Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 10న కమల్‌ హాసన్‌ 'విశ్వరూపం 2'

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (19:10 IST)
యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆస్కార్‌ ఫిలింస్‌ వి.రవిచంద్రన్‌ తెలిపారు.
 
కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌, ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments