Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రౌండ్ మూవీ ఎలా వుందంటే... రివ్యూ

డీవీ
ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (09:20 IST)
ground movie
హ‌రినాథ్‌, తేజ‌స్విని ప్ర‌ధాన పాత్ర‌ల్లో సూర‌జ్ తాడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మించిన గ్రౌండ్ మూవీ. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో టీనేజ్ ల‌వ్ స్టోరీని మిళితం చేస్తూ తీసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ గురించి చెప్పాలంటే..
ఆదివారం వస్తే చాలు గ్రౌండ్ చూసుకుని క్రికెట్ ఆడే టీనేజ్ బ్యాచ్. అందులో హ‌రి, తేజూ ప్రేమ‌లో ఉంటారు. హ‌రికి క్రికెట్ పిచ్చి. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓసారి గ్రౌండ్‌కు వెళ‌తాడు. అక్కడ వేరే గ్రూప్ బ్యాచ్ కూడా వుంటుంది. స్నేహితులను బలవంతంగా ఒప్పించి పోటీ గ్రూప్ తో  బెట్టింగ్ మ్యాచ్ ఆడుతారు.  ఈ ఆట వల్ల హరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తర్వాత వారి ప్రేమ కథ ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష
క్రికెట్ నేపథ్యంలో అందులోనూ ఒక్కరోజులో జరిగే కథను తీసుకుని దర్శకుడు చేసిన డ్రామా కొన్నిచోట్ల ఆకట్టుకుంది. దానికి లవ్ స్టోరీని జతచేని కాస్త ఆసక్తి కలిగించాడు. ఇందులో అందరూ కొత్తవారే. టీనేజ్ కాబట్టి చాలా ఫ్రెష్ ఫేసెస్ కనిపించాయి. వారి నటన వారి ప్రవర్తన అంతా సహజంగా వుంటుంది. అందుకే నేపథ్యపరంగా వచ్చే సౌండ్ లను కూడా కరెక్ట్ గా ఉపయోగించుకున్నాడు. ఓ దశలో ప్రేక్షకుడిని గ్రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతాడు దర్శకుడు. ఆడుతున్నప్పుడు చుట్టుపక్కల వచ్చే శబ్దాలను కూడా కేర్ తీసుకుని పక్షుల కిలకిలలు కూడా బీజీఎం. లో మిక్స్ చేశాడు.  
 
ఒక రకంగా చెప్పాలంటే, మూసధోరణిలో కాకుండా కాన్సప్ట్ బేస్ లోనే తను తీయాలనుకున్నది దర్శకుడు తీశాడు. శేఖర్ కమ్ముల ఫార్మెట్ లో వున్న కొన్ని సన్నివేశాలు తరహాలో స్నేహితుల మ‌ధ్య ఉండే గొడ‌వ‌లు, అపోజిట్ టీమ్‌పై గెల‌వ‌డానికి వేసే ఎత్తుల‌ను చూపించారు. అందుకే. ఒక్క రోజులోనే జరిగే కథ కాబట్టి గంట న‌ల‌భై రెండు నిమిషాల నిడివిని తీసుకుని ప్రయోగం చేశాడు. ఓరకంగా వినూత్నమైన షార్ట్ ఫిలింలా తీశాడని కూడా చెప్పవచ్చు. ఇలాంటి సినిమా కాబట్టి ఆర్టిస్టులను పరిచయం చేసే విధానం నిదానంగా సాగుతుంది. హాస్యం పేరుతో కొన్నిచోట్ల పెద్దగా నవ్వులు తెప్పించవు. కొత్తవారైనా అందరి నటన బాగుంది. కొన్నిచోట్ల నాగ‌రాజు పాత్ర డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి.
 
ఇలా సాగిపోతూండగా హ‌రి, తేజ‌స్విని ప్రేమ వ్యవహారం కాస్త రిలీఫ్ గా వుంటుంది. ఇక మ్యూజిక్ పరంగా భాస్కర్  సినిమాటోగ్రఫీ  జహీర్ భాషా త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, తక్కువనిడివి, కొత్తవారితో చేయడంతో ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటూ రొటీన్ కి భిన్నంగా  చిత్రీకరించడం ప్రధాన ఆకర్షణ. కొంత అక్కడక్కడ స్లో నెరేషన్ తో లాగ్ సీన్స్ ఉండడం మైనస్ అని చెప్పవచ్చు. ఏదిఏమైనా కొత్తదనం పేరుతో ఔత్సాహిక కళాకారులు, సాంకేతిక సిబ్బంది ఆలోచించిన విధానం మెచ్చుకోదగింది. 
రేటింగ్: 2.75/5

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments