Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ నుంచి బయటపడ్డ డిగ్రీ కాలేజ్

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (19:51 IST)
అవార్డు చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డిగ్రీ కాలేజ్. తన పంధాకు భిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్య రావు హీరోహీరోయిన్లుగా శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
 
అతిధిగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ట్రైలర్‌ని విడుదల చేసి... చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ... ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యధార్థ‌ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసాం. ఆ అబ్బాయి, అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో ఆ అంశాలనే ఇందులో చూపించాం. ఆమధ్య విడుదల చేసిన ఈ చిత్రం మొదటి ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయి. 
 
అదే సమయంలో ట్రైలర్‌ని చూసిన కొంతమంది ఈ చిత్రానికి సెన్సార్ ఎలా వస్తుందో చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు. కానీ సెన్సార్ నిబంధనల ప్రకారంగా ఇస్తారు. చాలా రోజులు సెన్సార్లోనే ఈ చిత్రం ఉండిపోయింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సెన్సార్ పరంగా సమస్య ఎదురు కావడంతో రీవైసింగ్ కమిటీకి ఈ చిత్రాన్ని పంపడం జరిగింది.

కేవలం రెండు దృశ్యాలను మాత్రమే కట్ చేసారు. ఇలాంటి కథను యధాతదంగా చూపించడానికి దైర్యం కావాలి అంటూ అందరూ ప్రశంసించారు. గతంలో నేను తీసిన సినిమాలకు అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి రివార్డులు వస్తాయి. డిసెంబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాము అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments