Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర సెన్సార్ రిపోర్ట్ వచ్చాకే ట్రిమ్ చేశారు? దేవర ప్రివ్యూ రిపోర్ట్

డీవీ
గురువారం, 26 సెప్టెంబరు 2024 (11:47 IST)
Devara preview poster
ఎన్.టి.ఆర్., కొరటాల శివ, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో రేపు ఇండియాలోనూ, ఈరోజు సాయంత్రం ఓవర్ సీస్ లోనూ విడుదలకానున్న దేవర’ చిత్రంపై చిత్ర యూనిట్ చాలా టెన్షన్ గా వున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేసేశారు. ఆర్.ఆర్. ఆర్. తర్వాత దేవరపై అక్కడి అబిమానులు, ప్రేక్షకులు టికెట్లను హాట్ కేక్ ల్లా అమ్మేలా చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే షోలు వేసి టికెట్ల రేట్లు కూడా పెంచేశారు. 
 
అంతా బాగానే వుంది. కానీ సినిమా రిజల్ట్ పై చిత్ర టీమ్ తాము పడ్డ కష్టంతో మంచి సినిమా తీశామని నర్మగర్భంగా చెబుతున్నారు. కానీ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం కథ వేరేలా వుంది. సెకండాఫ్ చాలా లాగ్ గా వుండడం, ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా వుందని ఓ సభ్యుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కథ సముద్ర దొంగల నేపథ్యం కనుక హింస కూడా పరాకాష్టలా వుంటుందని ట్రైలర్ ను బట్టే తెలుస్తోంది. 
 
కథ ప్రకారం తీసుకుంటే ఎన్.టి.ఆర్. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. తండ్రి పాత్ర మొదటి పార్ట్ లోనే ఎక్కువగా వుంటుంది. చివరలో కొడుకు పాత్ర వుండబోతోంది. ఆ ఎపిసోడ్ కు జాన్వీకపూర్ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆమె కేవలం 10 నిముసాల నిడివి మాత్రమే వుంటుందట. అందులో రెండు పాటలు ఆమెపై వుంటాయని సమాచారం. ఆర్.ఆర్.ఆర్.లో రామ్ చరణ్ భార్య పాత్ర నిడివికి మించి వుండదనే పోలిక కూడా చేసినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలు కనుక రెండో భాగంలో యువ ఎన్.టి.ఆర్. తన తండ్రి కోసం ఏం చేశాడనేది దర్శకుడు చెప్పనున్నాడని తెలిసింది.
 
ఇక మూడుగంటల నిడివిగల ఈ సినిమాను సెన్సార్ రిపోర్ట్ వచ్చాక ఎడిటింగ్ కు పనిచెప్పారట. అందులో 15నిముషాలపాటు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. అయినా ఇంకా తగ్గించాల్సి వుందని ఎడిటర్ చెప్పినట్లు కూడా వార్త బయట వినిపస్తుంది. ఇటీవలే దర్శకుడు కొరటాల మాట్లాడుతూ, చిరంజీవి నటించిన ఆచార్య గురించి చెబుతూ, కొన్ని కారణాలవల్ల తప్పిదం జరిగిందని అన్నారు. మరి దేవరలో కావాల్సినంత ఫ్రీడమ్ వుంది. నిర్మాతలు కూడా దర్శకుడికి బంధువులే కావడంతో మరి ఈ సినిమా ఏ స్థాయిలో తీసివుండాలి అనే టాక్ కూడా వుంది. కనుకనే ముందుగానే టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా మొదటి మూడురోజులు ఫుల్ అవుతాయని తర్వాత ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేవర యూనిట్ పడ్డ కష్టానికి ఫలితం వస్తుందోలేదో.. చూద్దాం ఏం జరుగుతుందో. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో ఎలాన్ మస్క్ లవ్వాయణం

పారాసిట్మాల్ మాత్రల్లో నాణ్యతా లోపం : డ్రగ్స్ టెస్టుల్లో ఫెయిల్

వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప గుండెపోటు.. ఏమైంది?

వంగవీటి రాధకు గుండెపోటు.. ఆందోళన అక్కర్లేదన్న వైద్యులు!

మహాలక్ష్మిని హత్య చేశాడు.. ఫ్రిజ్‌లో కుక్కిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments