Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతంటే ఇలా ఉండాలంటోన్న "జోష్"

Webdunia
WD
సినిమా: జోష్,
నటీనటులు: నాగచైతన్య, కార్తీక, ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, బ్రహ్మానందం, సునీల్, మౌనిక, సితార, ఆనంద్ తదితరులు.
నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్,
నిర్మాత: దిల్‌రాజు,
దర్శకత్వం: వాసు వర్మ.

పాయింట్: దేశ భవిష్యత్ కోసం తయారుచేసే కార్ఖానాలైన కాలేజీలు ఎలా ఉండాలి? విద్యార్థులు ఎలా ప్రవర్తించాలి? అనేది పాయింట్.

యువసామ్రాట్ నాగార్జున వారసుడు సినిమా అనగానే ఎలా ఉంటుంది? ఎలా తీర్చిదిద్దుతారు? అనే ఆసక్తి అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండటం సహజమే. ఎటువంటి కథను తీసుకున్నా తొలుత మాస్ చిత్రాన్ని తీసి జనాలపై రుద్దడం భావ్యం కాదు గనుక సాఫ్ట్ లవ్‌స్టోరీతో జోష్‌ను తెరకెక్కించారు. అందులోను దిల్‌రాజు (వెంకటేశ్వర రెడ్డి) లాంటి నిర్మాత చిత్రమంటే కాస్తో, కూస్తో సందేశముంటుంది. ఆ రూటులో సాగిన కథాకమామిషే "జోష్" సినిమా.

ఇక కథలోకి వెళితే.. వైజాగ్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదివే విద్యార్థి సత్య (నాగచైతన్య). తాను వైజాగ్ కాలేజీలో చదవనని తల్లిదండ్రులకు చెప్పి మేనమామ సునీల్ ఉండే హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఉద్యోగప్రయత్నాలు చేస్తూ గార్డెన్‌లో పనికి కుదురుతాడు. అదే ఊరిలో ఎం.బి.ఎం కాలేజీలో సునీల్ ఇంటి ఓనర్ కొడుకు చదువుతుంటాడు. ఆ కాలేజీ మాదకద్రవ్యాలకు పెట్టింది పేరు. అదే కాలేజీలోనే సీనియర్ విద్యార్థి బాస్కెట్‌బాల్‌లో గోల్డ్ మెడల్ సంపాదించి మాదకద్రవ్యాలకు బానిసవుతూ అక్కడే ఉంటాడు.

ఇంకా చెప్పాలంటే.. ఆ కాలేజీలో రెండు గ్రూపులుంటాయి. వారిని తన రాజకీయ ప్రయోజనాలకోసం జె.డి. చక్రవర్తి ఉపయోగించుకుంటాడు. ఓ సందర్భంలో జెడీని సత్య ఎదిరిస్తాడు. ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయి అక్కడి పరిస్థితిని ఎలా చక్కదిద్దాడు అన్నదే సినిమా.

ఇందులో దివ్య (కార్తీక) పాత్ర ఏమిటి? అసలు వైజాగ్ కాలేజీలో ఎందుకు చదవననని సత్య భావించాడు? మళ్లీ హైదరాబాద్ కాలేజీలో ఎందుకు చేరాడు? అన్నవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే.. గతంలో నాగార్జున "శివ" చిత్రం ఛాయలు జోష్‌లో కన్పిస్తాయి. కానీ అప్పటి కాలేజీ వాతావరణానికి "శివ" సినిమా ఎలా తీశారో? ఈనాటి కాలేజీ యువత, వారిని రాజకీయనాయకులు ఎలా ఉపయోగించుకుంటున్నారన్నదే "జోష్" సినిమా కథాంశం.

కాలేజీ స్టూడెంట్ అంటే జోష్‌గా ఉండాలి. అలా అని ఆ వయస్సులో ఏం చేయాలో? యువత మరిచిపోకూడనే సందేశాన్ని దర్శకనిర్మాతలు చెప్పించారు. తొలిసారిగా నాగచైతన్య నటించాడు కాబట్టి.. కాస్త ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడూ సీరియస్‌గా ఏదో పోగొట్టుకున్నవాడిలా నాగచైతన్య ముఖకవళికలుంటాయి.

ఇది కథకు సరిపోయినట్లుగా దర్శకుడు తీర్చిదిద్దాడు. తక్కువ మాట్లాడటం పాత్ర స్వభావం. ముందే ఏం జరుగుతుందో? అనేది కాలేజీ అనుభవం రీత్యా చెప్పేస్తుంటాడు. డైలాగ్ డెలివరీ క్యారెక్టర్ రీత్యా బాగానే కుదిరింది.

విద్యార్థి ఎలా ఉండాలనేదానికోసం వైజాగ్‌లోని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకాష్‌రాజ్ చెప్పినప్పుడు.. సత్య కలుగజేసుకుని చెప్పిన విధానం బాగుంది. ఇక్కడ దర్శకుడిలోని రచయిత బయటకు వచ్చాడు. కథంతా అందులోనే ఉంటుంది. "ర్యాంకులకోసం చదువుకాదు. ర్యాంకులు రాకపోతే తల్లిదండ్రుల కోరిక తీర్చకపోయినందుకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి. మీ ఆలోచనలను పిల్లలపై ఎందుకు రుద్దుతారు. యువతను యువతలానే ఉండనివ్వండి.. వారిని జాగృతం చేయడానికి తోడ్పడండని" సత్య ఇచ్చిన లెక్చరర్ ఆకట్టుకుంటుంది.

హీరోయిన్ కార్తీక హీరో సత్యకంటే జోష్‌గా చేసింది. కాలేజీ చదివే వయస్సులోనే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌గా చేసే ప్రక్రియ కొత్తదిగా ఉంది. కాలేజీ అంటే అమ్మాయిలు చెడిపోయే కార్ఖానాలుగా ఆమె అన్నయ్య విష్ణువర్ధన్ పాత్ర ఇప్పటికాలంలో చాలామంది ప్రభావముంటుంది. అటువంటి ఆలోచన మంచిదికాదని సత్య చూపించిన తీరు బాగుంది.

మేనమామగా సునీల్ హాస్యం ఆకట్టుకుంటుంది. యూత్ లీడర్‌గా జె.డి. చక్రవర్తి నటన ఆయనకు కొట్టిన పిండి. జేడీ అసిస్టెంట్‌గా బ్రహ్మానందం కామెడీ పర్వాలేదు. కామెడీకి సెపరేట్ ట్రాక్ కాకుండా కథాగమనంలో చూపిన జాగ్రత్త మెచ్చుకోదగింది.

ఇకపోతే.. సందీప్‌చౌతా సంగీతంలో రెండుపాటలు క్యాచీగా ఉన్నాయి. "ఐయామ్ బ్యాడ్‌బాయ్..", "జోష్..." టైటిల్ సాంగ్స్‌లో పాశ్చాత్యహీరో మోతాదు ఎక్కువైంది. సాహిత్యపరంగా సీతారామశాస్త్రి పాటలు బాగానే రాశారు. కానీ ఏవీ గుర్తుండే పాటల్లాలేవు. మొత్తానికి ఈనాటి కాలేజీలు ఎలా ఉన్నాయనే అంశంపై శ్రద్ధపెట్టి "శివ-2"గా తీర్చిదిద్దినట్లుంది.

సత్య తను వైజాగ్ కాలేజీలో ఎందుకు చదవలేకపోయాననే విషయాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లో చెబుతాడు. ఆ సన్నివేశం అంత ఎఫెక్ట్‌లేకపోయినా ప్రకాష్ రాజ్, సత్య కాంబినేషన్‌లో సాగే సంభాషణలు హృదయాన్ని టచ్‌చేస్తాయి.

కాలేజీ చదివే యువత వయస్సు తప్పా? వారిని సరిదిద్దని వ్యవస్థతప్పా? తల్లిదండ్రుల తప్పా? అనే దానికి సమాధానమే జోష్ సినిమా. చివరకు యువజన నాయకుడికి బుద్ధిచెప్పి యువతను మంచిమార్గంవైపు నడిపించాలని సత్య చేసిన ప్రయత్నం బాగున్నా.. కథలో పట్టు తగ్గింది. చాలా సన్నివేశాలు బలహీనంగా కన్పిస్తాయి. యువతను టార్గెట్ చేసుకుని తీసిన సినిమా ఎంతమేరకు నిలబడుతుందో వేచి చూడాల్సిందే..!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments