Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు ప్రాధాన్యం ఇచ్చారు : బండి సంజయ్ - కిషన్ రెడ్డి

bandi sanjay

వరుణ్

, బుధవారం, 24 జులై 2024 (09:54 IST)
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‍లు అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోగా, తెలంగాణ అనే పదాన్ని కూడా విత్తమంత్రి నిర్మల పలకలేదని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెల్సిందే. వీరి విమర్శలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు తిప్పికొట్టారు. 
 
మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. 2047 నాటికి భారత్‌ను అంతర్జాతీయంగా నెంబర్ 1గా చూడాలనేది మోడీ కోరిక అన్నారు. ఆ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. మౌలిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
 
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పింది కాంగ్రెస్, వంతపాడింది కేసీఆర్... వీరే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాను విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. డీపీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా సమర్పించని బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
 
అలాగే, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదాను ప్రకటించిందన్నారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు ఎకరాల భూ వివాదం.. ఆరుగురిని గొడ్డలితో నరికేసిన మాజీ సైనికుడు..