Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో "ఏ మాయ చేసావె" అంటోన్న ప్రియుడు

Webdunia
WD
నటీనటులు: నాగచైతన్య, సమంత, కృష్ణుడు, దేవన్‌, సంజయస్వరూప్‌, సురేఖావాణి, లక్ష్మీ రామకృష్ణన్‌, సుధీర్‌, ప్రత్యక పాత్రల్లో గౌతమ్‌ మీనన్‌, దర్శకుడు: పూరీ జగన్నాథ్‌

నిర్మాత: సంజయ స్వరూప్‌, సమర్పణ: కృష్ణ, సంగీతం: రెహమాన్‌, కెమెరా: పరమహంస, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.

ప్రేమ అనే దానికి అర్థం చెప్పాలంటే.. కవులు, రచయితలు, ప్రేమను రుచి చూసిన అనుభవజ్ఞులు రకరకాలుగా విశ్లేషిస్తుంటారు. ఎవరు ఏమీ చెప్పినా ప్రేమ అనేది ఫీల్‌. దాన్ని ఇలా ఉంటుందని వర్ణించలేం. ప్రపంచం మనుగడకు కారణం ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమను దేవుడి ప్రేమతో పోలుస్తారు. అటువంటి స్వచ్ఛమైన ప్రేమ ప్రేమికుల్లో ఉంటే ఎప్పటికీ విడిపోరు.

ప్రేమంటే విడదీయలేనిది. తొలిచూపులోనే ప్రేమించేయడం, ఆ తర్వాత ఆమె ప్రేమకోసం ప్రేమికుడు తపించిపోవడం, ఒక్కక్షణం కన్పించకపోతే తెలియని బాధతో హృదయం వెలితిగా ఉండడం.. ఇవన్నీ అనుభవిస్తేగానీ తెలీదు. ఇలా ప్రేమ గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రేమంటే ఎవర్‌గ్రీన్‌. ప్రేమించడం కాదు ప్రేమించబడడం గొప్ప. దీనికోసం చాలా మంది పరితపిస్తుంటారు.

యుక్తవయస్సులో ఒకరిపై ఒకరు ఆకర్షితులవడం. ఆ తర్వాత స్నేహితులుగా మారడం, ఆ తర్వాత ప్రేమికులుగా మారడం. పెద్దలను నొప్పించక తామునొప్పక దక్కించుకున్నవాడే ధన్యుడు సుమతీ అన్నట్లుగా.. ఏ మాయ చేసావె చిత్రం ఉంది. టైటిల్‌కు తగినట్లే.. ప్రేమలో ఏదో మాయ ఉంది. అసలు ప్రేమ ఎలా ఉండాలంటే.. ఏదో మాయచేసి ఆకర్షించుకొనేదిగా ఉండాలి. అప్పడే తన ప్రేయసి కోసం దేశాలు దాటుకుంటూ ప్రియుడు వెళతాడు.

చరిత్రను తిరగేస్తే ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేయసికోసం వర్షాలు, తుఫాన్లు సైతం లెక్కచేయకుండా తను ప్రేమించిన వ్యక్తికోసం నదులు, సముద్రాలు దాటిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అప్పుడే ప్రేమలో కిక్‌ ఏమిటో తెలుస్తుంది. హృదయాన్ని టచ్‌చేసేది అసలైన ప్రేమ. ఆ కాస్పెస్ట్‌తో ఏ మాయ చేశావే రూపొందింది.

కథగా చెప్పాలంటే....
కార్తీక్‌ (నాగచైతన్య) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసి తన చిరకాల కోరిక సినిమా దర్శకుడవ్వాలనుకుంటాడు. జెస్సీ (సమంత) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆమె ఉంటున్న ఇంట్లోనే కార్తీక్‌ ఫ్యామిలీ ఉంటుంది. తండ్రి సంజయస్వరూప్‌, తల్లి సురేఖావాణి. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌లా మొదటి చూపులోనే కార్తీక్‌ జెస్సీని ప్రేమించేస్తాడు. రోజు కలుసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం మామూలే. ఒకరోజు ఐ లవ్‌ యు చెప్పేస్తాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆమె కన్పించదు.

జెస్సీ కేరళ వెళ్లిందని తెలిసి కార్తీక్‌ అక్కడికి వెళ్తాడు. క్రమంగా వారి మధ్య దూరం పెరుగుతుంది. తన ప్రేమ విషయాన్ని క్లోజ్‌ఫ్రెండ్‌ కృష్ణుడుతో పంచుకుంటాడు. కృష్ణుడు సినిమా హీరో. అతని ద్వారా నాగచైతన్య అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ట్రైల్‌ వేస్తుంటాడు. జెస్సీకి సినిమాలంటే పడదు. వాళ్ళ నాన్నకూ డిటో. సినిమావాళ్ళంటే అసహ్యించుకుంటాడు. ఇదిలా ఉండగా.. ఆ తర్వాత పూరీజగన్నాథ్‌ దగ్గర అసిస్టెంట్‌గా కార్తీక్‌ చేరతాడు. షూటింగ్‌లో ఉండగా జెస్సీకి పెళ్లి సంబంధం కుదిరిందని తెలుస్తుంది. ఆ తర్వాత కార్తీక్‌ ఆమె ఇంటికి వెళ్లినా ఆమె యు.ఎస్‌. వెళ్ళిందని తెలుస్తుంది. కానీ జెస్సీని మర్చిపోలేడు.

కొన్నాళ్ళకు కార్తీక్‌ అనుకున్నట్లుగా దర్శకుడవుతాడు. షూటింగ్‌కోసం అమెరికా వెళతాడు. తన ప్రేమకథనే తెరకెక్కించే అవకాశం వస్తుంది. శింబు, త్రిష హీరోహీరోయిన్లు. ఆ సన్నివేశాలను షూట్‌ చేస్తుండగా అనుకోకుండా యు.ఎస్‌.లో జెస్సీ కన్పిస్తుంది. అప్పటికే కార్తీక్‌ సినిమా కూడా పూర్తవుతుంది. తను తీసిన సినిమాకు మంచి టాక్‌ వస్తుంది. ఇదంతా జెస్సీకి.. థియేటర్‌లో కూర్చుని సినిమా చూస్తూ కార్తీక్‌ చెబుతాడు. ఇటువంటి మంచి సినిమా తీసినందుకు తన నాన్న నిన్ను మెచ్చుకుంటాడడని జెస్సీ ముగింపిస్తుంది.

కథ ప్రకారం సమంత, నాగచైతన్య అమరారు. కొత్త లుక్‌తో కన్పించారు. ప్రేక్షకుడి ఆ కథలో ఇన్‌వాల్వ్‌ అవడానికి 15 నిముషాలు పడుతుంది. మొదటి 15 నిముషాలు బోర్‌గా అనిపిస్తుంది. క్రమేణా గౌతమ్‌ మీనన్‌ తన చాకచక్యంతో కేవలం ఇద్దరు ప్రేమికుల ఫీలింగ్స్‌తో మమేకం చేశాడు. కేరళ అమ్మాయిగా సమంత చక్కగా సరిపోయింది. తండ్రి దేవన్‌ తాను క్రిస్టియన్‌కే ఇచ్చి పెళ్లిచేస్తాననడం, హిందూవులంటే గిట్టకపోవడం వంటి సన్నివేశాల అల్లికతో కథాగమనం సాగుతుంది.

ఆల్‌రెడీ జెస్సీ అక్క ఇదే ప్రాబ్లమ్‌తో ఉంటే.. ప్రేమించిన వ్యక్తిని కాదని తండ్రి చూపిన సంబంధాన్ని చేసుకుంటుంది. తాను అలాగే ఉంటానని జెస్సీ చెప్పడం... నిజమైన ప్రేమంటే.. మీ అక్క అలా చేయదు. తనకు నచ్చినట్లు బతక్కపోతే జీవితానికి అర్థం లేదని.. పాలసీతో ఉన్న నాగచైనత్య ఫిలాసఫీ నేటి యూత్‌ను టార్గెట్‌ చేస్తుంది. యువతకు ఈ చిత్రం మంచి ఫీల్‌గుడ్‌ ఫిలిమ్. ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్న సమాజంలో అసలు ప్రేమంటే ఎలా ఉంటుంది. దాన్ని ఎలా ఆస్వాదించాలి. ఒక్కటి కావడానికి ఎటువంటి ముందడుగు వేయాలి... అన్నవి ఈ చిత్రంలో ప్రధానాంశాలు. ఎటువంటి జుగుప్స, కత్తిఫైట్లు, హింసఅనే వాటికి అడ్రస్‌ లేకుండా.. పాజిటివ్‌ థింకింక్‌తో సాగే చక్కటి ప్రేమకావ్యం.

కేరళ అందాల్ని, హీరోహీరోయిన్ల ఫీలింగ్స్‌ను పరమహంస తన సినిమాటోగ్రఫీతో బంధించి వేశాడు. గౌతమ్‌మీనన్‌ తమిళంలో రాసుకున్న సంభాషణలు యదాతథంగా ఉమర్జీ అనురాధ ఏమాత్రం తేడా లేకుండా అనువదించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం చెప్పక్కర్లలేదు. మెలోడీ రుచిని ఒక్కసారి రుచిచూపాడు. రోజాలో మెలోడీ కొన్ని చోట్ల గుర్తుకు వస్తుంది. మరోవైపు గీతాంజలి గుర్తు రాకమానదు. కేరళ అమ్మాయి, హైదరాబాద్‌ అబ్బాయిని ప్రేమించడం తర్వాత పెళ్లికి జరిగే అడ్డంకులు అధిగమనించడం చాలా చిత్రాలు వచ్చాయి. మరోచరిత్ర దాదాపు అటువంటిదే.

ఇక్కడ చేసిందల్లా నాగచైతన్య వయస్సు 22 అయితే సమంత వయస్సు 24. అంటే రెండేళ్ళ పెద్దదయినా ప్రేమకు ఆ హద్దులు లేవని తెలియజేస్తుంది. కొద్దిరోజుల ఎడబాటు ప్రేమికుల్లో ఎలాంటి మానసిక స్థితి ఉంటుందో ప్రతి సన్నివేశంలో చూపారు. పెళ్లి కూతురుగా ముస్తాబయి చర్చిలో పెండ్లి జరిగే సమయంలో తనకిప్పుడు పెండ్లిచేసుకోవాలనే ఆలోచన లేదని సున్నితంగా తిరస్కరించే సన్నివేశం బాగుంది. ఒకరినొకరు కబుర్లు చెప్పుకోకపోతే హృదయంలో జరిగే స్పందన ఏమిటనేది పాటల నేపథ్యంలో చక్కగా చూపాడు.

' ఆకాశమంత.. పాట బాగుంది. అనంత్‌శ్రీరామ్‌ మరోసాని తన ప్రేమ కలానికి పదును పెట్టాడు. తమిళంలో శింబు, త్రిష నటించిన 'విన్నతాండి వరువ్యాయ' చిత్రం తెలుగులో 'ఏ మాయ చేసావె'. తమిళ నేటివిటీ సరిపడా ముగింపు అక్కడ ఉంది. తెలుగు నేటివిటికీ తగిన ముగింపు ఇక్కడా వుంది. తన కథను కార్తీక్‌ సినిమా తీసి ఎలా తీశానో చెబుతుండగా సినిమా ప్రారంభమవుతుంది. మల్టీప్టెక్స్ సినిమా ఇది. యూత్‌కు బాగా నచ్చుతుంది. కుటుంబ సమేతంగా చూసే కథే అయినా.. పెద్దలకు పాత జ్ఞాపకాలు మెదులుతాయి. ఇవేవీ పట్టని వారికి మాత్రం ఇది ఒక మామూలు సినిమా మాత్రమే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments