Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తదనం పేరుతో పైత్యం.. ప్రేమ ఇష్క్‌ కాదల్‌... సెక్స్ కామనేనంట...

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2013 (15:04 IST)
WD
ప్రేమ ఇష్క్‌ కాదల్ నటీనటులు: హర్షవర్ధన్‌ రానే, వితిక, విష్ణువర్ధన్‌, రీతువర్మ, హరీష్‌, శ్రీముఖి. పవన్‌ సాదినేని దర్శకత్వం, డి.సురేష్‌ బాబు సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్‌-లక్కీ మీడియా సంస్థలు నిర్మించారు. శ్రవణ్‌ సంగీతం, వేణుగోపాల్‌ నిర్మాత.

విడుదల: శుక్రవారం.. 6.12.2013

సినిమాలు రొటీన్‌ కాకుండా కొత్తదనం అనేది ఉంటుందని ప్రతి వారూ చెబుతుంటారు. ఆ కొత్తదనం ఏమిటో తమ చిత్రంలో ఉందని పబ్లిసిటీ చేసుకున్న నిర్మాతలు.. అంతా కొత్తవారితో ఏం నూతనత్వం చూపించారనేది తెలుసుకుందాం...

కథ గురించి చెప్పాలంటే....
భిన్నంగా ఆలోచించేవిధంగా దర్శకుడు తొలి సన్నివేశంలోనే టైటిల్‌ గురించి చెప్పేస్తాడు. సినిమా షూటింగ్‌కు ఓ దర్శకుడు స్క్రిప్ట్‌ రెడీ చేసుకుని హీరోకు చెబుతాడు. హీరో సత్యంరాజేష్‌... టైటిల్‌ వినగానే.. లవ్‌ లవ్‌.. లవ్‌.. అని పెట్టేయ్‌ అంటాడు. ప్రేమ ఇష్క్‌ కాదల్ అనేది మూడు భాషల్లో పలికినా.. అర్థం ఒక్కటేగా... అనేది హీరో పాయింట్. కథ ఇలా సాగుతుంది. సినిమా మొత్తం సినిమా షూటింగ్‌ నేపథ్యంలో సాగుతుంది.

షూటింగ్‌ కవరేజ్‌కు వచ్చిన అర్జున్‌ 93.7బిగ్‌ ఎఫ్‌.ఎం.లో జాకీ. అమ్మాయిల వీకెనెస్‌.. కంటికి కనబడితే బాత్‌రూమ్‌లోనో, కారులోనూ పని కానిచ్చేరకం. అలాంటి వ్యక్తికి మరో అమ్మాయిని చూడగానే తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. మరోవైపు... కాఫీషాప్‌ నడిపే డాలీ. ఇతనో గిటారిస్ట్‌... అనాథాశ్రయానికి తన సంపాదనలో కొంత మొత్తాన్ని దానం చేస్తాడు.

అది చూసి రీతూవర్మ తను చదివే కాలేజీలో అతనితో ప్రోగ్రామ్‌ చేయాలని ప్రయత్నిస్తుంది. మూడో వ్యక్తి.. భీమవరం నుంచి హైదరాబాద్‌ వస్తాడు. తనలాగే మందుగొట్టే అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని తనను చీదరించుకున్న మరదలిపై కోపంతో ఇక్కడకు వస్తాడు. ఇలా ముగ్గురివీ మూడు రకాల కథలు. ఈ ముగ్గురి లవ్‌లు చివరికి సక్సెస్‌ కావు... ఎందుకని అనేది సినిమా.

అంతా కొత్తవారు కావడంతో ఎవరిపేరు ఏమిటో చెప్పడానికి గుర్తుకురాదు. పాత్రలపరంగా అందరూ బాగానే చేశారనే చెప్పాలి. భీమవరం నుంచి వచ్చిన వ్యక్తి రవితేజను ఇమిటేడ్‌ చేస్తూ లాగించేశాడు. అలాగే హీరోయిన్లు కూడా టెక్నికల్‌గా... సంగీతం కొత్తగా లేకపోయినా వినడానికి పర్లేదు అనిపించేలా ట్యూన్స్‌ ఉంటాయి. ఎడిటింగ్‌ ఈ చిత్రానికి ప్రత్యేకత ఉంది. చాలా సీన్స్‌ ఎలా వెళుతున్నాయో అనేది గందరగోళంగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే కొత్తదనం కోసం హాలీవుడ్‌ శైలిలో తీసేశాడు. అసలు దర్శకుడు ఈ చిత్రం ద్వారా ఏం చెప్పదలచుకున్నాడో అర్థంకాదు.

యువతరం సినిమా రంగంలో ప్రవేశించడంతో... వారి ఆలోచనలకు అనుగుణంగా కథలు పుట్టుకు వస్తున్నాయి. డి.సురేష్‌ బాబు తన ట్రైనింగ్‌ స్కూల్లో వున్న విద్యార్థులతో చేసిన ప్రయత్నంగా కన్పిస్తుంది. టోటల్‌గా ఇది ఓ డాక్యుమెంటరీగా ఉంటుంది. దాన్ని సినిమాగా మార్చేసి దర్శకుడు పవన్‌ ప్రయత్నం చేశాడు.

విశ్లేషణ :
ఇప్పటి యూత్‌.. అంటే యువతీయువకులు అనేవారు. ప్రేమ పేరుతో ఎటువంటి పోకడలు పోతున్నారనేది చూపించాడు. రేడియో జాకీలు... శ్రోతలతో మాట్లాడుతూనే.. తెలివిగా అడ్రెస్‌లు తీసుకోవడం.. వారిని లైన్లో పెట్టడం వంటివి కళ్ళకు కట్టినట్లు చూపించిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అయితే చివరకు అతను మనసుపడిన అమ్మాయి కూడా జాకీనే. ఆమె తన ప్రమోషన్‌ కోసం బాస్‌కు లొంగిపోవడం జరుగుతుంది.

డాలీ అనే గిటారిస్ట్‌ వెంటబడే మరో అమ్మాయి కూడా చివర్లో తనే ఎరేంజ్‌ చేసిన అతని చేత షోను ఏర్పాటు చేసి... తనమీద ప్రేమ ఉంటే.. షోను వదులుకుని రావాలంటుంది. తీరా వస్తే.. నువ్వెవరో నాకు తెలియదంటుంది. ఇక మూడో జంట.... ఊరు నుంచి వచ్చిన వ్యక్తి. తను పనిచేసే షూటింగ్‌లోనే కాస్ట్యూమర్‌ను ప్రేమిస్తాడు. బలహీన క్షణంలో ఇద్దరూ ఒక్కటి అయిపోతారు. ఊరు నుంచి వచ్చాడు కాబట్టి తన ఆలోచనలకు అనుగుణంగా తర్వాత రోజు గుడికి వెళ్ళి తాళి కడతానంటాడు. మనిద్దరి మధ్య ఏం జరగలేదు... ఇదంతా హైదరాబాద్‌లో కామనే అంటూ ఆమె ట్విస్ట్‌ ఇస్తుంది.

ఇలా భిన్నమైన ఆలోచనలు యువతలో ఉందంటూ పాశ్చాత్య పోకడలను తెలుగు ప్రేక్షకులపై దర్శకనిర్మాతలు రుద్దే ప్రయత్నం చేశారు. కల్చర్‌ మారిపోతుంది. దేశం మారిపోతుందంటూ.. వస్తున్న రకరకాల కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసేస్తున్నారు. అబ్బాయిల్లోనూ మంచివారు లేరు. అమ్మాయిల్లోనూ లేరు.. ఎవరు ఎవరిని ఇష్టపడరు. ప్రేమించరు. పరిస్థితులను బట్టే మారుతుంటారు. ప్రేమ కూడా అలా మారేదే.. అదే యువత జీవితం. అదే వారి ప్రయాణం.. అని చెప్పదలచుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం నాలుగు రోజులు ఆడినా పర్లేదనే తీసినట్లుగా ఉంది.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే