Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

డీవీ
శుక్రవారం, 24 జనవరి 2025 (18:12 IST)
Hathya poster
నటులు:ధన్య బాలకృష్ణ,రవి వర్మ,పూజా రామచంద్రన్, దర్శకుడు: శ్రీవిద్య బసవ, నిర్మాత ప్రశాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అభిరాజ్ రాజేంద్రన్, ఎడిటర్ అనిల్ కుమార్.
 
ధన్య బాలకృష్ణ,రవి వర్మ,పూజా రామచంద్రన్, దర్శకుడు: శ్రీవిద్య బసవ కాంబినేషన్ లో రూపొందిన హత్య సినిమా ట్రైలర్ విడుదలయ్యాక రాయలసీమలో జరిగిన హత్య నేపథ్యం గుర్తుకువస్తుంది. దీనిగురించి దర్శకురాలు మాట్లాడుతూ, ఇది వాస్తవ ఘటన ఆధారంగా చేశాం. సినిమా చూశాక మీరే ఊహించుకుంటారు అని చెప్పారు. ఇలాంటి కాన్సప్టె లు ఆసక్తిగా వుంటాయి. అయితే వాటి నేపథ్యాలు కొత్తగా వుంటే వినూత్నంగా అనిపిస్తాయి. అన్నీ కూడా కల్పిత పాత్రలే అని, ఎవరినైనా పోలి ఉంటే యాదృశ్చికం అని కార్డు వేశారు. మరి ఈ హత్య ఎలా వుందో చూద్దాం.
 
కథ
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్య బాలకృష్ణ)ని పిలిచి మరణించిన తన చిన్నాన్న జేసీ ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) కేసుని అప్పగిస్తాడు. నలుగురి టీమ్ తో కేసును శోధించే క్రమంలో ఇల్లెందు వెళుతుంది. అందరికీ కావాల్సిన వాడైన ధర్మేంద్ర రెడ్డి బాత్ రూమ్ లో దారుణంగా హత్యకు గురికావడం, అది గుండెపోటుతో చనిపోయినట్లుగా క్రియేట్ చేయడం తెలుసుకుంటుంది. ఆ క్రమంలో అక్కడ పోలీసు అధికారితోనూ, దర్మేంద్ర రెడ్డి అనుచరులు, పనివాల్ళతో పరిశోధన సాగిస్తుంది. హత్య జరిగిన చోట తన కారుడ్రైవర్ ను టైంకు రమ్మంటే నన్ను చంపేశాడనీ. నా కారు డ్రైవర్ ను ఏమిచేయవద్దని ఓ నోట్ దొరుకుతుంది. ఆ తర్వాత  ధర్మేంద్ర రెడ్డికి ఆర్థిక సమస్యలు వున్నాయనీ, సలీమ (పూజా రామచంద్రన్) అనే మహిళతో ఉన్న అక్రమ సంబంధం వుందని బయటపడుతుంది. ఈ క్రమంలో సాగిన కేసులో పోలీసు అధికారి సుధ ఏం సాధించింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
కథ, కథనం, సంఘటనలు అన్నీ చూస్తే 2019లో జరిగిన కడప ఎం.పి. హత్య కేసని ఇట్టే తెలిసిపోతుంది. ఊరి పేరు దగ్గర నుంచి, వాళ్ల ఆహార్యం, యాస ఇవన్నీ చూస్తుంటే ఈ కథ ఎవరిదో అందరికీ ఇట్టే తెలిసిపోతోంది. ఇక పేర్లు సైతం అందరికీ అర్థమయ్యేలానే పెట్టారు. వైఎస్ వివేకా హత్య కేసుని ఆధారంగా చేసుకుని ఈ కథ, స్క్రీన్ ప్లేని దర్శకురాలు శ్రీవిద్య బసవ చక్కగా రాసుకున్నారు. పాత్రలచే బాగా ఔట్ పుట్ రాబట్టుకున్నారు.
 
కథంతా తెలిసినట్లే వున్నా ఏదో కొత్త విషయంచెప్పబోతుంది అనే ఆసక్తిని కలిగించారు. ఈ కేసులో బయట వినిపించిన వాదనలు, వచ్చిన ప్రచారాలు అందరికీ తెలిసిందే. అయితే సినిమాలో ఏం చూపించి ఉంటారా? అనే కుతుహలం అందరిలోనూ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ కూడాగతంలో వంగవీటి వంటికొన్ని సినిమాలు తీసి ఆర్భాటాలు, వివాదాలు అంటూ అందరి నోళ్లలో నానుతూ ఉండేవాడు.
 
కానీ శ్రీవిద్య బసవ కు ఇది రెండో సినిమా కాబట్టి. చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయినా ఈ మూవీలో చూపించినట్టుగా జరిగిందా? అని అంటే.. చెప్పడం కష్టమే అవుతుంది. బయటి విషయాలతో సంబంధం లేకుండా సినిమాని సినిమాలా చూస్తే మాత్రం చివరకు ఎమోషనల్‌గా కదిలిపోతారు. చాలా క్రూరంగా చంపే ఆ విజువల్స్ చూస్తే ప్రేక్షకుడి ఒళ్లు జలదరిస్తుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో దర్శకురాలు సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
 
ఫస్ట్ హాఫ్ అంతా శోధనతో సాగడంతో పెద్ద ట్విస్ట్ అనిపించదు. ముస్లిం మహిళ కనిపించడంతో ఇంటర్ వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్‌లో లవ్ స్టోరీ కొందరికి నచ్చొచ్చు. ఇంకొందరికి ఇదేంట్రా బాబు అని అనిపించొచ్చు. క్లైమాక్స్ అందరినీ కదిలిస్తుంది. టెక్నికల్‌గా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ లొకేషన్స్‌లో చక్కగా తీశారు. నిర్మాత పెట్టిన ఖర్చుకి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టు అనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా సహజంగా అనిపిస్తుంది. మ్యూజిక్ అయితే సినిమాను నిలబెట్టేలా ఉంటుంది. మూడ్‌కు తగ్గట్టుగా ఆర్ఆర్‌ను డిజైన్ చేశారు.
 
నటీనటులుగా ధన్య బాలకృష్ణ, రవి వర్మ, పూజా రామచంద్రన్‌ల బాగా సూటయ్యారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ధన్య బాలకృష్ణ నటన ఆకట్టుకుంటుంది. రవి వర్మ తన పాత్రలో జీవించేశాడు. పూజా రామచంద్రన్ కారెక్టర్ నిడివి తక్కువే అయినా ఇంపాక్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. చిన్నా రెడ్డి, కవితమ్మ, కిరణ్, వెంకటేష్ రెడ్డి, పెద్ది రెడ్డి, షేక్ అలీ, కిషోర్ రెడ్డి, ఆనంద్ యాదవ్, సందీప్ రెడ్డి, భద్రయ్య ఇలా చాలా పాత్రలు వచ్చి వెళ్తుంటాయి.
 
ఇలాంటి మర్డర్ మిస్టరీ కథలు కొంతమందికి బాగా నచ్చుతాయి. అయితే చిక్కుముడి విప్పి జరిగిన కథకు ఏదో సెల్యూషన్ చూపిస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. తన శైలిలో బాగా డీల్ చేశారు దర్శకురాలు.
2.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balineni: పవన్ కల్యాణ్‌ను కలిసిన బాలినేని.. వైకాపాలో వణుకు

డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టం.. భారత విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను?

ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments