Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రం ఎవరి కథో తెలుసా !

Advertiesment
Mastu Shades Unnai Ra poster

డీవీ

, శుక్రవారం, 2 ఆగస్టు 2024 (18:14 IST)
Mastu Shades Unnai Ra poster
మంచి సినిమాకు ఆడియెన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చిన్న చిత్రాలకు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద సక్సెస్‌ను అందుకుంటాయి. ఈ క్రమంలోనే మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.! అనే చిత్రం వచ్చింది.
 
టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, ఎమోషన్స్‌ని మించే టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అలాంటి బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని తీసిన చిత్రమే ఇది. అందరూ పోల్చుకో తగిన కథతో, అందరూ రిలేట్ అయ్యేలా ఇంటిల్లిపాది చూడగలిగే చిత్రంగా ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా.!’ అందరినీ ఆకట్టుకుంది. 
 
అభినవ్ గోమఠం , వైశాలి రాజ్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు. ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల సంయుుక్తంగా కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయి మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. మార్చ్ 29 నుంచి ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యుయింగ్ మినిట్స్‌తో దూసుకుపోయింది.
 
తారాగణం: అభినవ్ గోమఠం , వైశాలి రాజ్, అలీ రెజా, మోయిన్, "నిజాల్" రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ, ఫణి చంద్రశేఖర్ తదితరులు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది