Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి: ది కన్‌క్లూజన్‌ రివ్యూ రిపోర్ట్: బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడో అంత ఈజీగా తెలియదు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది కన్‌క్లూజన్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. బాహుబలి ది బిగినింగ్ చివర్లో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే క

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (11:25 IST)
చిత్రం: బాహుబలి: ది కన్‌క్లూజన్‌ 
నటీనటులు: ప్రభాస్‌.. రానా.. అనుష్క.. తమన్నా.. రమ్యకృష్ణ.. సత్యరాజ్‌.. నాజర్‌ తదితరులు 
నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ 
సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌ 
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి 
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌ 
కళ: సాబు సిరిల్‌ 
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
విడుదల తేదీ: 28-04-2017
 
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది కన్‌క్లూజన్‌ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. బాహుబలి ది బిగినింగ్ చివర్లో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. యావత్‌ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అత్యాధునిక సాంకేతికతతో బాహుబలి ది బిగినింగ్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. 
 
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి పార్ట్ 1 భారీ ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా తదుపరి చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’పై అంచనాలను మరింత పెంచేసింది. మరోవైపు ఐదేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం జక్కన్న ‘బాహుబలి’ యజ్ఞంలో పాలుపంచుకున్నారు ప్రభాస్, రాన్ అండ్ టీమ్‌. ఈ ఐదేళ్ల యజ్ఞం ఫలించిందని టాక్ వచ్చింది. బాహుబలి 2 రివ్యూకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. రివ్యూ ఫలితం ఎలా ఉందో తెలుసుకోవాలంటే.. ఇంకా చదవండి మరి...
 
కథలోకి వెళ్తే: అమరేంద్ర బాహుబలి(ప్రభాస్‌)ని రాజమాత శివగామి(రమ్యకృష్ణ) మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలని మాహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తిని అనే విషయాన్ని దాచేసి అమాయకుడిలా నటిస్తాడు. 
 
కుంతల రాజ్యానికి ఆకస్మికంగా వచ్చిపడిన ఓ పెను ప్రమాదం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడతాడు. ఈలోగా దేవసేన చిత్రపటాన్ని చూసిన భళ్లాలదేవుడు(రానా) ఆమెపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అనూహ్య పరిణామాలతో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. 
 
అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పెంచిన చేతులతోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తన తండ్రి మరణానికి కారణమైన భళ్లాలదేవుడిపై మహేంద్ర బాహుబలి(ప్రభాస్‌) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేషణ :
బాహుబలి సిరీస్‌ను విజువల్ వండర్‌గా రాజమౌళి తీర్చిదిద్దాడు. బాహుబలి బిగినింగ్ కంటే.. పదిరెట్లు బాహుబలి 2పై శ్రద్ధపెట్టాడు. ప్రతి ఫ్రేములోనూ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాయాజాలం కనిపిస్తుంది. దీనికి తోడు భావోద్వేగాల పరంగా పాత్రలను అంతేస్థాయిలో తీర్చిదిద్దాడు జక్కన్న. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక పాత్ర బలంగా కనిపిస్తూ ఉంటుంది. తొలి భాగంలో కట్టప్ప చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. 
 
ఈ భాగంలో కట్టప్ప చేత కూడా నవ్వులు పూయించాడు దర్శకుడు. కుంతల రాజ్యంలో జరిగే యుద్ధ ఘట్టం ప్రథమార్ధానికే హైలైట్‌గా నిలుస్తుంది. పాటలు కథలో భాగంగా కలిసి సాగాయి. సుబ్బరాజుతో చేయించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. రెండో అర్థభాగం అద్భుతంగా ఆకట్టుకునేలా కథను తెరకెక్కించాడు. ప్రేక్షకుడిని సీటు నుంచి కదలకుండా చేశాడు. 
 
‘బాహుబలిని కట్టప్పను ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు సమాధానం అంత ఈజీగా లభించదు. పతాక సన్నివేశాల్లో రాజమౌళి తన యుద్ధ నైపుణ్యాన్ని మరోసారి చూపించాడు. బాహుబలిని అద్భుతంగా తెరకెక్కించాడు బాహుబలి. ప్రభాస్, రానా, శివగామి, కట్టప్ప పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎక్కడా విమర్శలకు తావులేకుండా చేశారు. తొలిభాగంలో డీగ్లామర్‌ పాత్రకు పరిమితమైన అనుష్క ఆ లోటును రెండో భాగంలో భర్తీ చేసింది.
 
వీరనారిగా కనిపిస్తూ తన ఎంపిక తప్పుకాదని నిరూపించింది. అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. బిజ్జలదేవగా నాజర్‌ క్రూరత్వాన్ని అద్భుతంగా పలికించారు. కట్టప్ప బాహుబలిని చంపిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకుడు మరిచిపోలేడు. తమన్నా పాత్ర పరిమితంగా ఉంటుంది. మొత్తం చిత్రమంతా కనిపించిన పాత్రల్లో కట్టప్ప పాత్ర ఒకటి. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. ప్రతి ఫ్రేములోనూ సాంకేతిక ఉట్టిపడింది. యుద్ధ ఘట్టాలు అదుర్స్ అనిపించాయి. నేపథ్య సంగీతం అదిరింది.
 
ప్లస్ పాయింట్స్ :
యుద్ధఘట్టాలు 
భావోద్వేగాలు
విజువల్ ఎఫెక్ట్స్
కట్టప్ప నటన 
కీరవాణి సంగీతం, నేపథ్యం,
రెండో అర్థభాగంలో పొలిటికల్ డ్రామా
బాహుబలి 2 మూవీ రేటింగ్ :  4/5
   
విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందించేందుకు 1000 మంది సాంకేతిక నిపుణులు పనిచేశారు. 4కే రెజల్యూషన్‌తో కొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు రుచిచూపించారు. కథ బలం కావడంతో రాజమౌళి స్క్రీన్ ప్లే అదరగొట్టేశాడు. ఐదు సంవత్సరాల పాటు అతిపెద్ద టీమ్‌తో పనిచేయించి.. మంచి అవుట్ పుట్ ఇచ్చేశాడు. తొలి అర్థ భాగం అదిరిపోయింది. రెండో అర్థభాగం కథకు ప్రాణమిస్తూ.. అంతర్గత రాజకీయ నాటకంగా సినిమాను నడిపాడు. మొత్తానికి రాజమౌళి భారతీయ సినీ ఇండస్ట్రీ వైపు ప్రపంచ అభిమానులను తిరిగి చూసేలా చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments