెంప్లేట్ పాతగా అనిపించినా, కథలో కొత్తదనం ఉంది. దర్శకత్వం కొత్తగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా సరికొత్తగా ఉంది.
సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ సొంతం చేసుకున్న యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రతి పార్టులో ఎంతో పరిణతి, అనుభవం చూపించాడు. 'లారీ - చాప్టర్ 1' యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. లవ్ ఆండ్ రొమాన్స్ సీన్లు యూత్‌ను తెగ ఆకట్టుకుంటాయి. ఇక తండ్రి-కొడుకు సెంటిమెంట్, అన్నా-చెల్లి సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాలో బాగా పండాయి. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఒక యూట్యూబర్ నుండి సినిమా రంగానికి తన ప్రయాణాకిి పదును పెట్టి తనను తాను నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం.