Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శివగామి" అదిరిపాటుగా ఆడుతుంది...

కన్నడలో ఘన విజయం సాధించిన "నాని" అనే హారర్ చిత్రం తెలుగులో "శివగామి"గా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. భీమవరం టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు,

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:43 IST)
కన్నడలో ఘన విజయం సాధించిన "నాని" అనే హారర్ చిత్రం తెలుగులో "శివగామి"గా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. భీమవరం టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, జై జగదీశ్, కల్పన, రాధ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసినీ మణిరత్నం ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. త్యాగరాజ్-గురుకిరణ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విశేష ఆదరణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని.. "శివగామి" ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు.
  
ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివాజీరాజా,  ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ పి.సత్యారెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోశాధికారి కొడాలి వెంకటేశ్వరావు, ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరావు, గజల్ శ్రీనివాస్, ప్రముఖ నిర్మాతలు కె.వి.వి.సత్యరాయణ, జీవి.చౌదరి, నాగరాజు గౌడ్ చిర్రా, జూలకంటి మధుసూదన్ రెడ్డి, సంతోషం సురేష్, అఖిల భారత ఆర్య వైశ్య మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి నల్లమిల్లి రాధ, ఎన్నారైలు  సతీష్ రెడ్డి పున్నం, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు "శివగామి" చిత్రానికి మాటలు, పాటలు రాసిన భారతిబాబు, ఈ చిత్రంలో ఓ గీతాన్ని ఆలపించిన కుమారి సంస్కృతీ, చిత్ర సమర్పకులు రమేష్ కుమార్ జైన్, దర్శకులు సుమంత్, కెమెరామెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
 
"శివగామి" ట్రైలర్స్‌లో సక్సెస్ కళ కనబడుతోందని, కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని,  "శివగామి" విడుదల తర్వాత.. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ పేరు "శివగామి సత్యనారాయణ"గా మారిపోతుందని వక్తలు ఆకాక్షించారు. నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. "నెల రోజుల క్రితం కన్నడలో విడుదలై అఖండ విజయం సాధించి.. ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో నడుస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ ఖఛ్చితంగా ఘన  విజయం సాధిస్తుంది. ఆంద్ర, తెలంగాణాల్లో అత్యధిక ధియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ఈనెల 5న విడుదల చేస్తున్నాం" అన్నారు. 
 
అనంతరం సి.కళ్యాణ్, శివాజీరాజా చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు ప్లాటినం డిస్క్ షీల్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా.. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సి,కళ్యాణ్, ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా నియమితులైన సత్యారెడ్డిలను రామ సత్యనారాయణ ఘనంగా సత్కరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments