Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీతో ఆకట్టుకునే "చింతకాయల రవి"

Webdunia
WD
సినిమా... చింతకాయల రవి,
నటీనటులు... వెంకటేష్, మమతా మోహన్ దాస్, అనుష్క, సునీల్, అలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మి, చంద్రమోహన్, వేణు, ఎన్టీఆర్ (గెస్ట్), ఆర్తీ చాబ్రియా, సుమన్ శెట్టి, ప్రదీప్ శక్తి, రవికుమార్ తదితరులు.
నిర్మాత... నల్లమలుపు బుజ్జి,
ఎడిటర్... శ్రీకర్ ప్రసాద్,
కథ, మాటలు... కోన వెంకట్,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... యోగేష్.
విడుదల... 2-10-08.

పాయింట్... తల్లిమనస్సును బాధపెట్టకుండా చింతకాయల రవి చేసిన విన్యాసాలే ఈ సినిమా.

తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో పలు చిత్రాలు వచ్చాయి. "చింతకాయల రవి" సినిమా అదే కోవలోనిదే అయినప్పటికీ అమెరికా నేపథ్యంలో కాస్త వెరైటీగా ఉంటుంది. విక్టరీ వెంకటేష్ తన వయస్సుకు తగ్గ పాత్రను పోషించారు.

ఇక కథలోకి వెళితే... సంపాదనకోసం అమెరికా వెళ్ళిన చింతకాయల రవి (వెంకటేష్) ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. కానీ ఇండియాలోని తన గ్రామంలో ఉండే అమ్మానాన్నలైన లక్ష్మీ, చంద్రమోహన్‌ల దృష్టిలో చింతకాయల రవి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇంకేం మంచి ఉద్యోగం ఉన్న తన కుమారుడికి మంచి సంబంధం చూసి పెండ్లి చేసేద్దామని తీర్మానించుకుంటారు రవి తల్లిదండ్రులు.
అనుకున్నట్లే లక్ష్మి పెద్దింటి సంబంధం చూస్తుంది.

అమ్మాయి పేరు లావణ్య (మమతా మోహన్ దాస్). ఆమె తండ్రి షాయాజీ షిండేకు అబద్ధం చెబితే సహించని మనసత్త్వం. అలాంటిది నిశ్చితార్థం టైమ్‌లో లావణ్య స్నేహితురాలు సునీత (అనుష్క) ద్వారా రవి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదని తేలడంతో సంబంధం చెడిపోతుంది.

ఆ కోపంతో సునీతపై ప్రతీకారం తీర్చుకోవాలని వెళ్ళిన చింతకాయల రవి చివరికి ఆమె తండ్రి ప్రాణాల్ని కాపాడాల్సి వస్తుంది. అప్పటికే రవి స్నేహితుడు హీరో వేణు ద్వారా సునీత అతని మంచితనాన్ని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి సునీత అతనికి మరింత దగ్గరవ్వాలనుకుంటుంది.

కానీ రవి తనను అవమానించిన లావణ్యనే పెండ్లిచేసుకుంటానని, దానికి సునీతను సాయపడమంటాడు. సునీత సాయపడుతున్నట్లే చేస్తూ రవికి మరింత దగ్గరవుతుంది. ఇక రవికి, లావణ్యకు పెండ్లి నిశ్చయమవుతుంది. ఆ సమయంలో ఓ సంఘటన జరుగుతుంది. అది ఏమిటి? రవి స్నేహితుడు వేణు పాత్ర ఏమిటి? జూనియర్ ఎన్టీఆర్... ఏ పాత్రలో నటించారు? అన్నది మిగిలిన సినిమా.

కథాపరంగా చూస్తే... చాలా సినిమాల్లో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. అమెరికా నేపథ్యంలో కథను చక్కగా నడపడంతో దర్శకుడు యోగేష్, కోన వెంకట్ ఆకట్టుకున్నారు. వెంకటేష్ తన పాత్రలో జీవించారు. కాస్త బాడీ పెంచినప్పటికీ బాగానే ఉన్నారు. కొన్ని సన్నివేశాల్లో "మిస్టర్ బీన్"ను తలపిస్తాడు. మరికొన్ని సన్నివేశాలు హిందీ చిత్రాల్ని పోలి ఉంటాయి.

సునీత పాత్రలో అనుష్క ఆకర్షణీయంగా ఉంది. లావణ్యగా మమతామోహన్‌దాస్ పాత్ర పర్వాలేదు. వేణు, నిఖిత అతిథి పాత్రలో కన్పిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఓ పాటలో కాసేపు కన్పించి ఆనందపరుస్తారు. ముంబై నటి ఆర్తీ ఛాబ్రియా ఓ పాటలో కనబడుతుంది. మసాజ్ స్పెషలిస్టుగా అలీ, లక్ష్మీ వినోదాన్ని పంచుతారు. కాకపోతే "చిరుత" తరహాలో ఉంటుంది.

" సైబర్ వేవ్" బార్ ఓనర్‌గా పింకీ పాత్రలో బ్రహ్మానందం నవ్విస్తాడు. మాస్టర్ భరత్ పాత్ర నిడివి తక్కువగా సునీల్ కాంబినేషన్‌లో బాగానే చేశారు. ముంబైకు చెందిన విశాల్, శేఖర్‌ల ద్వయం సంగీతం వినసొంపుగానే ఉంది. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. పాయింట్ చిన్నదే అయినా స్క్రీన్‌ప్లేను యోగేష్ బాగానే చూపించాడు. ప్రొడక్షన్స్ వాల్యూస్ సూపర్.

మొదటి భాగంకన్నా సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా ఉన్నా... ఓవరాల్‌గా సినిమా పర్వాలేదు. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" అంత రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోయినా "చింతకాయల రవి" కుటుంబమంతా కలిసి చూసి ఆనందించతగ్గవాడే... ఇంకా చెప్పాలంటే... మాస్, క్లాస్ ప్రేక్షకులకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆకట్టుకుంటాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments