విభిన్నమైన కాన్సెప్ట్‌లతో లిమిటెడ్ బడ్జెట్లో చిన్న చిత్రాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్న మారుతి టీం వర్క్స్ ప్రొడక్షన్లో సినిమా లవర్స్ సినిమా బ్యానర్లో మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో సిద్దమైన చిత్రం 'క్లోజ్‌ఫ్రెండ్స్'. ఊర్వశి థియేటర్స్ అసోసియోషన్తో ఈ చిత్రం చేస్తున్నారు. నందు, మధు నందన్, అభిషెక్ మహర్షి, నవీద్, మధురిమ, కేషా, క్రాతి, షామిలి, భార్గవిలు జంటలుగా నటిస్తున్నారు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాతగా అరుణ్ పవర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు.
ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథాచిత్రమ్, కొత్తజంట, లవర్స్ లాంటి సూపర్‌డూపర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన జీవన్ బాబు(జె.బి) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్ నెట్లో సంచలనాన్ని క్రియేట్ చేయటంతో యూనిట్ సభ్యులు హ్యాపీగా ఉన్నారు. ఇప్పడు జె.బి అందిచిన ఆడియో ఏప్రిల్ 22న వైవిధ్యంగా ఈ చిత్ర ఆడియోని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.
ఈ సందర్బంగా నిర్మాత కుమార్ అన్నంరెడ్డి మాట్లాడుతూ"మారుతి టీంవర్క్స్తో అనుబంధంగా మా బ్యానర్ సినిమా లవర్స్ సినిమాపై ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా మా దర్శకుడు అరుణ్ పవర్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని చేశాము. దర్శకుడు పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే రష్ చూశాం పూర్తిగా అందరూ నవ్వుతూనే వున్నాము. నవ్విస్తూనే చక్కటి క్లైమాక్స్‌ని అందించాడు.
ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు జీవితాల్లో మరో కొంతమంది ఎంటరయ్యి వారి జీవితాల్ని ఎలా మార్చారు చివరకి ఏమయ్యింది అనేది చిత్రం. సెకండాఫ్‌లో సప్తగిరి వచ్చి చేసే కామెడికి థియేటర్ మెత్తం విజిల్స్ పడతాయి, ఈ చిత్రానికి సూపర్‌డూపర్ మ్యూజిక్ దర్శకుడు జె.బి సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో ని ఏప్రిల్ 22 న విడుదల చేస్తున్నాము. చిత్రాన్ని ఈ సమ్మర్ లోనే విడుదల చేస్తాము."అని అన్నారు
దర్శకుడు అరుణ్ పవర్ మాట్లాడుతూ.. మారుతి గారికి ఈ కథ చెప్పాను, కథ కంటే కథనం చాలా బాగుందన్నారు. నిర్మాత కుమార్ గారికి చెప్పి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రాల రాజమౌళి మారుతి గారు నాలాంటి కొత్త వారికి అవకాశాల్ని ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు వారికి నా దన్యవాదాలు. ఈ చిత్రం నలుగు జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది మెయిన్ కాన్సెప్ట్ వినోదంతో చెప్పాం.
సెకండాఫ్‌లో సప్తగిరి చేసే అల్లరి అంతాఇంతా కాదు. మారుతి గారి బ్యానర్ సప్తగిరి అంటే నవ్వులకి కొదవుండదు. అలానే అందరూ నటీనటులు సూపర్బ్‌గా నటించారు. జె.బి గారు అందించిన సూపర్బ్ మ్యూజిక్ ని ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నాం. అలానే ఈ సమ్మర్ లో ఫ్యామిలి అంతా కలిసి చూసేలా మా క్లోజ్‌ఫ్రెండ్స్ చిత్రం వుంటుంది."అన్నారు