Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

Galli Gang Stars Movie Review

వరుణ్

, ఆదివారం, 28 జులై 2024 (12:45 IST)
Galli Gang Stars Movie Review
నటీనటులు :
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి
టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్
స్టొరీ - దర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు ధర్మ
డి ఓ పి- ఎడిటర్- రచయిత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ
సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి
పి ఆర్ ఓ: మధు VR
 
కథ విషయానికొస్తే : నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన సినిమా. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు, క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాధలు. ఆ గల్లిని ఎప్పటినుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీషీటర్.
 
అక్కడ ఉన్న అనాధల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్ అమ్మించడం వంటి నేరాలు చేయిస్తూ ఉంటాడు. గాంధీ గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తూ ఉంటాడు. గాంధీ లక్ష్మీని ప్రేమిస్తూ ఉంటాడు. గోల్డ్ రెడ్డి గాంధీ ప్రేమిస్తున్న లక్ష్మీని ఏడిపిస్తాడు.
 
అదేవిధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఈ గల్లీ కుర్రాళ్ళకి సత్య అని చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. తన మాటలలో గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్ స్టార్స్‌గా ఎలా మారారు? ఈ ఆరుగురు అనాధలు ఎలా కలిశారు? గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎవరు ఎలా చేశారంటే : మొత్తం కొత్త వారైనా కూడా మంచి నటనను కనబరిచారు. సంజయ్ శ్రీ రాజ్ గాంధీ గా మంచి పాత్ర పోషించాడు. ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి అందరూ కూడా తమ పాత్రకు తగిన న్యాయం చేశారు. 
 
టెక్నికల్ ఆస్పెక్ట్స్ : ఏ బి డి ప్రొడక్షన్స్ పై డా. ఆరవేటి యశోవర్ధన్ నిర్మాతగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను నిర్మించారు. ధర్మ రచయిత, ఎడిటర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ తన బాధ్యతలను చక్కగా చేసాడు. సత్య శరత్ రామ్ రవి సంగీత సారథ్యంలో ఇచ్చిన ఆర్ఆర్, పాటలు బాగున్నాయి.
 
ధర్మ రచయిత, ఎడిటర్, డిఓపిగా తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాడు. ధర్మ దర్శకత్వ పర్యవేక్షణలో వెంకటేష్ కొండిపోగు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా డిఓపిగా ధర్మ సినిమాటోగ్రఫీ వర్క్ బాగా చేశాడు.
 
విశ్లేషణ: 'గల్లీ గ్యాంగ్ స్టార్స్' అనేది బలమైన సామాజిక సందేశంతో పాటు డ్రామా అండ్ యాక్షన్‌ని సమర్ధవంతంగా మిళితం చేసిన ఆకట్టుకునే చిత్రం. అణచివేతకు వ్యతిరేకంగా అనాథల కథ ఆకర్షణీయంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 
webdunia
Galli Gang Stars
 
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్, కొన్ని రొటీన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, మొత్తం కథనం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఎడిటర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా, రైటర్‌గా ధర్మ బహుముఖ పాత్ర పోషించడం సినిమాకు పెద్ద హైలైట్. 
 
ప్లస్ పాయింట్స్ : ధర్మ ఎంచుకున్న కథ కథనం 
సత్య, శరత్ రామ్ రవి ఇచ్చిన పాటలు
టెక్నికల్ వాల్యూస్
ఎడిటింగ్ - సినిమాటోగ్రఫీ వర్క్
లొకేషన్స్

మైనస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఫస్ట్ ఆఫ్
రొటీన్‌గా అనిపించే కొన్ని సన్నివేశాలు
రేటింగ్ : 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో రేణూ దేశాయ్ భేటీ.. ఎందుకో తెలుసా?