Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయాకామ్ 18 - వైజయంతి మూవీస్ భాగస్వామ్యంలో 'దేవదాస్'

ముంబయికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వయాకామ్ 18 మీడియా' ప్రతిష్టాత్మక 'వైజయంతి సంస్థ'తో చేతులు కలపనుంది. వైజయంతి మూవీస్ కింగ్ నాగార్జున - నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ 'దేవదాస్' చిత్రానికి వయా కామ్ 18 భాగ స్వామిగ

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (15:06 IST)
ముంబయికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వయాకామ్ 18 మీడియా' ప్రతిష్టాత్మక 'వైజయంతి సంస్థ'తో చేతులు కలపనుంది. వైజయంతి మూవీస్ కింగ్ నాగార్జున - నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ 'దేవదాస్' చిత్రానికి వయా కామ్ 18 భాగ స్వామిగా దక్షిణాది చిత్ర సీమలో అడుగు పెట్టనున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీద‌త్ మాట్లాడుతూ, "వయా కామ్ 18తో భాగస్వామిగా కావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. 'దేవదాస్'తో దక్షిణాది చిత్ర సీమలోకి ప్రవేశిస్తున్న వారికి టాలీవుడ్ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం అన్నారు. 
 
వయా కామ్ 18 సీవోవో అజిత్ అంధారే మాట్లాడుతూ... అశ్వనీద‌త్‌గారి ప్రఖ్యాత వైజయంతి మూవీస్ సంస్థ భాగస్వామ్యంలో భారీ చిత్రం 'దేవదాస్'తో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మా సంస్థ తెలుగులో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న దత్‌గారు, వైజయంతి మూవీస్ భాగస్వామ్యంతో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాం. కింగ్ నాగార్జున - నాచురల్ స్టార్ నానిల కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న‌ 'దేవదాస్'తో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
 
కింగ్ నాగార్జున - నాచురల్ స్టార్ నాని హీరోలుగా, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మెగా మేకర్ అశ్వనీద‌త్ వైజయంతి మూవీస్ బ్యానర్ పైన నిర్మిస్తున్న దేవదాస్ షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల చివరి దశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన మూడు పాటలూ సూపర్ హిట్‌గా నిలిచి విశేషాదరణ పొందాయి. 'దేవదాస్' ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.
 
ఇతర ముఖ్య పాత్రల్లో నరేష్ వికె, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య, నిర్మాత : అశ్వనీద‌త్, బ్యానర్ : వైజయంతి మూవీస్, వయా కామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సంగీతం : మణిశర్మ
డీ ఓ పి : శాందత్ సైనుద్దేన్, ఆర్ట్ : సాహి సురేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా

మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments