Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరూపాక్ష సినిమా ఎలా వుందో తెలుసా, రివ్యూ రిపోర్ట్‌

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:25 IST)
Virupaksha
సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంగా కోలుకుని చేసిన సినిమా విరూపాక్ష. సార్‌ సినిమాలో నటించిన సంయుక్తమీనన్‌ ఇందులో కథానాయిక. కార్తీక దండు దర్శకుడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌, ఊరిలో వరుస హత్యల నేపథ్యంలో సినిమా వుంటుందని ముందునుంచి చెబుతూ అందరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్న ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
పట్టణానికి  దూరంగా అడవీ ప్రాంతానికి దగ్గరావుండే గ్రామం రుద్రపురం. బయటనుంచి ఈ ఊరు వచ్చిన ఓ కుటుంబం క్షుద్రపూజలు చేస్తుంటుంది. ఇది చూసిన గ్రామస్తులు అప్పటికే మసూచివల్ల చనిపోయిన కొంతమంది గ్రామస్తులను వీరి పూజతో చంపేస్తున్నారంటూ వారిని ఓ చెట్టుకుకట్టి సజీవ దహనం చేస్తారు. ఆ కుటుంబంలో పిల్లాడు, పిల్ల బయటపడతారు. ఇది కళ్లార చూసిన పిల్లలు భయంతో పగతో రగిలిపోతుంటారు. చివరికి ఊరినుంచి పిల్లలని వెలివేస్తారు. ఇది జరిగిన పుష్కరకాలంకి ఊరిలో ఒక్కొక్కరు ఏదో రూపంలో చనిపోవడంతో ఆ సమయంలోనే సూర్య (సాయిధరమ్‌ తేజ్‌) తన తల్లిఊరుకావడంతో జాతరకు వస్తాడు. ఆ తర్వాత ఊరిలో నందిని (సంయుక్తమీనన్‌)ను చేసి ప్రేమిస్తాడు. జాతర మొదలు కాగానే ఊరిలోని అమ్మవారి గుడిలో ఓ గ్రామస్తులు రక్తం కక్కుకుని చనిపోతాడు. ఊరికి అరిష్టం అని పూజారి సాయిచంద్‌ గుడిని మూసివేసి తన ఊరి శాసన ప్రకారం ఊరిలోంచి ఎవరూ బయటకురాకుండా, ఇక్కడివారి బయటకు వెళ్ళకుండా అష్టదిగ్బంధనం చేయిస్తాడు. కానీ ఆ తర్వాత కూడా ముగ్గురు చనిపోవడంతో సూర్యకు అనుమానం వచ్చి ఊరిని కాపాడేబాధ్యతను తనమీద వేసుకుంటాడు. ఎందుకు అలా చేశాడు? ఆ తర్వాత ఏమి జరిగింది? ఊరి జనాలు చనిపోవడానికి కారకులు ఎవరు? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఈ కథ దర్శకుడు రాసుకున్నదే. అయితే ఇదంతా చూస్తే చాలాకాలనుంచి కొన్ని గ్రామాల్లో మంత్రసానులను, ఇతర పూజలు చేసే వ్యక్తులను గ్రామానికి కీడుచేస్తున్నారని సజీవ దహనం చేసిన సంఘటనలు, చెట్టుకుకట్టేసి కొట్టేసంఘటనలు జరిగాయి. ఇదంతా మూఢనమ్మకాలను కొందరు ఆ తర్తాత వాదించడం జరిగింది. సరిగ్గా ఈ పాయింట్‌ను దర్శకుడు ఎంచుకున్నారు. సినిమా ఆరంభం నుంచి హర్రర్‌ నేపథ్యం గనుక చిన్నపిల్లలు భయపడేటట్లు వుంటుంది. ఇక ఇప్పటి యూత్‌కు ఇలాకూడా జరుగుతాయనా! అనే కోణంకూడా తెలుస్తుంది. 
 
ఊరిని పట్టి పీడిస్తే దుష్టశక్తిని సూర్య ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్‌ చాలా ఆసక్తికరంగా వుంది. ఊరిని పట్టే దుష్టశక్తి అని అఘోరా (అజయ్‌) చెప్పిన మాటల తర్వాత ఇద్దరు ముగ్గురుపై అనుమానం కలిగించే దర్శకుడు మాజిక్‌ చేశాడు. కానీ అసలు దుష్టశక్తి ఎవరనే సస్పెన్స్‌ చివరివరకు బాగా మెయిన్‌టేన్‌ చేశాడు. ఆ క్రమంలో కొన్ని లాజిక్‌లులేని సన్నివేశాలు వున్నాయి. ఫస్టాప్‌ బాగా వుంది. సెకండాఫ్‌లో భారీ కతను చెప్పినట్లుగా లెంగ్త్‌ ఎక్కువయింది. 
 
సంగీతపరంగా  అజనీష్ లోక్‌నాథ్ బీజియమ్స్‌ బాగా వున్నాయి. ఇందులో నటించిన పాత్రలన్నీ వారి పరిధిమేరకు నటించారు. హీరో, హీరోయిన్ల పాత్రలే ఇందులో కీలకం. ఇద్దరూ బాగానే నటించారు. బ్రహ్మాజీ, సునీల్‌ ఇతర పాత్రల్లో బాగానే చేశారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ త్రిల్‌ కలిగించేవిగా వున్నాయి. శామ్‌దత్ సైనుద్దీన్ కెమెరా పనితనం బాగుంది. ఇటువంటి కథను భారీగాతీసిన నిర్మాతలను అభినందనీయులు. ఎంతో గొప్పగా తీసిన ఈ సినిమాలో ఏదో మిస్‌ అయిన ఫీల్‌ కలిగిస్తుంది. అది స్క్రీన్‌ప్లేలో దర్శకుడు ఇంకాస్త గ్రిప్పింగ్‌ చెప్పి, లెంక్త్‌ దగ్గిస్తే బాగుండేది. 
 
బలాలు: సినిమా కథ, కథనం, నటీనటుల అభినయం, సాంకేతిక నైపుణ్యం
మైనస్‌లు: ఊరి ప్రెసిడెంట్‌కు పిల్లలు లేరని విషయం చెప్పకుండా ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు క్లయిమాక్స్‌లో చెప్పడం.
` సంయుక్తమీనన్‌ ఎందుకు బావిలో పడి చనిపోవాలనుకున్నదీ లాజిక్‌ లేదు. 
` విరూపాక్ష అనే టైటిల్‌ ఇప్పటి జనరేషన్‌ కు పెద్దగా అర్థం కాకపోవడం. చివర్లో క్లూ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేదు. థియేటర్‌ కు వచ్చేలా ఆసక్తికరంగా టైటిల్‌ వుంటేబాగుండేది.
 
 మొత్తంగా చూస్తే ఈ సినిమా రొటీన్‌ రొట్టకొట్టుడు సినిమా కథలకు భిన్నమైంది. ఎప్పుడో గానీ ఇటువంటి క్షుద్రశక్తుల కథలు రావు. దానిని ఈసారిసాయిధరమ్‌ తేజ్‌ చేత చేయించి చూపించారు. అయితే ఇది ఒన్‌టైమ్‌ వాచ్‌బుల్‌. సీరియస్‌ మూవీ కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌ కాస్త మిస్సింగ్‌. అది కూడా వుంటే మరింత రేంజ్‌ పెరిగేది.
రేటింగ్‌: 3.25/5
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments