Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రాంగద... అబ్బాయి దెయ్యం అంజలిలో.... రివ్యూ రిపోర్ట్

తెలుగులో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలు ప్రేక్షకుడ్ని థ్రిల్‌కు గురిచేయాలి. అది కథనంలో చూపించాలి. కథ బాగుంది. కథనం బాగోలేదంటే అది దర్శకుడి తప్పే. ఈ తరహా చిత్రాలు కొన్ని విజయాలు సాధించగా, మరికొన్ని ఫెయ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (15:59 IST)
చిత్రాంగద నటీనటులు: అంజలి, సాక్షి గులాటి, జయప్రకాష్‌, సప్తగిరి, రక్ష, రాజా రవీంద్ర, సింధుతులాని, జ్యోతి తదితరులు; నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్‌, సంగీతం: సెల్వ గణేష్‌, కత, దర్శకత్వం: అశోక్‌ జి.
 
తెలుగులో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలు ప్రేక్షకుడ్ని థ్రిల్‌కు గురిచేయాలి. అది కథనంలో చూపించాలి. కథ బాగుంది. కథనం బాగోలేదంటే అది దర్శకుడి తప్పే. ఈ తరహా చిత్రాలు కొన్ని విజయాలు సాధించగా, మరికొన్ని ఫెయిలయ్యాయి. ఇలాంటి చిత్రాలు తీయాలంటే సస్పెన్స్‌ పట్టు తెలిసిన దర్శకుడే చేయగలడు. చంద్రముఖి, 'అరుంధతి' చిత్రాలు ప్రేక్షకుడ్ని కట్టిపడేశాయి. ఆ ఫార్మెట్‌లో పలు చిత్రాలు వచ్చినా ఫెయిలయ్యాయి. మరి నానితో 'పిల్ల జమిందార్‌' చిత్రాన్ని తీసి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టిన అశోక్‌.. ఆ తర్వాత సరైన చిత్రాన్ని తీయలేకపోయాడు. ఈసారి ఏకంగా థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు. అదెలా వుందో చూద్దాం.
 
కథ :
చిత్ర (అంజలి)కి తరచూ ఓ కల వస్తుంది. ఓ చెరువులో ఓ అమ్మాయి ఓ వ్యక్తిని కర్రతో కొట్టి చంపేస్తుంది. దూరంగా వద్దని తను కేకలు వేసినా వినదు. చిత్ర కాలేజీలో ప్రొఫెసర్‌. అనాథగా పెరిగి దెయ్యాలపై రీసెర్చ్‌ చేస్తుంది. అయితే ఆమె ప్రవర్తన మగరాయుడిలా ప్రవర్తిస్తుంది. అది దెయ్యం వల్లే వస్తుందని.. హాస్టల్‌లో వున్న ఆమెను బయటకు పంపిచేస్తారు. హాస్టల్‌ అధినేత రాజారవీంద్ర ఈమెను సైక్రియాటిస్ట్‌ జయప్రకాష్‌ వద్దకు తీసుకెళినా సరికాదు. దెయ్యాల్ని వదిలించే స్వామీజీ వచ్చి ఈమెలో మరో ఆత్మ వుందని ట్రీట్‌మెంట్‌కు సూచిస్తాడు. ఇవేవీ నమ్మని సైక్రియాటిస్ట్‌.. చిత్ర ప్రవర్తనతో లెస్‌బియన్‌గా ట్రీట్‌ చేస్తాడు. అనుకోకుండా ఓసారి ఓ ఫొటోను చూసి తనకు వచ్చే కలలోని ప్లేస్‌ ఇదనీ, అది అమెరికాలో వుందని తెలుసుకుని.. అక్కడకి బయలుదేరుతుంది. ఆమెకు తోడుగా తన అసిస్టెంట్‌ను సైక్రియాటిస్ట్‌ పంపిస్తాడు. 
 
తీరా అక్కడకు వెళ్ళి.. ఫలానా చెరువు వద్ద హత్య జరిగిందని దాని గురించి అక్కడి పోలీసుల సహకారం తీసుకునే క్రమంలో పోలీసు అయిన సాక్షిగులాటి పరిచయం కావడం.. ఆమె తన వద్దనే పెట్టుకోవడం జరుగుతుంది. కలలో చూసిన ప్రాంతం కోసం వెతికేక్రమంలో ఓ చోట కారుకు ప్రమాదం జరగడం.. అక్కడే.. తన కలలోని ప్రాంతం కన్పించడం వెంటవెటనే జరిగిపోతాయి. ఇక అక్కడనుంచి తాను చెప్పింది నిజమేనని రూఢీ అవ్వడంతో హత్యకు కారణమైన వారిని శిక్షించడానికి కంకణం కట్టుకుంటుంది. ఆ క్రమంలో ఆమెకు ఓ నిజం తెలుస్తుంది. అదేమిటి? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
ఇందులో అంజలి ఒన్‌మేన్‌ షో. లేడీ ఓరియెంటెడ్‌ పాత్రను అవలీలగా చేసేసింది. కాసేపు అమ్మాయిగా.. కాసేపు అబ్బాయిగా ప్రవర్తించే సన్నివేశాలలో మెప్పించింది. ఇంతకుముందు 'గీతాంజలి'లో దెయ్యంగా నటించినా.. ఇందులో కాస్త భిన్నమైన పాత్ర. సాక్షి గులాటి, రక్ష, జయప్రకాష్‌ ఇతర పాత్రలు ఓకే. సప్తగిరి, మధు కామెడీ చేయాలని చూసినా ఫలితం లేకపోయింది. రొటీన్‌గా స్పీడ్‌ డైలాగ్స్‌తో పంచ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రవివర్మగా అర్జున్‌ బజ్వా బాగానే నటించాడు.
 
టెక్నికల్‌గా:
సాంకేతికంగా పాటలకు పెద్ద ప్రాధాన్యత లేదు. సంగీతపరంగా ఆకట్టుకునే ట్యూన్స్‌ కూడా లేవు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాబట్టి.. సినిమాటోగ్రఫీకి ప్రాధన్యత వుంది. కథ, కథనాన్ని నడిపించిన అశోక్‌ తీరు ఆకట్టుకొనేదిగా లేదు. పంచ్‌లు, ప్రాసలకోసం మాటలు రాసినా.. అవికూడా గుర్తిండేవికాదు.
 
విశ్లేషణ :
జన్మజన్మల బంధం అంటుంటాం. ఆ జన్మల బంధంపైనే కథను దర్శకుడు రాసుకున్నాడు. గత జన్మలో డైమండ్స్‌ వ్యాపారం చేసే పెద్ద వ్యాపారవేత్త కొడుకు రవివర్మ(అర్జున్‌ బజ్వా)కు వీక్‌నెస్‌ అమ్మాయిలు. తన తండ్రి ఊరు నుంచి పనిమనుషులుగా వచ్చిన సింధుతులాని, ఆమె చెల్లెలిపై మోజుపడ్డ రవివర్మ.. తన భార్యగా సింధుని స్వీకరించడానికి ఇష్టపడడు. కొడుకు ప్రవర్తనను మార్చాలని ఆస్తినంతా సింధుకి రాసేస్తే.. తండ్రినే చంపేస్తాడు. ఆ తర్వాత చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన రవివర్మను సింధు.. హత్యచేస్తుంది. ఇది జరిగి 25 ఏళ్ళవుతుంది. తనను చంపిన సింధుపై పగతీర్చేందుకు చిత్రగా మరో జన్మ ఎత్తుతాడు.
 
ఇది వాస్తవానికి విరుద్ధంగా వుంటుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలీదు. లాజిక్‌లు వెతికితే అర్థంకాదు... ఇది చిత్రం ఆరంభంలో దర్శకుడు వేసిన స్లైయిడ్‌. అందుకే కథను లాజిక్కు లేకుండా చూసేయాలని చెప్పాడు కదా.. అంతా చూసినా.. కథలో ఎక్కడా ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్‌ కన్పించవు. గతంలో అబ్బాయి, ఇప్పుడు అమ్మాయిగా పుట్టడం అనేది పురాణాల్లో వున్నది. ఇటువంటి పాయింట్‌తో సినిమాలు రాలేదు. ఇంట్రెస్ట్‌ పాయింట్‌. కానీ దాన్ని అర్థవంతంగా, ఆకట్టుకునేవిధంగా తీయాలంటే ఆ కథలను తీయడంలో పట్టు సంపాదించాలి. చంద్రముఖి.. సినిమా చూశాక.. కథ పెద్దగా అనిపించకపోయినా కథనం ఆకట్టుకుంటుంది. దాన్ని కొనసాగింపుగా వెంకటేష్‌తో 'నాగవల్లి' తీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ చిత్రాంగద కూడా అంతే. సినిమా ఆరంభం నుంచి ఏదేదో చూపించి.. కొత్తదనం కోసం దర్శకుడు ప్రయత్నం చేసినా ఏదీ ఇంట్రెస్ట్‌గా అనిపించదు. కాసేపు అంజలికి అమ్మాయిలంటే ఇష్టం అంటూ.. మరి కాసేపటికి.. మగలక్షణాలున్నాయంటూ పాత్రను పక్కదోవ పట్టించాడు. 
 
పగతో రగిలిపోతున్న చిత్ర.. ఒక్కసారిగా అమెరికా వెళ్ళి.. అక్కడ వుండి హత్యను శోధించాలంటే కథ ప్రకారంగా రాసుకున్నట్లు చకచకా వెళ్ళిపోయాడు కానీ.. ఆర్థికపరమైన వనరులు.. వర్తమానం.. లాజిక్‌లు ఏవీ చూపించకపోవడం ప్రధాన లోపం. ఒన్‌మేన్‌ షోగా ఆమె నటన బాగున్నా.. దాన్ని మరింతగా తీయడంలో దర్శకుడు ఫెయిలయ్యాడనే చెప్పాలి. గీతాంజలి తరహాలో ఆకట్టుకుంటుందేమోనని వచ్చినవారికి నిరాశే మిగులుతుంది. కథనంపై ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుంటేది. ఇది ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పలేం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments