Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినోదాత్మకంగా సాగే రవితేజ "కిక్"

Webdunia
నటీనటులు.. రవితేజ, ఇలియానా, శ్యామ్, కోటశ్రీనివాసరావు, అషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్, షిండే, అలీ తదితరులు.
నిర్మాత.. వెంకట్,
దర్శకత్వం.. సురేందర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ.. రసూల్ ఎల్లోర్,
పాటలు.. రామజోగయ్య శాస్త్రి,
సంగీతం.. ఎస్.ఎస్. థామసత్.

రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా పిల్లలకు కూడా ఎంటర్‌టైన్ ఇప్పించేలా ఉంటాయి. తాజాగా విడుదలైన కిక్ సినిమా కూడా అలాంటిదే. ఇది దొంగా పోలీస్ కథ. శ్రీనువైట్ల చిత్రాల తరహాలో ఢీ, రెడీ సినిమా ఫార్మెట్‌లో కామెడీని చొప్పించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.. కిక్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.

ఇక కథలోకి వెళితే.. ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌పై రూపొందిన కిక్ కథ మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. రొటీన్‌గా కాకుండా ఏ పనిచేసినా అందులో "కిక్" ఉండాలనుకునే కళ్యాణ్ (రవితేజ).. తన విలక్షణమైన గుణంతో నైనాను (ఇలియానా) ఆకర్షిస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. చివరికి కళ్యాణ్ ధోరణి నచ్చక నైనా అతనిని వదిలించుకుంటుంది.

మరోవైపు సిన్సియర్ పోలీసు అధికారి కళ్యాణ్ కృష్ణ (శ్యామ్) పెళ్లిచూపుల కోసం మలేషియా వస్తాడు. అతని పేరులోనూ కళ్యాణ్ ఉండగానే, తనకు పరిచయమైన కళ్యాణ్ (రవితేజ) గురించి నైనా అతడితో చెబుతుంది. అదే సందర్భంలో తనను ముప్పుతిప్పలు పెట్టిన ఓ దొంగ గురించి కృష్ణ ఆమెకు చెబుతాడు.

నిజానికి అతను వెతుకుతున్న దొంగ కళ్యాణే (రవితేజ). అతడి కోసమే కృష్ణ మలేషియా వస్తాడు. మరి వచ్చాక కృష్ణ, కళ్యాణ్ (రవితేజ)ను అరెస్ట్ చేశాడా? నైనా పోలీస్ ఆఫీసర్‌ను పెళ్లిచేసుకుందా? హీరో రవితేజ పరిస్థితి ఏమిటి? అసలు దొంగగా కళ్యాణ్ (రవితేజ) ఎందుకు ముద్ర వేసుకున్నాడు? అన్నది తెరపై చూడాల్సిందే.!

విశ్లేష ణ
సినిమా మొత్తం రవితేజపై ఆధారపడి ఉంటుంది. చాలా ఎనర్జీగా కన్పిస్తాడు. ఇలియానా బాగానే నటించింది. తమిళనటుడు శ్యామ్ పోలీసు పాత్రకు సరితూగాడు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి యాక్షన్ చిత్రాలైన "అతనొక్కడే" ఇమేజ్ నుంచి కాస్త వినోదాన్ని పంచే ప్రయత్నంలో ఈ సినిమా చేశాడు.

భారీ నిర్మాణ వ్యయానికి సాంకేతిక సిబ్బంది తోడయ్యారు. కథ అబ్బూరి రవి, మాటలు వక్కంతం వంశీ ఇద్దరు సంభాషణల్లో తమ చాతుర్యాన్ని నిరూపించుకున్నారు. బ్రహ్మానందంపై కామెడీ హైలైట్‌గా ఉంటుంది.

పోలీస్ స్టేషన్లో రవితేజ, షిండే, బ్రహ్మానందంల మధ్య జరిగిన ఆత్మహత్య సన్నివేశం, షాపింగ్ కాంప్లెక్స్‌లో రవితేజ, బ్రహ్మానందంల కామెడీ సన్నివేశానికి నవ్వని ప్రేక్షకుడంటూ ఉండడు. ఓ సన్నివేశంలో రవితేజ వ్యక్తిత్వాన్ని గ్రాఫిక్స్‌లో చూపించడం ఆకట్టుకుంటుంది.

ఇక రసూల్ ఫోటోగ్రఫీ కథకు సరిపోయింది. "గోగో.. గోగోరే.." పాట మాస్‌ను ఆకట్టుకుంటుంది. తెలుగు పాటలో హిందీ పదాలు చొప్పించిన "దిల్ కలాసే...", "ఐడెంట్ వాంట్ లవ్.." పాటలు బాగానే ఉన్నా సంగీతం పదాలను మింగేసింది. మిక్సింగ్ విషయంలో కాస్త జాగ్రత్తపడి ఉంటే సరిపోయేది.

తొలి భాగం వినోదాత్మకంగా మలిభాగం యాక్షన్ ప్రదానంగా సాగుతాయి. కిక్ పేరు చిత్రానికి సరిపోయింది. మొత్తానికి అర్జున్ నటించిన జెంటిల్‌మెన్ లైన్‌లో సాగుతూ రెడీ తరహాలో వినోదాన్ని కలబోశారు. మరో నెలవరకు పెద్ద చిత్రాలేవీ విడుదల కాకపోవడంతో, పోటీ చిత్రాలు లేకుండా "కిక్" ప్రేక్షకులను ఆకట్టుకుంటుదనే చెప్పాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments