Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి థియేటర్లలో మనోజ్, రెజీనా 'శౌర్య'

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2016 (19:54 IST)
మంచు మనోజ్‌, రెజీనా జంటగా దశరథ్‌ దర్శకత్వంలో శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ పూర్తిచేసుకుని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. విడుదలయిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. దీంతో సినిమాపై నమ్మకం పెరిగింది. వేద సంగీతదర్శకునిగా పరిచయం కాబోతున్నాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పాటలు బావున్నాయి. దశరథ్‌ సినిమా స్టొరీ చెప్పినప్పుడు ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే కథను ఓకే చేసేశాను. త్వరలోనే సినిమా ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చేయనున్నామని' చెప్పారు.
 
దసరథ్‌ మాట్లాడుతూ.. ఈరోజు కొత్త ట్రైలర్‌ను విడుదల చేశాం. మార్చి 4న సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. ప్రేమకథే అయినా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రించాం' అని చెప్పారు. నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ.. తొలి సినిమా అయినా వేద మంచి ట్యూన్స్‌ అందించాడు. ఇదివరకు మా బ్యానర్‌లో డైరెక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, హీరోయిన్‌ను పరిచయం చేశాం. 
 
ఈ సినిమాను ఓవర్‌సీస్‌తో కలిపి వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నాం. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనుకున్నారు. అందరికి లాభాలు రావాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరికుప్పల యాదగిరి, వేద, ప్రభాస్‌ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు చిత్ర విజయాన్ని కాంక్షించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments