Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వచ్చినవాడు ఒంటరిగానే పోతాడన్నదే సంఘర్షణ!

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2011 (16:47 IST)
WD
WD
నటీనటులు: అల్లరి నరేష్‌, శశికుమార్‌, స్వాతి, వసుంధర, నివేద తదితరులు

తెలుగు నిర్మాతలు: దాము, టింబర్‌, అమ్మిరాజు. దర్శకత్వం: సముద్రఖని

' శంభో శివ శంభో' చిత్రం తర్వాత సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన మరో తమిళ చిత్రం కథ వెట్రాలియల్‌కు డబ్బింగ్‌ 'సంఘర్షణ'. మొదటి సినిమాలో హీరోలు ఛేజింగ్‌లు ఉన్నట్లే ఇందులోనూ ఛేజింగ్‌లున్నాయి. కథ కూడా కొత్తదేమికాదు. తీయడంలో వినూత్నంగా తీశాడు.

కథ: భూమండలంలో పిల్లులు, మేకలు, పులులు, గుడ్లగూబలు, ఆవులు మొదలైన జంతువులు సకిలిస్తే అవి ఎటువంటి మృగాలు ఇట్టే కనిపెట్టవచ్చు. కానీ అవన్నీ ఒక్క మనిషిలో ఉంటే కనిపెట్టడం కష్టం. వారితో నిరంతం పోరాడాలి. సంఘర్షణ పడాలి. ఈ చిత్ర కాస్పెన్ట్‌ ఇదే అంటూ దర్శకుడు చెప్పిన డైలాగ్‌తో సినిమా ప్రారంభమవుతుంది.

శశికుమార్‌, అల్లరి నరేష్‌ ఓ రాత్రి తామున్న రూమ్‌ నుంచి పారిపోయి సిటీకి వస్తారు. అక్కడ పులిరాజు అనే స్నేహితుడ్ని కలుస్తారు. ఇంటి అద్దె సరిగ్గా చెల్లించని అతనే ఇంటి యజానికి భారం. అలాంటి వాడిని వీరిద్దరూ మేనేజ్‌ చేస్తారు.

పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ, స్వంతంగా 'మే ఐ హెల్ప్‌యు' అనే కాన్సెప్ట్‌తో ప్రజలకు సేవలందిస్తుంటారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పది మందికి పని కల్పించే స్థితికి వస్తారు. ఈ విషయం పేపర్‌ వరకు వెళ్ళి ప్రకటన రూపంలో అందరికీ తెలుస్తుంది. అలా శశికుమార్‌ ఊరిలో తెలిసి అతన్ను వెతుక్కుంటూ ఓ ముఠా వస్తుంది.

WD
WD
వెంటాడి చంపేందుకు ప్రయత్నిస్తుంది. వారి బారిన తప్పుకుని ఓ ప్రాంతంలో తలదాచుకుంటారు. అప్పటివరకు వీరి గురించి ఎవ్వరికీ తెలీదు. నరేష్‌ ప్రేమించిన వసుంధర, శశికుమార్‌ను ప్రేమించి స్వాతి నిలదీయడంతో ప్లాష్‌బ్యాక్‌లో కథసాగుతుంది. శశికుమార్‌ తండ్రి ఊరి కామందు. రెండో వివాహం చేసుకోవడంతో పిన్ని శశికుమార్‌ను సరిగ్గా చూడదు. ఆస్తి కోసం శశికి పిచ్చిపట్టినట్లు ప్రచారం చేస్తుంది. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పిస్తారు. అక్కడే నరేష్ పరిచయం. ఆ తర్వాత కథేంటి అనేది సినిమా.

పాత్రలకు తగిన నటీనటుల్ని దర్శకుడు ఎంపిక చేయడంలో ప్రతిభ కనబడింది. తమిళ సినిమా కనుక సహజత్వం అనేది కొట్టొచ్చిట్లు కన్పించినట్లేగా తెరకెక్కించాడు. నైట్‌ సన్నివేశాల్లో లైటింగ్‌, డేలో లైటింగ్‌ను చక్కగా మూడ్‌లో తీసుకెళ్ళే విధంగా కెమెరామెన్‌ బాగా చూపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ బాగుంది. చుట్టాలు, బంధువులు, అప్యాయతలు అవన్నీ వట్టి డ్రామా... ఒంటరిగా వచ్చినవాడే ఒంటరిగానే పోతాడు.. అంటూ వేదాంతధోరణిలో సన్నివేశపరంగా శశికుమార్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఆర్భాటం సెట్లు, హంగులు లేకుండా నాచురల్‌గా సినిమా తీశాడు. దానికి నటీనటులు, సాంకేతికసిబ్బంది కుదిరారు.

లోబడ్జెట్‌ చిత్రమిది. భారీ ఆర్భాటాలు లేకుండా పరిమిత బడ్జెట్‌తో తీశారు. పాత్రలకు తగినట్లు కేశాలంకరణ, దుస్తులు ఉన్నాయి. చాలా సింపుల్‌గా తీసిన ఈ చిత్రం మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మొదటి భాగం చాలా సరదాగా దర్శకుడి క్రియేషన్‌ను తెలియజేస్తుంది. రెండో భాగం కథంతా చెప్పేసరికి ష్లాష్‌బ్యాక్‌ కాస్త బరువుగా అనిపిస్తుంది. రెండు వేర్వేరు కథల్లా అనిపిస్తాయి. తమిళ చిత్రాలను లైక్‌ చేస్తున్నవారికి ఈ చిత్రం నచ్చుతుంది.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాజా వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments