Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జస్ట్ ఎ మినిట్ ఎలా వుందంటే.. మూవీ రివ్యూ

Just a minite

డీవీ

, శనివారం, 20 జులై 2024 (13:09 IST)
Just a minite
నటీనటులు :  అభిషేక్ పచ్చిపాల, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, వినీషా, నజియా ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి
సాంకేతికత: కెమెరా: సమీర్, సంగీతం: ఎస్. కె. బాజీ, నిర్మాతలు: తన్వీర్, ప్రకాష్ ధర్మపురి, సమర్పణ: కార్తీక్ ధర్మపురి, దర్శకుడు: యశ్వంత్. 
 
కథ:
పాత కొత్త కలయికతో తీసిన సినిమా .జస్ట్ ఎ మినిట్. ఇందులో రవి (అభిషేక్ పచ్చిపాల) కు అనారోగ్యం వుంటుంది. ఆరోగ్యం కోసం శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. అనుకోకుండా పూజ (నజియా ఖాన్) తో పరిచయం ప్రేమకి దారితీస్తుంది. రవి ఆరోగ్యం గురించి ఆమెకు తెలీదు. ఆ సమస్య కేవలం స్నేహితుడైన రాంబాబు (జబర్దస్త్ ఫణి) కి తెలుసు. రాంబాబు సలహాతో ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలతో కథనం సాగుతుంది. రవి సమస్య పూజకు తెలిసిన తర్వాత ఏం చేసింది? దూరమయిందా? దగ్గరయిందా? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
యూత్ చిత్రాల పేరుతో వస్తున్న కథలకు కొంచెం భిన్నమైన అంశంతో ఈ చిత్రం రూపొందింది. యంగ్ ఏజ్ లో వుండే కుర్రాడికి అనారోగ్యం అనే సమస్యతో దర్శకుడు కథను రాసుకున్నాడు. దాన్ని పూర్తి ఎంటర్ టైన్ మెంట్ వేలో చూపించే ప్రయత్నం చేశాడు.  హీరోకు స్నేహితుడైన ఫణి పాత్ర ఎమోషన్స్ తోపాటు, వినోదాన్ని ఇస్తుంది. దీనికి తోడు పోలీసు పాత్రలు కూడా వినోదాన్ని పండించారు. ఇంకా తండ్రిగా సారిపల్లి సతీష్, మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు వారు బాగా నటించారు.
 
ఇక సాంకేతికంగా చూస్తే.. సహజంగా సంభాషణలు నిర్మాత తన్వీర్ రాయడం విశేషం. యూత్ ను బాగా ఫాలో అయి రాసినట్లుగా సన్నివేశపరంగా వున్నాయి. పాటలకు సంగీతం ఓకే అనిపించేలావుంది. పాస్ట్ బీట్ సాంగ్ వుంటే బాగుండేది.  మొదటిసారి దర్శకత్వం వహించిన యశ్వంత్ కథనం బాగున్నా, ఇంకొంచెం ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుందేది. కొన్ని చోట్ల సాగదీతదోరణిలో సాగుతుంది. సమీర్ సినిమాటోగ్రఫీ బాగుంది. దుర్గ నరసింహ ఎడిటింగ్ లో లాగ్ సీన్స్ తగ్గిస్తే బాగుండేది.
 
ద్వితీయార్థంలో కథంతా వుంది కాబట్టి ఆసక్తిగా వుంది. నటీనటుల మధ్య ఎంటర్ టైన్ మెంట్ బాగా పనిచేసింది. పాటలు ఓకే.  ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. 
 రేటింగ్ : 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ కల్కి సినిమా వెయ్యికోట్ల కలెక్లన్లు నిజమేనా ?