Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌, శ్రుతి హాసన్ 'పూజ'కు బిజినెస్‌ క్రేజ్‌...

Webdunia
బుధవారం, 8 అక్టోబరు 2014 (21:14 IST)
విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై హీరో విశాల్‌ నటిస్తూ నిర్మిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పూజ'. యాక్షన్‌ చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరుచుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 22న తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు రిలీజ్‌ కాబోతోంది. 
 
ఈ సందర్భంగా హీరో, నిర్మాత విశాల్‌ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా మంచి స్పందన వస్తోంది. యువన్‌ శంకర్‌రాజా చేసిన సంగీతం చాలా పాపులర్‌ అయింది. త్వరలోనే ఈ చిత్రం ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను చేయబోతున్నాం. ఈ చిత్రానికి బిజినెస్‌పరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. హరి కాంబినేషన్‌లో 'పూజ' నాకు మరో సూపర్‌హిట్‌ చిత్రం అవుతుంది'' అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వడ్డి రామానుజం మాట్లాడుతూ - ''బిజినెస్‌పరంగా ఈ చిత్రానికి చాలా పెద్ద ఆఫర్స్‌ వస్తున్నాయి. అన్ని ఏరియాల నుండి బయ్యర్స్‌ ఈ చిత్రం కోసం పోటీ పడటం విశేషం. నైజాంలో గ్లోబల్‌ పిలింస్‌ సునీల్‌, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఏరియాల్లో హరి పిక్చర్స్‌ హరి, వైజాగ్‌ ఏరియాలో వి.బి.ఎం.రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. విశాల్‌ కెరీర్‌లోనే 'పూజ' బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది'' అన్నారు. 
 
విశాల్‌ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రాధిక, అభినయ, జయప్రకాష్‌, మనోబాల, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌ రాజా, సినిమాటోగ్రఫీ: ప్రియన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వడ్డి రామానుజం, నిర్మాత: విశాల్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

Mid Day Meals: సూపర్ వెరైటీ రైస్‌తో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులు హ్యాపీ.. కానీ వారికి మాత్రం కష్టాలు..?

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments