Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి యువత ఆలోచనలకు అద్దం "నువ్విలా.."

Webdunia
గురువారం, 3 నవంబరు 2011 (17:02 IST)
WD
నటీనటులు: అజయ్‌ మంతెన, హనీష్‌, ప్రసాద్, యామి, రమ్య, సరయు తదితరులు; సంగీతం: శేఖర్‌చంద్ర, కథ, మాటలు, దర్శకత్వం: రవిబాబు, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, నిర్మాత: రామోజీరావు.

ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌ అనగానే ఆహ్లాదకరమైన చిత్రాలు వస్తుంటాయి. కొన్ని సందేశాత్మక చిత్రాలు కూడా గతంలో వచ్చేవి. రానురాను ఆ బేనర్‌లో చిత్రాలు సరైనవి రాకపోవడంతో... నేటి ట్రెండ్‌ దృష్ట్యా కథల్లో కొత్త పుంతలు తొక్కుతున్నతరుణంలో దర్శకుడు రవిబాబు నచ్చావులే... వంటి కాన్సెప్ట్‌తో చాలాకాలం తర్వాత ఆబేనర్‌కు హిట్‌ ఇచ్చాడు. ఇప్పుడు అదే ఫార్మెట్‌లో వచ్చిన సినిమా నువ్విలా. కథాంశం ప్రకారం నువ్విలా ఉండాలనుకుంటే అందుకు ఎదురైన ఆటంకాలను అధిగమించాలన్నదే సందేశం.

ఆనంద్‌ (అజయ్‌) ఇంటర్మీడియెట్‌ పూర్తయ్యాక ఏమి చదవాలనే కన్‌ఫ్యూజ్‌లో ఉంటాడు. ఎందుకంటే.. తన తల్లిదండ్రులు చెరో కోర్సు చేయమంటారు. దీంతో తను మెంటల్‌గా ఫిక్స్‌ అయ్యేవరకుచదువుకు ఆరునెలలు బ్రేక్‌ ఇవ్వాలనుకుంటాడు. మరోవైపు మహేష్‌ (హనీష్‌) మోడల్‌గా ఎదగాలన్నది కోరిక. కన్నవాళ్ళు అలాంటి వేషాలేస్తే చిల్లిగవ్వ కుడా ఇవ్వనంటారు.

మరోవైపు తన తాతకు గుర్తుగా ఉన్న ఫిడేలు వాయించి దాని ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడి ట్రూప్‌‌లో చేయాలని ఆశయంలో రాజు(ప్రసాద్‌) ఉంటాడు. అయితే తండ్రి అందుకు అంగీకరించడు. దీంతో ఈ ముగ్గురు కన్‌ఫ్యూజ్‌తోనే సిటీలోని పిజా ఎక్స్‌ప్రెస్‌లో డెలివరీ బాయ్స్‌గా చేరతారు. ఆనంద్‌కు అర్చన (యామి)తో పరిచయమవుతుంది. క్రికెట్‌ స్టార్‌ విష్ణువర్ధన్‌ అంటే పిచ్చి. ఆ అభిమానం ప్రేమగా మారి కడుపు తెచ్చుకుంటుంది. ఆమె ఫ్లాష్‌బ్యాక్‌ తెలీని ఆనంద్‌ ఆమెను మొదటిచూపులోనే ప్రేమించేస్తాడు. అది ఎంతగా అంటే... అర్చనకు పుట్టబోయే బిడ్డకు తండ్రిగా ఉంటాడు.

మహేష్‌కు రమ్యతో పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఆమె తండ్రి చేష్టల వల్ల విసుగుచెంది రమ్యకు దూరమవుతాడు. తననుకాదన్నందుకు కసిగా ఒక గే ను స్త్రీగా బిల్డప్‌ ఇచ్చి ప్రేమించేలా చేస్తుంది. ఇంకోవైపు ఫిడేలురాజుకు మాధవి (సరయు)తో చిన్నతనం నుంచి పరిచయం. అయితే ఇద్దరూ కలిసినప్పుడల్లా రాజుకు ఏదోవిధంగా లాస్‌ జరుగుతుంది. అలా జీవితం సఫలం అవుతున్న టైంలోనూ మాధవి కలయికతో సీన్‌ మారి... పోలీస్‌స్టేషన్‌లో పెండ్లి చేసుకునేలా చేస్తుంది. ఆ తర్వాత వారు తమ ఆకాంక్షల్ని ఎలా నెరవేర్చుకున్నారు? వారి భావోద్వేగాలు ఏమిటి అనేది సినిమా.

ఇందులో నటించిన నటీనటులు అంతా కొత్తవారే. ఎటొచ్చీ తల్లిదండ్రులుగా చేసింది మాత్రం టీవీ ఆర్టిస్టులు. ఎవరిపాత్రలకు వారు న్యాయం చేశారు. ఆ పరంగా దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. వీరందరినీ పరిచయం చేసే వాయిస్‌ఓవర్‌ను సునీల్‌ ఇచ్చాడు. టోటల్‌గా వినోదప్రధానమైన ప్రేమకథగా దర్శకుడు మలిచాడు. అయితే అందరి ప్రేమలు ఒకేలా ఉండవు కనుక తమాషాగా ప్రేమలు చూపించాడు.

చీటికీ మాటికీ కొట్టుకునే స్నేహితులకు నిజమైన ప్రేమ అంకురిస్తే ఎలా ఉంటుందో... రాజు,మాధవి పాత్రల ద్వారా చూపించారు. వారు ఆ పాత్రలకు సూటయ్యారు. మహేష్‌ తనను కాదన్నందుకు గే ను ప్రేమించేలా చేసిన రమ్యతో సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. తను తండ్రి కాకపోయినా తండ్రికాని తండ్రిగా అజయ్‌ చేశాడు. అలా ఎందుకు చేశాడు... అన్నది సినిమాలో చూడాలి. ఇలా ఒక్కో భిన్నమైన క్యారెక్టర్లు తీసుకుని వాటిని సరైన విధంగా మార్చడంలో రవి సక్సెస్‌ అయ్యాడు. ఇది డైరెక్టర్స్‌ మూవీ.

కాకపోతే...ఇప్పటి జనరేషన్‌లో పేరెంట్స్‌ ఎలా ఉన్నారనేది చెబుతూ.. ఆనంద్‌కు చెల్లెలు పుట్టడం, తను అదే టైమ్‌లో తండ్రికాని తండ్రి కావడం అనేది 'చిత్రం' కాన్సెప్ట్‌ను గుర్తు చేస్తుంది. ఆనంద్‌ పాత్ర ప్రేమాయణం నచ్చావులే తరహాలో అనిపించినా కొత్తగా ఉంది. ఇలా కొత్త కాన్సెప్ట్‌తో తమాషాగా అందరినీ నవ్వించే ప్రయత్నం నువ్విలా...

సంభాషణలు బాగున్నాయి. మనం ఏది చీదరించుకుంటామో అదే జీవితాంతం దగ్గరవ్వాలనుంటుందనే ఫిలాసఫీ టచ్‌ డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. శేఖర్‌చంద్ర సంగీతం ఫర్వాలేదు. నువ్విలా.. అనే టైటిల్‌సాంగ్‌, కూరలు వండేటప్పుడు వచ్చే పాట బాగున్నాయి. ఈ సినిమాకు కథతోపాటు పాటలు కూడా మిళితమయ్యాయి. 'స'అనే పదం తిరగని ఫిడేలు రాజు 'ల'తో సంభాషించి ఆకట్టుకుంటాడు.

మ్యూజిక్‌ డైరెక్టర్స్ కలిసి టాలెంట్‌ చూపే క్రమంలో చక్రి, కళ్యాణమాలిక్‌, ఆర్‌.పి.పట్నాయక్‌, కోటి, కీరవాణి కన్పిస్తారు. చిత్రంలో నటించే నటీనటుల ఫొటోలు కూడా చూపకుండా చిన్నపిల్లలు, కుక్క పిల్లల్తో ఎట్రాక్‌ చేసే ప్రయోగాలు చేసే దర్శకుడు రవిబాబు ఇందులో తన స్టేషన్‌కు వచ్చేవారికి పెండ్లిచేసే ఎస్‌.ఐ.గా కన్పిస్తాడు. 'చిత్రం' నుంచి పరిమిత బడ్జెట్‌లో సినిమాలు తీస్తున్న ఉషాకిరణ్‌ మూవీస్‌ నువ్విలా మొత్తంగా నేటియువత ఆలోచనలకు అద్దంలా ఉంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments