Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చేతుల మీదుగా "పిల్లా నువ్వులేని జీవితం" ఆడియో

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (12:30 IST)
మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా, రెజినా హీరోయిన్‌గా మెగా ప్రొడ్యూసర్  అల్లు అరవింద్ స‌మ‌ర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ మ‌రియు శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. బన్ని వాసు, శ్రీ హ‌ర్షిత్ లు నిర్మాత‌లు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శకుడు. 
 
ఈ ఆడియోను అక్టోబ‌ర్ 25న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మెగా అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేనున్నారు. డిజిట‌ల్ లాంచ్‌లో భాగంగా రేడియో మిర్చి స్టేష‌న్‌లో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్‌ని విడ‌ద‌ల చేశారు.
 
ఈ సంధ‌ర్బంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. ఇదివ‌ర‌కు పూజ‌కి లాంచ్ చేసేవాళ్ళం. త‌రువాత షూటింగ్ లాంచ్ అనేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ గా డిజిట‌ల్ లాంచ్ అంటున్నారు. ఈ లాంచ్‌లొ పిల్లా నువ్వు లేని జీవితం అనే చిత్రానికి సంభందించి ఓ సాంగ్‌ని విడుద‌ల చేశాం. ఆడియోని చిరంజీవి గారు, రామ్‌చ‌ర‌ణ్ , అల్లు అర్జున్ మ‌రియ మా హీరోలంద‌రూ చేతుల మీదుగా విడుద‌ల చేయ‌నున్నాము. సాయి ధ‌ర‌మ్ తేజ్ చాలా బాగా చేశాడు. ఈ ఆడియో ని 25న విడుద‌ల చేయ‌నున్నాము.. అని అన్నారు.
 
ద‌ర్శకుడు ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ.. నాకు మ‌రో జ‌న్మనిచ్చిన అర‌వింద్ గారికి, దిల్ రాజు గారికి నా ధ‌న్యవాదాలు. ఆడియో 25న విడుద‌ల‌వుతుంది. ప్రముఖులు హాజ‌ర‌వుతున్నారు. చాలా ఆనందంగా వుంది. నా నిర్మాత‌లు బ‌న్ని వాసు, శ్రీ హ‌ర్షిత్‌లు నాకు ఇచ్చిన స‌పోర్ట్ మ‌రిచిపోలేనని అన్నారు.
 
హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ.. మా సినిమా ఆడియో 25న విడ‌ుద‌ల‌వుతుంది. అనూప్ సూప‌ర్ ఆడియో ఇచ్చాడు. ఈ అవ‌కాశాన్ని నాకిచ్చిన అంద‌రికి ధన్యవాదాలని అన్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments