Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్ 'ధృవ' రివ్యూ: ఫస్టాఫ్ ఓకే.. సెకండాఫ్ ఓకే అయితే బొమ్మ బ్లాక్‌బస్టరే...

'మగధీర' చిత్రం తర్వాత సరైన హిట్ లేక అల్లాడుతున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా ధృవ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ చిత్రం 'తనీ ఒరువన్' అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశాడు. ఈ చిత్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (08:45 IST)
టైటిల్ : ధృవ (2016)
స్టార్ కాస్ట్ : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి
మ్యూజిక్ : హిప్ అప్
డైరెక్టర్ : సురేందర్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : అల్లు అరవింద్
విడుదల తేది : 9 డిసెంబర్, 2016 (శుక్రవారం)
 
 
'మగధీర' చిత్రం తర్వాత సరైన హిట్ లేక అల్లాడుతున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా ధృవ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ చిత్రం 'తనీ ఒరువన్' అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కాగా, అల్లు అరవింద్ నిర్మాత. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఈ చిత్రాన్ని నిర్మించారు.  
 
ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం మొదటి ఆట (ఫ్యాన్స్ షో) శుక్రవారం వేకువజామునే ప్రారంభమైంది. ఫస్టాఫ్ ఒకే అంటూ ఈ చిత్రాన్ని వీక్షిస్తున్న వారు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. సెకండాఫ్ కూడా ఓకే అయిత్ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడం తథ్యమని వారు పేర్కొంటున్నారు. 
 
పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కామెంట్స్ పరిశీలిస్తే... ఫస్టాఫ్ బాగానే ఉందని, సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటే సినిమాకు ఢోకా లేదని కొందరు అంటున్నారు. అయితే, విదేశాల్లో ఇప్పటికే పూర్తి షో చూసినవాళ్లు మాత్రం ఓ మాదిరిగా స్పందిస్తున్నారు. మొత్తమ్మీద ధృవ యావరేజి సినిమా అని, సెకండాఫ్‌లో సూరి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఓవర్సీస్‌లో ఒక మిలియన్ కష్టమేనని అంటున్నారు. కడపలో ఫస్టాఫ్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. స్క్రీన్‌ప్లే రేసీగా ఉందని, పాటల పిక్చరైజేషన్ కూడా బాగుందని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.
 
ఇక తెలుగు వ్యక్తిగా తాను ధృవ చూశానని, తమిళ సినిమా చూసి అంత ఎక్కువ ఆస్వాదించలేకపోయానని, ధృవ బాగుందని, దాన్ని మిస్ కావద్దని మరో ఎన్నారై చెప్పారు. 'మగధీర' తర్వాత చరణ్‌కు ఇదే మంచి మూవీ అవుతుందని, రీమేక్ కూడా చాలా బాగుందని ఇంకొకరు చెప్పారు. రికార్డులు, ఇతర విషయాల సంగతి మర్చిపోతే.. చరణ్ మాత్రం బాగా చేశాడని అన్నారు. ప్రతి ఫ్రేములోనూ కష్టం కనిపిస్తోందని మరొకరు చెప్పారు.
 
ఈ చిత్రంలో మాతృకలో విలన్ - హీరోల మధ్య సాగే కోల్డ్ వార్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆ సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా సాగాయి. 'ధృవ'లో ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా జాగ్రత్తపడుతూనే.. కొన్ని అదనపు సన్నివేశాలను జోడించారు. వీటిలో చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ, టైటిల్‌లో నెం.8 సస్పెన్స్ ప్రధానమైనవి. దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలీష్ టేకింగ్ కూడా 'ధృవ' రేంజ్‌ని పెంచింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments