Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన బుట్టబొమ్మ రివ్యూ

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (16:33 IST)
Buttabomma
నటీనటులు: అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్య స్వామి తదితరులు
 
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకులు: గోపీ సుందర్, నిర్మాతలు: నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య, దర్శకుడు : శౌరి చంద్రశేఖర్ టి రమేష్ 
 
సింపుల్‌ సిటీ, పరిమిత నటీనటులు, అందులో కొంచెం సందేశం కలగలిపిన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. గ్రామీణ నేపథ్యంలో మలయాళంలో హిట్‌ అయిన కప్పేలా సినిమాను రీమేక్‌గా బుట్టబొమ్మగా తీశారు. ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథ 
సత్య (అనికా సురేంద్రన్‌) మధ్య తరగతి విలేజ్‌ అమ్మాయి. తండ్రి రైస్‌మిల్లులో పనిచేస్తుంటాడు. వయస్సుకు వచ్చిన కుమార్తెను పలురకాల జాగ్రత్తలతో పెంచుతాడు. రైస్‌మిల్‌ ఓనర్‌ కొడుకు ఆమెను ప్రేమిస్తాడు. అతని తల్లిని బలవంతంగా ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఓ మూడు రోజులు సత్య తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళతారు. ఇదే అదునుగా తను ఫోన్‌లో పరిచయం అయి ప్రేమించిన అబ్బాయి మురళీ (సూర్య వశిష్ట) కోసం తెల్లవారుజామున వైజాగ్‌ వెళుతుంది. అక్కడ రామకృష్ణ (అర్జున్‌ దాస్‌)ను చూసి తనే మురళి అనుకుని అతని వెంట వెళుతుంది. ఆ తర్వాత మురళీ వస్తాడు. సత్య కోసం వెతుకుతాడు. అనంతరం కథ ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఇది గ్రామీణ నేపథ్యంలోని యువతుల మనోభావాలు, వారి ఆలోచనలకు అనుగుణంగా కళ్ళకు కట్టినట్లు చూపించాడు. టీనేజ్‌లో చక్కగా మాట్లాడేవాడుంటేచాలు వారికి అమ్మాయిలు కనెక్ట్‌ అయిపోతారు. ఇందులో సత్య పాత్ర ఆమె స్నేహితురాలి పాత్ర కూడా అదే. ఇందులో మురళీ పాత్రలో ట్విస్ట్‌ వుంది. అది ఆలోజింపేచేసేలా వుంటుంది. ఈ ముగ్గురు తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టైటిల్‌ పాత్రకు అనిక కరెక్ట్‌గా సరిపోయింది.
 
కథనం మాత్రం సాఫీగా జరిగిపోతుంది. ఎక్కడా ఊహించని మలుపులు కనిపించవు. చివరలో చెప్పే ట్విస్ట్‌ అమ్మాయిలు ఆలోజించేలా వుంటుంది. తల్లిదండ్రుల సంరక్షణలోనే అమ్మాయిలు జాగ్రత్తగా వుంటారు. ఆ తర్వాత పెళ్లిచేశాక సరైన వాడు లభిస్తే మంచిదే. లేదంటే నరకమే. అందుకే జీవితంలో ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో ఆలోచించే వయస్సు వారికి వుండదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనే సందేశం ఇందులో డైరెక్ట్‌గా చెప్పాడు. 
 
ఈ సినిమాకు ప్రకృతి అందాలు సినిమాటోగ్రఫీ ఎంత ముఖ్యమో నేపథ్యసంగీతం కూడా సింపుల్‌గా వినసొంపుగా వుంది. గణేష్‌ మాటలు పొందికగా వున్నాయి. డిజెటిల్లు వంటి సినిమాను తీసిన నాగ వంశీ యూత్‌కు ఆలోజింపచేసే సినిమా తీశారు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు రమేష్‌ కొత్తవాడయినా నేటివిటీ మిస్‌ కాకుండా చూసుకున్నాడు. 
 
సత్య పాత గ్రామీణ ప్రాంతాల్లో వుండే మహిళలే కాదు. పట్టణాల్లో వుండే యూత్‌ ఆలోచనలు కూడా ఇలానే వుంటాయని చెప్పాడు. టీనేజ్‌లో వుంటే తొందరపాటు తనంతో చేసే పనులు చివరికి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయనేది ఇందులో ప్రధాన అంశం. ఇటువంటి సినిమాయువత చూడాల్సిన సినిమా.
రేటింగ్: 2.75/5
అన్నీ చూడండి

తాజా వార్తలు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments