Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమరాజతో వస్తున్న శివ కార్తికేయ‌... సమంత-కీర్తి సురేష్‌లు హిట్టిస్తారా?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (21:05 IST)
ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ రెమోలో అధ్భుతంగా నటించి తెలుగు ప్రేక్ష‌కులంద‌రి ప్ర‌శంశలు పొందిన శివ కార్తికేయ‌న్ హీరోగా, స‌మంత, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా త‌మిళంలో ప్ర‌ముఖ నిర్మాత ఆర్.డి.రాజా 24 ఏమ్ స్టూడియెస్ బ్యాన‌ర్లో నిర్మించిన చిత్రం సీమ‌రాజ‌. ఈ చిత్రం త‌మిళంలో విడుద‌లై క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్స‌స్‌ని సాధించింది. 
 
ఈ చిత్రానికి పొన్ర‌మ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని గ‌తంలో చాలా చిత్రాలు డిస్ట్రిబ్యూష‌న్, నిర్మాణం చేసిన ప్ర‌ముఖ‌ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల సాయికృష్ణా ఫిలింస్ ద్వారా తెలుగులో అనువాదం చేశారు. ల‌క్ష్మి పెండ్యాల స‌మ‌ర్పిస్తున్న ఈ సీమ‌రాజ ని ఫిబ్ర‌వ‌రి 8న తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. 
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత సాయికృష్ణా పెండ్యాల మాట్లాడుతూ.. రెమో చిత్రం ధియేట‌ర్స్‌లో యావ‌రేజ్‌గా ఆడింది కానీ.. టీవీలో మాత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఎప్పుడూ ఆ చిత్రం వ‌చ్చినా కూడా ఫ్యామిలి అంతా క‌లిసి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ చిత్రంతో శివ‌కార్తికేయ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా దగ్గ‌ర‌య్యాడు. రెమో త‌రువాత తెలుగులో శివ‌కార్తికేయ‌న్ న‌టించిన సీమ‌రాజ ఫిబ్ర‌వ‌రి 8 న విడుద‌ల కానుంది. 
 
ఈ చిత్రాన్ని సాయికృష్ణా ఫిలింస్ బ్యాన‌ర్ ద్వారా తెలుగులో విడుద‌ల చేస్తున్నాం. రెండు ఊళ్ల మధ్య జ‌రిగే ప‌క్కా క‌మర్షియ‌ల్ చిత్రం ఈ సీమ‌రాజ‌. త‌మిళంలో బి, సి సెంట‌ర్స్‌లో క‌లెక్ష‌న్లు దుమ్మురేపింది. సీమ‌రాజగా శివ‌కార్తికేయ‌న్ న‌ట‌నకి మాస్ ఆడియ‌న్స్ విజిల్స్ ప‌డ‌టం ఖాయం. త‌మిళంలోలా తెలుగులో కూడా క‌మ‌ర్షియ‌ల్‌‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంది. అతి త్వ‌ర‌లో మ్యూజిక్‌ని విడుద‌ల చేస్తాం. ల‌క్ష్మి పెండ్యాల స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని త‌మిళంలో ఆర్‌. డి. రాజా నిర్మించారు. స‌మంత చాలా మంచి పాత్ర‌లో న‌టించిది. ఫిబ్ర‌వ‌రి 8న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments