Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ధోనీ"ని ఎక్కడికైనా పంపేస్తేనే..!?

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (11:55 IST)
WD
అవును. ధోనీ.. టెండూల్కర్‌ వీళ్ళను ఎక్కడికైనా పంపేయాలి. లేదంటే.. వారి వల్ల పిల్లలు చెడిపోతున్నారు. చదువు సాగనీయకుండా పొద్దస్తమానమూ... క్రికెట్‌.. క్రికెట్‌.. క్రికెట్‌మ్యాచ్‌లు వస్తే.. టీవీలకు అతుక్కుపోతుంటారు... అప్పుడు కన్నతల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుంది.

వారు తమ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారనేదే 'ధోని' సినిమా.. ప్రకాష్‌రాజ్‌ న్యూయేజ్‌ మూవీస్‌ బేనర్‌ స్థాపించి తనేనిర్మాతగా, దర్శకునిగానే కాకుండా ఫుల్‌లెంగ్త్‌రోల్‌ ప్లే చేస్తూ చేసిన ఈసినిమా తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం విడుదలైంది.

కథలోకి వెళితే...
మధ్యతరగతి మనిషి సుబ్రహ్మణ్యం (ప్రకాష్‌రాజ్‌) ఎం.ఆర్‌.ఓ. ఆఫీసులో గుమస్తా. భార్య చనిపోతే పిల్లలు కార్తీక్‌ (ఆకాష్‌), కావేరి (శ్రీతేజ)కు తల్లిలోటులేకుండా పెంచుతాడు. పిల్లలకు తనిచ్చే ఆస్తి చదువే.. కానీ కొడుకు కార్తీక్‌కు చదువు కంటే క్రికెట్‌ అంటేనే ఇష్టం. క్రికెటర్‌ ధోని అంటే వల్లమాలిన అభిమానం.

ఎప్పటికైనా అంతటివాడిని కావాలన్నది అతని గోల్‌. కానీ సుబ్రమ్మణ్యంకు తన గోల్‌ కన్పిస్తుంది. ఎం.బి.ఎ. చదివించి.. మంచి ఉద్యోగం చేయించాలనేది అతని గోల్‌. క్రికెట్‌ పిచ్చితో స్కూల్లో అన్నిసబ్జెక్ట్‌లోను సున్నా మార్కులు వస్తాయి. అయితే, క్రికెట్‌ కోచ్‌ నాజర్‌ కార్తీక్‌ ఇంట్రస్ట్‌చూసి ప్రోత్సహిస్తుంటాడు.

స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తనికెళ్ళభరణి సుబ్రమ్మణ్యంను పిలిచి మీ వాడిచదువులో పూర్‌.. వేస్టు. ఇలాంటి వాడు ఉంటే మా స్కూల్‌కు చెడ్డపేరు వస్తుందని చీవాట్లు పెడతాడు. దాంతోఆవేశంతో ఇంటికి వెళ్ళాక.. కార్తీక్‌పై చేయిచేసుకుంటాడు సుబ్రహ్మణ్యం. ఆ దెబ్బకు టేబుల్‌పైపడిన కార్తీక్‌ తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళతాడు. ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని డాక్టర్లు తేల్చేస్తారు.

తను చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోయి.. తన ఆవేశాన్ని ఇప్పటి విద్యావిధానంపై వెల్లగక్కుతాడు. అది టీవీ ముందు చెబుతాడు. సుబ్రహ్మణ్యం చెప్పిన నిజాలు విని ఎంతోమంది అభినందిస్తారు. అందులో న్యూరాలజిస్టు ఒకరు. సుబ్బును వెతుక్కుంటూవచ్చి... అతని కొడుకిని ఆపరేషన్‌చేసి కాపాడతాడు. ఆ తర్వాత కార్తీక్‌ రాష్ట్రస్థాయి జూనియర్‌ పోటీలో పాల్గొని జట్టును విజయపథంవైపు నడిపిస్తాడు.. ఇదీ కథ.

ఈ చిత్రం చూస్తుంటే... రెండు మూడు సినిమాలు గుర్తుకు వస్తాయి. తారేజమీన్‌పర్‌ గుర్తుకువస్తుంది. మరాఠీ చిత్రంలోని కంటెంట్‌ను తీసుకుని నేటివిటికీ తగినట్లు ప్రకాష్‌ చేసిన ప్రయోగం బాగుంది. ఒన్‌మేన్‌ షోగా ప్రకాష్‌రాజ్‌ తన నటనతో కట్టిపడేశాడు. సన్నివేశపరంగా మెస్మరైజ్‌చేశాడు. హృదయవిదారకర సన్నివేశాల్లో ప్రేక్షకుల గుండెలు బరువెక్కాలా చేశాడు.

ఒక మధ్య తరగతి కథను ఎంచుకుని సక్సెస్‌ సాధించాడు. ఆకాష్‌, శ్రీతేజ పాత్రలు బాగా పోషించారు. మిగిలిన పాత్రల్లో నాజర్‌, గొల్లపూడి మారుతీరావు తదితరులు సరిపోయారు. మద్యతరగతి సరదాలు, సంతోషాలు, విషాదాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పక్కింటి అమ్మాయిగా రాధికా ఆమ్టే నటించింది. జీవితంలో జరిగిన చిన్న తప్పు ఎలాంటి స్తితికి తీసుకువచ్చిందనేది ఆమె పాత్ర ద్వారా చూపించాడు.

పాటలపరంగా సీతారామశాస్త్రి రాసిన సాహిత్యం బాగుంది. ఇళయరాజా నేపథ్యసంగీతం కథకు సూటయింది. గుహన్‌ కెమరా పనితం బాగుంది. సంభాషణలు చిత్రానికి జీవం పోశాయి...ఎడ్యుకేషన్‌ వ్యవస్థను మార్చాలనేది ప్రధాన పాయింట్‌. దాన్ని సి.ఎం. దృష్టికి తీసుకు వచ్చే విధానం, సి.ఎం. ప్రతిస్పందించిన విధానం అంతా సినిమాటిక్‌గా ఉన్నా... అది నిజంగా జరిగితే సమాజం ఎంతో బాగుపడుతుందనేది కూడా చెప్పాడు.

ఇది సినిమా కాబట్టి.. సినిమావరకు అది హైలైట్‌గా నిలుస్తుంది. విద్యావిధానం మారాలని ఎన్నోపార్టీలు, నాయకులు చెబుతున్నారు. కానీ మార్చేశక్తి... ఎవరికీ లేదు. ఇంకా బ్రిటీష్‌ విద్యావిధానంలోనే మనం మగ్గుతున్నాం. గుమస్తాగిరీలోనే కొట్టుమిట్టాడుతున్న యువతకు... తనకున్నటాలెంట్‌తో ఏరంగంలోనైనా వెళ్ళడానికి తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సాహం ఎంతైనా ఉందని చెప్పే చిత్రమిది. సందేశాత్మకం, ఆలోచనాత్మకంగా ఉన్న ఇటువంటి చిత్రాన్ని కమర్షియల్‌గా ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments