Webdunia - Bharat's app for daily news and videos

Install App

'1' నేనొక్కడినే రివ్యూ: అబద్ధానికి నిజానికి మధ్య మహేష్ మైండ్ గేమ్

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2014 (15:54 IST)
WD
నటీనటులు: మహేష్ బాబు, కృతిసనన్‌, నాజర్‌, కెల్లీడార్జ్‌, పోసాని, ప్రదీప్‌రావత్‌, మాస్టర్‌ గౌతమ్‌ తదితరులు
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట. అనిల్‌ సుంకర,
రచన, దర్శకత్వం: బి. సుకుమార్‌.

తెలుగు సినిమాల ఈ మధ్య రొటీన్‌ కథ, కథనాలు వస్తుంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌ లవ్‌, యాక్షన్‌, కామెడీ అంటూ వాటి చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి చిత్రాలు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఓ హాలీవుడ్‌ లాంటి చిత్రం ఆకట్టుకుంటుంది. అందులో ట్విస్ట్‌లుంటాయి.

ఊహకందని మలుపులు, టేకింగ్‌.. ఉంటాయి. కథ అర్థం కాదు. బాల్యం నుంచి వర్తమానం, మళ్ళీ బాల్య గుర్తులు.. ఇలా స్క్రీన్‌ప్లేతో కొట్టుకుపోతాయి. ఇది చూశాక... టేకింగ్‌ సూపర్బ్‌ అంటారు.

ప్రపంచ మార్కెట్‌లో బాగానే రన్‌ అవుతుంది. ఎందుకంటే.. ఇది ప్రపంచ ప్రేక్షకుల ఆలోచనలకు తగిన సినిమా కనుక.. అలాంటి సినిమాను తెలుగులో తీయాలంటే.. నిర్మాతలకు కాస్త ధైర్యం కావాలి.

ఆ ధైర్యంతో ముందుకు వచ్చిన ముగ్గురు నిర్మాతలు తీసిన చిత్రమే '1' నేనొక్కడినే, 'ఆర్య', జగడం, 100%లవ్‌ చిత్రాలను తీసిన సుకుమార్‌ పెద్ద హీరోతో చేసిన డిఫరెంట్‌ స్టోరీ అని చెప్పాలి. అందులో ఏం చెప్పాడో చూద్దాం..

కథ :
రాక్‌స్టార్‌ గౌతమ్ (మహేష్‌బాబు)కు పేరు ప్రతిష్టలు ఉన్నా తాను ఒంటరిగానే ఉంటాడు. చిన్నతనంలో తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. అంటే ఎవరో ముగ్గురు చంపేస్తారు. ఈ సంఘటనలు నిద్రపోతున్నా అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎవర్ని చూసినా.. ఆ ముగ్గురేనని భ్రమపడుతుంటాడు.

ఆ భ్రమ ఏది నిజమో, ఏది ఊహో అనేది అర్థం కాదు. అందులో భాగంగానే చంపేస్తుంటాడు. ఇదంతా భ్రమేనని జర్నలిస్టు సమీరా (కృతి‌సనన్) నిరూపిస్తుంది. ఎవరెన్ని చెప్పినా తను నమ్మిన నిజంతోనే శత్రువులకోసం వేటకు బయలుదేరతాడు. ఆ క్రమంలో కృతికూడా సాయం చేస్తుంది. ఆ దశలో ఆమెకు కొన్ని నిజాలు తెలుస్తాయి. ఇదంతా గౌతమ్‌ జీవితంలో జరిగినవేని గ్రహిస్తుంది? చివరికి తన తల్లిదండ్రుల్ని, వారిని చంపినవారిని గుర్తించి పగతీర్చుకుంటాడు.

పెర్‌ఫార్మెన్స్‌
నటీనటులపరంగా మహేష్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌ ఓన్లీ ఒన్‌మేన్‌ షోనే. ఆయన మాడ్యులేషన్‌, లుక్‌ అంతా గత చిత్రాల్లో మాదిరిగా ఉన్నా హాలీవుడ్‌ చిత్రం స్క్రీన్‌ప్లేతో కొత్తగా కన్పిస్తుంది. భావోద్వేగాలు పలికించాడు. యాక్షన్‌ ఎపిసోడ్‌ బాగున్నాయి. ఇక కృతిసనన్ లుక్‌ బాగుంది. ఆమె కేవలం గ్లామర్‌ కోసమే ఉపయోగించారు. విలన్లు మామూలే. లండన్‌ వెళ్లిన కారుడ్రైవర్‌ పోసాని పర్వాలేదు. ఇక మిగిలిన పాత్రలు మామూలే.

టెక్నికల్‌గా...
ముఖ్యంగా చెప్పాల్సింది దేవీశ్రీప్రసాద్‌ సంగీతం.' హు ఆర్‌ యు' 'నెంబర్‌1' అనే గోవా సాంగ్‌ పర్వాలేదు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. రత్నవేలు కెమెరా హైలైట్‌గా నిలుస్తుంది. ప్రధానంగా చెప్పాల్సింది. పీటర్‌ హేన్స్‌ యాక్షన్‌ ఓన్లీ ఒన్‌మేన్‌గా అన్నీ తానే అయి చేశాడు. తన టీమ్‌తో చేసిన మిడ్‌సీ యాక్షన్‌, రోడ్‌ బైక్‌, కారు ఛేజింగ్‌లు తెలుగు సినిమాలో హాలీవుడ్‌ చొప్పిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది.

చివరగా...
అయితే ఇటువంటి కథకు పేరుపొందిన హీరోతో చేయడం కరెక్టే. ఎందుకంటే. ఇలాంటి కాన్సెప్ట్‌ కొత్తవారితో చేస్తే పెద్దగా ఆడదు. చంద్రముఖి కథకు కొత్తవారు చేస్తే పెద్దగా రక్తికట్టదు. అందుకే మహేష్‌ను దర్శకుడు ఎన్నుకున్నాడని చెప్పవచ్చు. దర్శకుడిగా సుకుమార్‌ లవ్‌ చిత్రాలు తీసినా ఇటువంటి కథను టేకప్‌ చేయడం సాహసమే.

కేవలం అమ్మానాన్నలను గుర్తించలేని స్థితిలో వారెలా ఉంటారో వారిని చంపినవారిని తను ఎలా చంపాలో అని ఊహించుకుని వాస్తవానికి, అవాస్తవానికి మధ్య నలిగిపోయే పాత్ర మహేష్‌ది. దాన్ని ఆయన బాగా డీల్‌ చేశాడు. దీన్ని చేయించింది దర్శకుడు. కాబట్టి క్రెడిట్‌ ఆయనకు దక్కుతుంది.

గతంలో ఆర్య, ఆర్య-2 చిత్రాలు చూస్తేనే దర్శకుడిని ఆలోచనవిధానం కొత్తగా ఉంటుందని అర్థమవుతుంది. ఇప్పుడు అంతే కొత్తగా సినిమా తీశాడు. అయితే ఊహకందని ట్విస్ట్‌లు, మళ్ళీ బ్యాక్‌కు వెళ్ళేకథనం.. తెలుగువారికి కొత్తగా అన్పిస్తూనే కొన్ని సీన్స్‌ అర్థంచేసుకోవడడానికి టైమ్‌ పడుతుంది. బి,సి. సెంటర్లలో ఇది పెద్దగా ఆకట్టుకోదు. క్లాస్‌ ప్రేక్షకులకు ఇదొక పజిల్‌ లాంటిది. అంటే.. మైండ్‌ గేమ్‌లాంటిది.

ఇటువంటి కథలను టేకప్‌ చేయడం తెలుగువారికి నచ్చేలా తీయడం సాహసమే. కానీ మొత్తానికి దర్శక నిర్మాతలు ఆ ప్రయత్నం చేశారు. ఏదో రొటీన్‌ సినిమాలా కాకుండా కొత్తదనంతో చూసే ప్రేక్షకులకు ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments